AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: ఓట్స్‌ ఫేస్‌ప్యాక్‌తో మెరిసే‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం..

ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు కాస్త మందంగా అప్లై చేసుకుని అరగంటపాటు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి.. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే.. మీ ముఖం సహజంగానే కాంతివంతంగా మారుతుంది.

Beauty Tips: ఓట్స్‌ ఫేస్‌ప్యాక్‌తో మెరిసే‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అందం..! ఇలా చేస్తే వావ్‌ అనిపించే సౌందర్యం మీ సొంతం..
Oats Face Pack
Jyothi Gadda
|

Updated on: Apr 20, 2024 | 12:51 PM

Share

ఓట్స్‌ ఇటీవలి కాలంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చాయి. మంచి ఆరోగ్యం, బరువు తగ్గించుకోవటం, సరైన శరీర ఆకృతి కోసం చాలా మంది తమ డైట్‌లో ఓట్స్‌ను చేర్చుకుంటున్నారు. అయితే, ఓట్స్‌ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు చర్మ సంరక్షణకు కూడా మేలు చేస్తుంది. ఓట్స్‌లో కావాల్సినన్ని ప్రోటీన్లు ఉంటాయి. ఇవి శరీరానికి, చర్మానికి మేలు చేస్తాయి. ఇందులో విటమిన్ ఇ కూడా ఉంది. ఇది చర్మ ఆరోగ్య ప్రయోజనాలకు అతి ముఖ్యమైన విటమిన్‌. ఇతర తృణధాన్యాలతో పోలిస్తే ఓట్స్‌ అధిక అమైనో ఆమ్లం, సిలికా కంటెంట్‌ను కలిగి ఉంటుంది. ఓట్స్‌లో ఉండే విటమిన్ ఇ ఒక యాంటీఆక్సిడెంట్. ఇది చర్మాన్ని మాయిశ్చరైజ్ చేసి రక్షిస్తుంది. ఓట్స్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇది పొడిబారుదనం, దురద చర్మాన్ని దూరంగా ఉంచుతుంది. మీ ముఖంపై ఉన్న ముడతలను తొలగించేందుకు ఓట్ మీల్ ఫేస్ ప్యాక్స్‌ చర్మ సమస్యలను పరిష్కారిస్తుంది.

ఓట్స్‌మిల్‌ ఫేస్‌ ప్యాక్‌ తయారీ.. దీని కోసం ముందుగా.. 2 టేబుల్ స్పూన్ల ఓట్స్ మరియు 3 టేబుల్ స్పూన్ల పాలు మిక్స్ చేసి ప్యాక్ తయారు చేయండి. తర్వాత ఈ ప్యాక్‌ని మీ ముఖం, మెడకు అప్లై చేయండి. ఆరిన తర్వాత చల్లటి నీటితో ముఖం కడుక్కోవాలి. డార్క్ స్కిన్, సన్ టాన్స్ తొలగించడానికి ఇది బెస్ట్ ఫేస్‌ ప్యాక్ అని చెప్పొచ్చు.

1 టేబుల్ స్పూన్ శనగపిండి, 1 టేబుల్ స్పూన్ ఓట్ మీల్, 1 టేబుల్ స్పూన్ తేనెను రోజ్ వాటర్ తో మిక్స్ చేసి మెత్తని పేస్ట్ లా చేసుకోవాలి. దీన్ని మీ ముఖానికి పట్టించి 15 నిమిషాల తర్వాత చల్లటి నీటితో మీ ముఖాన్ని కడగాలి. ఈ ప్యాక్‌ని అన్ని చర్మ రకాల వారు ప్రయత్నించవచ్చు.

ఇవి కూడా చదవండి

ఒక చిన్న బొప్పాయి ముక్క, రెండు టేబుల్ స్పూన్ల గ్రౌండ్ ఓట్స్, కొంచెం నీరు, ఒక టీస్పూన్ బాదం నూనె వేసి ప్యాక్ తయారు చేయండి. దీన్ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల బాగా ఆరనివ్వండి.. ఆ తర్వాత కడిగేయండి. ఈ ఫేస్ ప్యాక్ వల్ల మచ్చలు తొలగిపోయి చర్మానికి మంచి మెరుపు వస్తుంది.

ఒక బౌల్లో రెండు టేబుల్‌ స్పూన్ల ఓట్స్‌ తీసుకోవాలి. ఆ తర్వాత ఒక చిన్న కీర దోసకాయ ముక్కలు, పుదీనా ఆకులు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని తీసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమం నుండి జ్యూస్ ను సపరేట్ చేసుకోవాలి. దీనికి ముందుగా తీసుకున్న ఓట్స్ పౌడర్ ను వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనికి చిటికెడు పసుపు వేసి కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు కాస్త మందంగా అప్లై చేసుకుని అరగంటపాటు బాగా ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి.. క్రమం తప్పకుండా ఇలా చేస్తూ ఉంటే.. మీ ముఖం సహజంగానే కాంతివంతంగా మారుతుంది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పిల్లలకు ఈ 5 రూల్స్ నేర్పించండి.. ఎక్కడ తప్పిపోయినా సురక్షితంగా..
పిల్లలకు ఈ 5 రూల్స్ నేర్పించండి.. ఎక్కడ తప్పిపోయినా సురక్షితంగా..
పాము - ముంగిస ఎందుకు శత్రువులు? అది చిన్న కథకాదు..సవతుల పోరు!
పాము - ముంగిస ఎందుకు శత్రువులు? అది చిన్న కథకాదు..సవతుల పోరు!
హ్యాకర్ల చేతిలో పబ్లిక్ నెట్‌వర్క్​లు.. మైక్రోసాఫ్ట్‌ వార్నింగ్
హ్యాకర్ల చేతిలో పబ్లిక్ నెట్‌వర్క్​లు.. మైక్రోసాఫ్ట్‌ వార్నింగ్
ఏనుగులు ఆయన మాట వింటాయి! ఈ ఆనంద్ షిండే ఎవరు?
ఏనుగులు ఆయన మాట వింటాయి! ఈ ఆనంద్ షిండే ఎవరు?
ఉదయాన్నే 4 తులసి ఆకులు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
ఉదయాన్నే 4 తులసి ఆకులు తింటే ఏం జరుగుతుందో తెలుసా..?
బడ్జెట్ ధరలో నావో బడ్స్ ఎక్స్1 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్
బడ్జెట్ ధరలో నావో బడ్స్ ఎక్స్1 వైర్‌లెస్ ఇయర్‌బడ్స్
షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే
షాదీ ముబారక్, కల్యాణలక్ష్మి పథకాలపై తెలంగాణ హైకోర్టు స్టే
ఉప్పు నిమ్మకాయ సెంటిమెంట్.. విదేశాల్లోనూ వర్కవుట్ అవుతోందట!
ఉప్పు నిమ్మకాయ సెంటిమెంట్.. విదేశాల్లోనూ వర్కవుట్ అవుతోందట!
వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా.. జబర్దస్త్ వెంకీ వీడియో వైరల్
వారిపై లీగల్ యాక్షన్ తీసుకుంటా.. జబర్దస్త్ వెంకీ వీడియో వైరల్
కొబ్బరి నూనె vs ఆముదం.. పిల్లల జుట్టుకు ఏది బెస్ట్‌?
కొబ్బరి నూనె vs ఆముదం.. పిల్లల జుట్టుకు ఏది బెస్ట్‌?