AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆడవాళ్లు బీ కేర్ ఫుల్..! నెయిల్‌ పాలిష్‌ రిమూర్‌తో మంటలు.. 14ఏళ్ల బాలికకు తీవ్రగాయాలు..

ప్రమాదం జరిగిన వెంటనే తాను గట్టిగా అరిచానని చెప్పింది.. మంటలు వ్యాపించకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నించానని చెప్పింది. కానీ, అప్పటికే తన తల వెంట్రుకలు, బట్టలు కాలిపోయాయని వాపోయింది. ఆమె చేతులు, శరీరం, తొడలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ, కెన్నెడీ కాలిన గాయాల కారణంగా చాలా బాధలు, కష్టాలను అనుభవిస్తున్నని చెప్పింది.

ఆడవాళ్లు బీ కేర్ ఫుల్..! నెయిల్‌ పాలిష్‌ రిమూర్‌తో మంటలు.. 14ఏళ్ల బాలికకు తీవ్రగాయాలు..
Nail Polish Remover Explode
Jyothi Gadda
|

Updated on: Feb 01, 2024 | 9:29 PM

Share

మనం నిత్యజీవితంలో చాలా తేలికగా వాడే అనేక వస్తువులు మనం జాగ్రత్తగా ఉండకపోతే పెను ప్రమాదాలకు కూడా దారితీస్తాయి. ఇలాంటి వార్త ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. నెయిల్ పాలిష్ రిమూవర్ వల్ల మంటలు చెలరేగడంతో బాలిక కాలిపోయిందనే వార్త సంచలనం రేపింది. ఈ ఘటన అమెరికాలోని ఓహియోలో చోటుచేసుకుంది. కెన్నెడీ అనే 14 ఏళ్ల అమ్మాయి వెలిగించిన కొవ్వొత్తి పక్కన కూర్చుని నెయిల్ పాలిష్ ఉపయోగించింది. దాంతో నెయిల్ పాలిష్ రిమూవర్ నుండి ఆవిరి మండుతున్న కొవ్వొత్తిని తాకింది. దాంతో వెంటనే మంటలు చెలరేగాయి. దాంతో బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. నెయిల్ పాలిష్ రిమూవర్ బాటిల్ పేలిపోయిందని బాలిక వాంగ్మూలం ఇచ్చింది. కెన్నెడీ శరీరం, సమీపంలోని ఇతర వస్తువులు, మంచం అన్నింటికి మంటలు అంటుకున్నాయని చెప్పారు.

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక మాట్లాడుతూ… ఇది చాలా భయానక అనుభవం అని చెప్పింది.. ప్రమాదం జరిగిన వెంటనే తాను గట్టిగా అరిచానని చెప్పింది.. మంటలు వ్యాపించకుండా ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నించానని చెప్పింది. కానీ, అప్పటికే తన తల వెంట్రుకలు, బట్టలు కాలిపోయాయని వాపోయింది. ఆమె చేతులు, శరీరం, తొడలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. కానీ, కెన్నెడీ కాలిన గాయాల కారణంగా చాలా బాధలు, కష్టాలను అనుభవిస్తున్నని చెప్పింది.

కాలిన గాయాలకు చికిత్స పొంది కోలుకున్న తర్వాత కెన్నెడీ తన అనుభవాన్ని బహిరంగంగా పంచుకున్నాడు. ప్రమాదం గురించి అందరికీ అవగాహన కల్పించడమే తన లక్ష్యమని కెన్నెడీ చెప్పారు. ఎవరూ దీనిని పునరావృతం చేయకూడదని కెన్నెడీ కోరుకుంటోంది.. ఈ ఘటన వార్తగా మారడంతో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..