Schezwan Dosa: నోరూరించే షెజ్ వాన్ దోశ.. ఒక్కసారి రుచి చూస్తే వదిలిపెట్టరు!
బ్రేక్ ఫాస్ట్‌లో దోశలు కూడా ఒకటి. చాలా మంది దోశలు అంటే ఇష్టంగా తింటారు. దోశల్లో చాలా రకాలు ఉంటాయి. సాధారణంగా ఇంట్లో ఎగ్ దోశ, ఆనియన్, మసాలా దోశలు మాత్రమే వేసుకుంటారు. కానీ ఈ షెజ్ వాన్ దోశ కూడా ఇంట్లో ఈజీగానే ప్రిపేర్ తయారు చేసుకోవచ్చు. స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం ఉన్నవారికి ఇవి బాగా నచ్చుతాయి. బయట కల్తీ ఆహారం తినడం కంటే.. ఇంట్లోనే హెల్దీగా ఈ దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ నోరూరించే షెజ్ వాన్ దోశలు ఎలా తయారు చేస్తారు? ఇందుకు..

బ్రేక్ ఫాస్ట్‌లో దోశలు కూడా ఒకటి. చాలా మంది దోశలు అంటే ఇష్టంగా తింటారు. దోశల్లో చాలా రకాలు ఉంటాయి. సాధారణంగా ఇంట్లో ఎగ్ దోశ, ఆనియన్, మసాలా దోశలు మాత్రమే వేసుకుంటారు. కానీ ఈ షెజ్ వాన్ దోశ కూడా ఇంట్లో ఈజీగానే ప్రిపేర్ తయారు చేసుకోవచ్చు. స్పైసీ ఫుడ్ అంటే ఇష్టం ఉన్నవారికి ఇవి బాగా నచ్చుతాయి. బయట కల్తీ ఆహారం తినడం కంటే.. ఇంట్లోనే హెల్దీగా ఈ దోశలు ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ నోరూరించే షెజ్ వాన్ దోశలు ఎలా తయారు చేస్తారు? ఇందుకు కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
షెజ్ వాన్ దోశలకు కావాల్సిన పదార్థాలు:
దోశ పిండి, షెజ్ వాన్ సాస్, సోయా సాస్, టమాటా సాస్, క్యాబేజీ తరుగు, క్యారెట్ తరుగు, క్యాప్సికం, బీన్స్, అల్లం తరుగు, వెల్లుల్లి తరుగు, పచ్చి మిర్చి, స్ప్రింగ్ ఆనియన్స్, టమాటా, నల్ల మిరియాల పొడి, ఉప్పు, ఆయిల్ లేదా బటర్.
షెజ్ వాన్ దోశలు తయారీ విధానం:
ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి.. ఆయిల్ లేదా బటర్ వేసి వేడి చేయాలి. ఇప్పుడు అల్లం, వెల్లుల్లి తరుగు వేసి వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చి మిర్చి, క్యాబేజీ తరుగు, క్యారెట్ తరుగు, క్యాప్సికం, బీన్స్ అన్నీ వేసి ఓ రెండు నిమిషాల పాటు వేయించు కోవాలి. ఆ తర్వాత షెజ్ వాన్ సాస్, సోయా సాస్, టమాటా సాస్, మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలపాలి.
ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి.. స్ప్రింగ్ ఆనియన్స్ వేసి.. మరోసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద దోశ పాన్ పెట్టి ఆయిల్ రాయాలి. ఇప్పుడు పెద్ద దోశ పల్చగా వేసుకోవాలి. ముందు బటర్ వేసి బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు షెజ్ వాన్ సాస్ వేసి దోశ మొత్తం స్ప్రెడ్ చేయాలి. నెక్ట్స్ రెండు వైపులా బాగా కాల్చుకుని .. ముందుగా చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని..దోశ పై ఉంచి కాస్త బటర్.. కలపాలి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని ఆరగించడమే. ఇది చాలా రుచిగా ఉంటుంది.