కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే విస్మరించవద్దు..

మనిషిలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి, ఈ సమస్య కొనసాగితే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ఇది ఫ్యాటీ లివర్ డిసీజ్ సమస్యను కలిగిస్తుంది. తరువాత లివర్ సిర్రోసిస్, కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్ సమస్యను అల్ట్రాసౌండ్లో మాత్రమే గుర్తించవచ్చు. అయితే కాలేయ ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కూడా కావచ్చు. అటువంటి పరిస్థితిలో కొలెస్ట్రాల్ పెరిగి, ఈ లక్షణాలు కూడా కనిపిస్తే వాటిని విస్మరించవద్దు.

కొలెస్ట్రాల్ పెరిగితే కాలేయం దెబ్బతింటుందా? ఈ లక్షణాలు కనిపిస్తే విస్మరించవద్దు..
Fatty Liver Disease
Follow us

|

Updated on: Apr 20, 2024 | 3:31 PM

భారతదేశంలో కాలేయ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య ప్రతి సంవత్సరం పెరుగుతోంది. చిన్న వయసులోనే  కాలేయం పాడైపోతోంది. పేలవమైన ఆహారపు అలవాట్లు, మారిన జీవనశైలి కాలేయ వైఫల్యానికి కారణమని వైద్యులు చెబుతున్నారు. చెడు ఆహారపు అలవాట్లు కాలేయం, గుండె రెండింటినీ ప్రభావితం చేస్తాయి. ఆహారపు అలవాట్లు సరిగ్గా లేకపోతే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయి కూడా పెరుగుతుంది. అయితే కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కాలేయం కూడా ప్రభావితం అవుతుందా? నిపుణులు ఏమి చెబుతున్నారో తెలుసుకుందాం..

నిపుణుల ప్రకారం భారతదేశంలో 40% నుంచి 50% మంది ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడుతున్నారని ఇటీవలి అనేక అధ్యయనాలు వెల్లడించాయి. స్థూలకాయం, మధుమేహం, ఆహారపు అలవాట్లు సరిగా లేనివారిలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. కొలెస్ట్రాల్, కాలేయ వ్యాధి మధ్య లోతైన సంబంధం ఉందని వైద్యులు కూడా చెప్పారు.

కొలెస్ట్రాల్ పెరగడం వల్ల కాలేయం దెబ్బతింటుందా?

గ్రేటర్ నోయిడాలోని ఫోర్టిస్ హాస్పిటల్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ హెపటాలజీ విభాగం కన్సల్టెంట్ డాక్టర్ అపూర్వ పాండే మాట్లాడుతూ.. మనిషిలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి, ఈ సమస్య కొనసాగితే కాలేయం దెబ్బతినే ప్రమాదం ఉందన్నారు. ఇది ఫ్యాటీ లివర్ డిసీజ్ సమస్యను కలిగిస్తుంది. తరువాత లివర్ సిర్రోసిస్, కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. ఫ్యాటీ లివర్ డిసీజ్ సమస్యను అల్ట్రాసౌండ్లో మాత్రమే గుర్తించవచ్చు. అయితే కాలేయ ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకం కూడా కావచ్చు. అటువంటి పరిస్థితిలో కొలెస్ట్రాల్ పెరిగి, ఈ లక్షణాలు కూడా కనిపిస్తే వాటిని విస్మరించవద్దు.

ఇవి కూడా చదవండి

అలసట:

ఎంత విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా అలసిపోయినట్లు అనిపిస్తే.. అది ఫ్యాటీ లివర్ డిసీజ్ కి సంకేతం కావచ్చు.

బరువు తగ్గితే

బరువు అకస్మాత్తుగా తగ్గడం ప్రారంభిస్తే.. కాలేయ ఆరోగ్యాన్ని వెంటనే తనిఖీ చేసుకోవడం చాలా ముఖ్యం.

కడుపు నొప్పి

పొత్తికడుపు కుడివైపు ఎగువ భాగంలో తేలికపాటి నొప్పి లేదా అసౌకర్యంగా ఉంటే ఫ్యాటీ లివర్ డిసీజ్ కి  సంకేతం.

బలహీనత

మరేదైనా ఇతర కారణాల వల్ల మీరు బలహీనంగా ఉన్నట్లయితే, అది కాలేయ సంబంధిత సమస్యల వల్ల కావచ్చు.

పెరిగిన కాలేయ ఎంజైములు

రక్త పరీక్షలో కాలేయ ఎంజైమ్‌ల స్థాయి పెరిగినట్లు కనిపిస్తే, అది కాలేయం దెబ్బతినడానికి సంకేతం.

కొలెస్ట్రాల్ చెక్ చేసుకోండి

ప్రతి వ్యక్తి తన లిపిడ్ ప్రొఫైల్‌ను మూడు నెలలకు ఒకసారి తనిఖీ చేసుకోవాలని ఢిల్లీలోని సీనియర్ వైద్యుడు డాక్టర్ అజయ్ కుమార్ చెబుతున్నారు. దీంతో శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయి తెలిసిపోతుంది. కొలెస్ట్రాల్ పెరిగితే దానిని నియంత్రించండి. కాలేయ ఆరోగ్యాన్ని కూడా పరీక్షించుకోండి. దీని కోసం కాలేయ పనితీరు పరీక్ష, కాలేయ అల్ట్రాసౌండ్ చేయించుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..