Lifestyle: వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?

పెరుగులో జింక్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. అలాగే చర్మంపై వాపును కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని లోపల నుండి తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం, జుట్టు, గోళ్లకు పోషణనిస్తుంది. ఇక పెరుగు మంచి యాయిశ్చరైజింగ్ లాగా ఉపయోగపడుతుంది. ఎండకాలంలో...

Lifestyle: వేసవిలో పెరుగు తింటే ఏం జరుగుతుందో తెలుసా.?
Curd
Follow us

|

Updated on: Apr 20, 2024 | 2:14 PM

ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కూడా వెంటాడుతుంటాయి. ముఖ్యంగా చెమట వల్ల చర్మ సమస్యలతో పాటు కడుపు సంబంధిత సమస్యలు సైతం వేధిస్తుంటాయి. అందుకే ఈ సీజన్‌లో కచ్చితంగా పెరుగును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వేసవిలో పెరుగు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పెరుగులో జింక్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో మంటను తగ్గిస్తుంది. అలాగే చర్మంపై వాపును కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని లోపల నుండి తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది. అలాగే పెరుగులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మం, జుట్టు, గోళ్లకు పోషణనిస్తుంది. ఇక పెరుగు మంచి యాయిశ్చరైజింగ్ లాగా ఉపయోగపడుతుంది. ఎండకాలంలో చర్మం పొడిబారడం సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. దీంతో చర్మం నిత్యం హైడ్రేట్‌గా ఉంటుంది. సమ్మర్‌లో చర్మం పొడిబారకుండా నిరోధించడంలో సహాయపడుతుంది.

సాధారణంగా వేసవిలో చర్మం తేమ తగ్గిపోతుంది. దీంతో నూనె గ్రంథులు ఎక్కువ నూనెను ఉత్పత్తి చేస్తాయి. ఈ కారణంగానే చర్మం జిడ్డుగా మారుతుంది. అయితే చర్మం తేమగా ఉంటే జిడ్డు తగ్గుతుంది. పెరుగు ఇందులో కీలకంగా ఉపయోగపడుతుంది. మాయిశ్చరైజింగ్ లక్షణాలు కలిగి ఉండే పెరుగు, చర్మం లోపల నుంచి తేమను అందిస్తుంది.

అంతేకాకుండా పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఇది చర్మపు రంగును కాంతివంతంగా చేస్తుంది. చర్మంపై కనిపించే వయసు తాలుకూ లక్షణాలను తగ్గించడంలో కూడా పెరుగు ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ చర్మ నిర్మాణాన్ని బిగుతుగా ఉంచుతాయి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. ఇక సూర్యకిరణాలు నేరుగా పడడం వల్ల చర్మానికి జరిగే డ్యామేజ్‌ను పెరుగు కంట్రోల్ చేస్తుంది. పెరుగును క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల చర్మంపై హానికరమైన సూర్య కిరణాల ప్రభావాన్ని తగ్గిస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..