- Telugu News Photo Gallery Cinema photos South Director Sandeep Reddy Vanga Counter To Bollywood Actor Adil Hussain Telugu Entertainment Photos
Sandeep Reddy Vanga: దటీజ్ వంగా.! సందీప్ వంగా మీద నెగిటివ్ ప్రచారం చేస్తున్నదెవరు.?
Updated on: May 11, 2024 | 3:39 PM

అయినా హిట్ మూవీ కావడంతో ఆలస్యంగానే ఓటీటీలో విడుదలైంది. థియేటర్లలో వచ్చినప్పుడు ఎంత మంది సినిమా గురించి స్పందించారో, ఓటీటీలో విడుదలయ్యాక అంతకన్నా ఎక్కువ మంది స్పందించారు.

అంతగా ప్రూవ్ చేసుకున్న తరువాత కూడా ఇన్ని రాళ్లు ఎందుకు పడుతున్నట్టు.? యనిమల్ సినిమా ఇంత పెద్ద విజయం సాధిస్తుంది అని మేము కూడ ఊహించలేదు.. అని హీరోయిన్ రష్మిక మందన్న ఓపెన్ గా చెప్పేశారు అంటేనే యూనిట్ కి కూడ ఆ సినిమా ఎంత కిక్ ఇచ్చిందో అర్ధం చేసుకోవచ్చు.. జనాలు మెచ్చి 900 కోట్లు బాక్స్ ఆఫీస్ కి గిఫ్ట్ గా పంపించిన సినిమా యామిమల్.

యానిమల్ మార్నింగ్ షో పడ్డప్పటి నుండే విమర్శలు స్టార్ట్ అయ్యాయి.. అదొక సినిమానా.. అలా కూడ తీస్తారా.? మహిళలను అలా కూడ చూయిస్తారా.. జనాలు ఆ కాన్సెప్ట్ ని ఎంజాయ్ చెయ్యడమేంటి.? అడియన్స్ అభిరుచి ఎలా ఉంది.. ఇంత కలెక్షన్స్ చూసాక మేకర్స్ మైండ్ సెట్ పాడైపోదా.. భవిష్యత్ లో ఎలాంటి సినిమాలు వస్తాయో అంటూ రకరకాలుగా విమర్శించిన వారే ఎక్కువ..

జావిద్ అక్తర్, కంగానా , తాప్సీ , కొంకన సింగ్ , కిరణ్ రావు ఇంకా ఎంతోమంది విమర్శించారు.. ఎవరు ఏం అన్న పట్టించుకోలేదు సందీప్.. తాను నమ్మిన విషయాన్ని కన్వీక్షన్ తో చెప్పాననుకున్నారు.

ఈ విషయాన్ని ఈ మధ్య విద్యబాలన్ కూడా ప్రస్తావించింది. నమ్మిన విషయాన్ని అందరు విమర్శిస్తున్న.. ఏ ఒక్కరికి క్షమాపణలు చెప్పకుండా యానుమల్ టీం తట్టుకొని నిలబడటం గ్రేట్ అన్నారు..

మెచ్చుకున్న ఒకరు ఇద్దరు సంగతి సరే.. అసలు సందీప్ వంగా మీద ఇన్ని విమర్శలు ఎందుకు.? సౌత్ డైరెక్టర్ నార్త్ లో సక్సెస్ అవుతుంటే ఓర్వలే పోతున్నారా.? అప్పుడెప్పుడో చేసిన కబీర్ సింగ్ సినిమా లో ప్రొఫెసర్ క్యారెక్టర్ గురించి అధిల్ హుస్సేన్ ఇప్పుడు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది అని బగ్గుమంటున్నారు నెటిజెన్లు..

ఆ క్యారెక్టర్ ని కావాలంటే AI లో డిజైన్ చేసుకుంటానని సందీప్ కరెక్ట్ సమాధానం ఇచ్చారు అని మెచ్చుకుంటున్నారు. ఇన్ని విమర్శలు చూసాక స్పిరిట్ విషయం వంగా ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటారా.? లేదు లేదు నా దారి నాదే అంటూ సాగాతారా అని వెయిట్ చేస్తున్నారు మరి కొందరు.




