- Telugu News Photo Gallery Cinema photos Lavanya Tripathi Shares Pink Colour Saree Stunning Photos telugu movie news
Lavanya Tripathi: ఎన్నాళ్లుగా ఎదురుచూస్తున్న ఆరోజు వచ్చేసింది.. సంతోషంలో మెగా కోడలు..
అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాఠి. అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల దగ్గరై తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. అందం, అభినయంతో కట్టిపడేసింది. సహజమైన నటనతో ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో కనిపించింది. కానీ లావణ్య నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. వరుసగా నిరాశ పరచడంతో ఆఫర్స్ కూడా రాలేదు.
Updated on: Apr 20, 2024 | 5:51 PM

అందాల రాక్షసి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరోయిన్ లావణ్య త్రిపాఠి. అతి తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల దగ్గరై తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. అందం, అభినయంతో కట్టిపడేసింది. సహజమైన నటనతో ప్రశంసలు అందుకుంది.

ఆ తర్వాత తెలుగులో పలు సినిమాల్లో కనిపించింది. కానీ లావణ్య నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద అంతగా ఆకట్టుకోలేదు. వరుసగా నిరాశ పరచడంతో ఆఫర్స్ కూడా రాలేదు. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉండి వెబ్ సిరీస్ చేసింది.

ఇక గతేడాది మెగా హీరో వరుణ్ తేజ్ తో తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. దాదాపు ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న గతేడాది నవంబర్ 1న ఇటలీలో ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత కూడా సినీ కెరీర్ కొనసాగిస్తుంది.

ఇటీవల మిస్ పర్ఫెక్ట్ వెబ్ సిరీస్ తో సూపర్ హిట్ అందుకుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు లేటేస్ట్ ఫోటోషూట్స్ షేర్ చేస్తుంది. తాజాగా లావణ్య షేర్ చేసిన ఫోటోస్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.

పింక్ కలర్ చీరకట్టి.. మ్యాచింగ్ చెవి దిద్దులు పెట్టుకుని చిరునవ్వుతో నెటిజన్ల దృష్టిని ఆకర్షిచింది. చీరకట్టులో లావణ్య ఎంతో సంతోషంగా కనిపిస్తూ మరింత అందంగా కట్టిపడేస్తుంది. అలాగే ఆసక్తికరర క్యాప్షన్ రాసుకొచ్చింది.

ఫోటోస్ షేర్ చేస్తూ చిన్ననాటి జ్ఞాపకాలు, అమ్మ పింక్ చెవి దిద్దులు ధరించాను. నేను ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు వచ్చింది. ఇక పై ఇవి నావే అంటూ చాలా సంతోషంగా లావణ్య త్రిపాటి కామెంట్ పెట్టింది. తల్లి చెవి దిద్దులు పెట్టుకుని మురిసిపోతుంది లావణ్య.




