- Telugu News Photo Gallery Cinema photos Lavanya Tripathi latest stunning photos goes viral in internet
Lavanya Tripathi: అందం ఈ వయ్యారి ఇంట బందీగా ఉందేమో.. వదిలి వెళ్లలేకపోతుంది..
లావణ్య త్రిపాఠి కొణిదెల తెలుగు, తమిళ చిత్రాలతో కథానాయకిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. తెలుగులో దాదాపు అందరు హీరోలకి జోడిగా కనిపించింది. రెండు SIIMA అవార్డులు, ఒక ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ నామినేషన్‌లతో పాటు అనేక అవార్డులను అందుకున్నారు. తెలుగు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది, ఇటీవల వివాహ బంధంలోకి అడుగు పెట్టినప్పట్టికి సినిమాల విషయలో మాత్రం జోరు తగ్గించలేదు. వరుస సినిమా చేతూనే ఉంది ఈ బ్యూటీ ..
Updated on: Apr 20, 2024 | 4:07 PM

15 డిసెంబర్ 1990న ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించింది లావణ్య త్రిపాఠి. ఆమె ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో పెరిగింది. ఆమె తండ్రి హైకోర్టు మరియు సివిల్ కోర్టులలో ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాది. ఆమె తల్లి రిటైర్డ్ టీచర్. ఆమెకు ఇద్దరు అన్నలు, ఒక సోదరుడు మరియు సోదరి ఉన్నారు.

ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్‌లో మార్షల్ స్కూల్ లో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, ఆమె ముంబైకి వెళ్లింది. అక్కడ ఆమె రిషి దయారామ్ నేషనల్ కాలేజీ నుంచి ఆర్థికశాస్త్రంలో డిగ్రీ పట్టా పొందింది.

మోడల్‌గా ఎన్నో ప్రకటనలలో నటించింది ఈ వయ్యారి భామ. 2006లో ఫెమినా మిస్ ఉత్తరాఖండ్ కిరీటాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత హిందీలో ప్యార్ కా బంధన్ టెలివిజన్ షోలో తొలిసారిగా నటించింది ఈ బ్యూటీ.

2012లో తెలుగు చిత్రం అందాల రాక్షసితో చలనచిత్ర అరంగేట్రం చేసింది. ఇందులో పాత్ర కోసం ఆడిషన్‌కు హాజరు కావాలని స్నేహితురాలు సూచించడంతో వెళ్ళింది. మిధునగా తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సినీమా అవార్డ్స్‌లో బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డును గెలుచుకుంది.

తర్వాత దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్ సోగ్గాడే చిన్ని నాయన, లచ్చిందేవికి ఓ లెక్కుంది, శ్రీరస్తు శుభమస్తు, రాధా, యుద్ధం శరణం, ఉన్నడి ఒకటే జిందగీ, ఇంటెలిజెంట్ అంతరిక్షం 9000 KMPH, అర్జున్ సురవరం, A1 ఎక్స్‌ప్రెస్, చావు కబురు చల్లగా, హ్యాపీ బర్త్డే తో పాటు పులి మేక అనే సిరీస్ చేసింది.




