Lifestyle: విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..

విరేచనాలు దాదాపు ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఈ సమస్య బారిన పడే ఉంటారు. తీసుకునే ఆహారంలో మార్పురావడం లేదా కలుషిత నీరు తాగడం కారణం ఏదైనా డయేరియా సర్వసాధారణంగా వచ్చే సమస్య. అయితే ఈ సమస్య రాగానే చాలా మంది ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు. కానీ ఇది అన్ని సందర్భాల్లో మంచిది కాదు. అలా అని అలాగే వదిలేస్తే...

Lifestyle: విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారా.? సహజంగా ఇలా చెక్‌ పెట్టండి..
Loose Motions
Follow us
Narender Vaitla

|

Updated on: Apr 20, 2024 | 3:17 PM

విరేచనాలు దాదాపు ప్రతీ ఒక్కరూ ఏదో ఒక సమయంలో ఈ సమస్య బారిన పడే ఉంటారు. తీసుకునే ఆహారంలో మార్పురావడం లేదా కలుషిత నీరు తాగడం కారణం ఏదైనా డయేరియా సర్వసాధారణంగా వచ్చే సమస్య. అయితే ఈ సమస్య రాగానే చాలా మంది ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు. కానీ ఇది అన్ని సందర్భాల్లో మంచిది కాదు. అలా అని అలాగే వదిలేస్తే శరీరం డీహైడ్రేషన్‌కు గురై తీవ్ర ఆరోగ్య సమస్య ఎదుర్కొనే అవకాశం కూడా ఉంటుంది. అయితే విరేచనాలు మొదలుకాగానే కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకుంటే ఈ సమస్యకు వెంటనే పరిష్కారం లభిస్తుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* విరేచనాలతో బాధపడే వారికి పెరుగు ఎంతగానో ఉపయోగపడుతుంది. జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే ప్రోబయోటిక్స్ పెరుగులో ఉంటాయి. పెరుగు తినడం వల్ల లూజ్ మోషన్ తగ్గుతుంది. పెరుగులో చక్కెర కలుపుకొని తింటే మరింత మేలు జరుగుతుంది.

* సాధారణంగా లూజ్ మోషన్స్‌ కారణంగా, శరీరం నుంచి చాలా నీరు, ఎలక్ట్రోలైట్స్‌ కోల్పోతాయి. ఇది డీహైడ్రేషన్‌కు దారి తీస్తుంది. ఇలాంటి సమయంలో ఉప్పు, చక్కెరను కలుపుకోని తీసుకోవాలి. గ్లాసు నీటిలో అర టీస్పూన్ ఉప్పు, ఒక టీస్పూన్ చక్కెర కలిపి తీసుకోవాలి. ఇలా రెండు గంటలకు ఒకసారి తీసుకోవాలి.

* జీలకర్ర జీర్ణవ్యవస్థకు చాలా మేలు చేస్తుంది. జీలకర్ర నీటిని తీసుకుంటే డయేరియా సమస్యకు చెక్‌ పెట్టొచ్చు. ఇందుకోసం ఒక గ్లాసులో నీటిని మరిగించి అందులో జీలకర్ర వేయాలి. అనంతరం వడకట్టి తీసుకుంటే సరిపోతుంది.

* అరటిపండు పొటాషియంకు పెట్టింది పేరు, ఇది ఎలక్ట్రోలైట్ల సమతుల్యతను కాపాడుకోవడంలో సహాయపడుతుంది. లూజ్ మోషన్ వచ్చిన సందర్భంలో అరటి పండు తినడం వల్ల ఇన్‌స్టాంట్‌ శక్తి లభిస్తుంది.

* కొబ్బరి నీరులో ఎలక్ట్రోలైట్స్‌ పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇందులో యాంటీ-వైరల్ లక్షణాలను కూడా ఉంటాయి. లూజ్‌ మోషన్స్‌ అయిన సమయంలో కొబ్బరి నీళ్లు తాగితే శరీరం డీ హైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవచ్చు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..