Viral Video: భీకరంగా పోరాడుకున్న రెండు పులులు.. WWE రెజ్లింగ్‌ని మించి.. మీరే చూడండి
ఒకవేళ పొరపాటునైనా ఒక జంతువు స్థలంలో మరొకటి వెళ్తే..అది తన మరణాన్ని తానే ఆహ్వానించుకున్నట్లు అని కూడా చెప్పవచ్చు. అడవికి రారాజు సింహం అయినప్పటికీ పులి, ఏనుగు, ఇలా అనేక రకాల జీవులు అడవిలో నివసిస్తూ ఉంటాయి. తాజాగా ఓ పులికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు.
అడవిలో నివసించాలంటే ఒకటే నియమం ఒకటే చట్టం.. అదే ‘చంపండి లేదా చావండి’ ఈ చట్టం అడవిలో ఉన్న క్రూర జంవుతులకు ఎక్కువగా వర్తిస్తుందన్న విషయం అడవి గురించి బాగా తెలిసిన వారికీ లేదా అడవిని దగ్గరగా చూసిన వారికీ అర్ధం అవుతుంది. అడవిలో వేట అనేది సర్వసాధారణం.. అడవిలో ప్రతి జంతువు దాని సొంత భూ భాగాన్ని కలిగి ఉంటుంది. ఆ ప్రదేశంలో ఇతర జంతువులు ప్రవేశించడం నిషేధంగా భావించవచ్చు. ఒకవేళ పొరపాటునైనా ఒక జంతువు స్థలంలో మరొకటి వెళ్తే..అది తన మరణాన్ని తానే ఆహ్వానించుకున్నట్లు అని కూడా చెప్పవచ్చు. అడవికి రారాజు సింహం అయినప్పటికీ పులి, ఏనుగు, ఇలా అనేక రకాల జీవులు అడవిలో నివసిస్తూ ఉంటాయి. తాజాగా ఓ పులికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఇది చూసిన తర్వాత మీరు కూడా ఆశ్చర్యపోతారు.
పులుల గర్జనతో అడవి ప్రతిధ్వనించింది. ఒక పులి అడివిలో రహదారిమీద వెళ్తున్న సమయంలో మరొక పులి దాడి చేసింది. సర్వసాధారణంగా అడవిలో పులులు ఇతర జంతువులతో పోరాడుతున్న వీడియోలు చాలా కనిపిస్తూనే ఉంటాయి. అయితే పులులు తమలో తాము పోరాడుకోవడం ఎప్పుడైనా చూశారా? .. ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో రెండు పులులు ఒకదానితో ఒకటి పోరాడుకుంటున్నాయి. ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ రెండు పులుల మధ్య జరుగుతున్న పోరు వీక్షకులకు డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లింగ్ ని గుర్తుచేసేలా ఉంది.
ఇక్కడ వీడియో చూడండి
The cameraman couldn’t believe his eyes pic.twitter.com/rxBjGgg00r
— Crazy Clips (@crazyclipsonly) January 29, 2024
వీడియోలో ఒక పులి అడవి గుండా వెళుతున్నట్లు చూడవచ్చు. ఇంతలో అక్కడికి మరో పులి వస్తుంది. రెండు పులులు ముఖాముఖిగా వచ్చిన వెంటనే.. వాటి రెండిటి మధ్య భీకర పోరు మొదలవుతుంది. భీకరంగా గర్జిస్తూ ఒకదానిపై ఒకటి దాడి చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ పోరు చూసిన వారికి.. గర్జన విన్న తర్వాత గూస్‌బంప్స్ రావడం ఖాయం. పులులు వెనుక కాళ్లపై నిలబడి, ఒక బాక్సర్‌లా ఒకరిపై ఒకరు దాడి చేసున్నాయి.
ఈ వీడియో @crazyclipsonly అనే ఖాతా ద్వారా భాగస్వామ్యం చేయబడింది. ఈ వార్త రాసే సమయానికి 2.5 కోట్ల మందికి పైగా ప్రజలు దీనిని చూశారు. రకరకాల కామెంట్స్ చేస్తూ తమ భావాలను పులుల నైజాన్ని తెలియజేస్తున్నారు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..