Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లేముందు ఎవరైనా సరే వందసార్లు ఆలోచించాల్సిందే..

మానసిక స్థితిని మెరుగుపరచుకోవడానికి బయటకు వెళతారు. అటువంటి పరిస్థితిలో చాలా మంది పర్వతాలను అధిరోహించాహడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే ఈ భూమిపై పర్యటన చేయడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. అయితే కొన్ని సార్లు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పర్యాటకుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా మారుతుంది. అప్పుడు ప్రజలు ఆ స్థలం గురించి మళ్లీ ఆలోచించడానికి కూడా ఇష్టపడరు.

చైనాలో విశిష్ట ఆలయం.. వెళ్లేముందు ఎవరైనా సరే వందసార్లు ఆలోచించాల్సిందే..
Unique Temple In China
Follow us
Surya Kala

|

Updated on: Apr 20, 2024 | 3:08 PM

చాలా మంది సెలవు దొరికితే చాలు కొత్త ప్రదేశాలను సందర్శించడానికి వెళ్తారు. ప్రయాణం చేయడం అనేది ప్రతి ఒక్కరూ ఇష్టపడే కార్యకలాపం. ప్రజలు తమ బిజీ షెడ్యూల్‌లో కూడా పర్యటనలకు వెళ్ళడానికి కొంత సమయం వెచ్చిస్తారు. తమ మానసిక స్థితిని మెరుగుపరచుకోవడానికి బయటకు వెళతారు. అటువంటి పరిస్థితిలో చాలా మంది పర్వతాలను అధిరోహించాహడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే ఈ భూమిపై పర్యటన చేయడానికి చాలా ప్రదేశాలు ఉన్నాయి. అయితే కొన్ని సార్లు కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు పర్యాటకుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా మారుతుంది. అప్పుడు ప్రజలు ఆ స్థలం గురించి మళ్లీ ఆలోచించడానికి కూడా ఇష్టపడరు.

చైనాలోని ‘మౌంట్ తైషాన్’ అనే ప్రదేశం ఒకటి ఉంది. ఈ ప్రదేశానికి వెళ్ళడానికి 6600 కంటే ఎక్కువ మెట్లు ఎక్కాలి. సాధారణంగా 50-100 మెట్లు ఎక్కడం ద్వారా ప్రజల పరిస్థితి మరింత దిగజారుతుంది. మరి  పర్యాటకులు ఈ ప్రదేశానికి చేరుకోవడానికి 6వేల కంటే ఎక్కువ మెట్లు ఎక్కడం అంటే ఎంత కష్టమో ఆలోచించండి. మెట్లు ఎక్కి ఆ ప్రదేశానికి చేరిన తర్వాత వారి పరిస్థితి చాలా దిగజారింది. అంతేకాదు మన శరీరం నుంచి మన కాళ్లు మాయమైనట్లు అనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఇక్కడ వీడియో చూడండి

ప్రస్తుతం ఈ ఆలయానికి సంబంధించిన వీడియో వేగంగా వైరల్ అవుతోంది. దీనిలో ప్రజలు తమ చేతుల్లో కర్రలు పట్టుకుని మెట్లు ఎక్కడం చేస్తున్నారు. చాలా మంది కాళ్లు వణుకుతున్నట్లు కనిపిస్తున్నాయి. రెయిలింగ్ పట్టుకుని మెట్లు ఎక్కలేని వారు, దిగలేని వారు చాలా మంది ఉన్నారు. అంతే కాకుండా స్ట్రెచర్లపైనే తీసుకెళ్లే విధంగా తయారైంది కొందరి పరిస్థితి.

ప్రస్తుతం ఈ వీడియో @TheFigen అనే ఖాతాలో షేర్ చేశారు. ఈ వార్త రాసే వరకు 2.5 కోట్ల మందికి పైగా ఈ వీడియోను చూశారు. రకరకాల వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఒక వినియోగదారు ఇలా వ్రాశాడు ‘సోదరా, ఈ ప్రదేశానికి వెళ్లడానికి ఎవరు ధైర్యం చేయగలరు?’ మరొకరు ఇలా వ్రాశారు అత్యుత్తమ ఫిట్ నెస్ ఉన్న   వ్యక్తులు కూడా ఇక్కడికి ఎక్కే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు. ‘ఈ ప్రదేశానికి చేరుకున్న తర్వాత  చాలా మంది ప్రజలు ఇక్కడికి చేరుకున్న తర్వాత పశ్చాత్తాపపడుతున్నారని కామెంట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..