ఇది మీకు తెలుసా..? అదేపనిగా కాళ్లు ఊపడం కూడా కొన్ని వ్యాధుల లక్షణం..! నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ఇలా కాళ్లను అదేపనిగా ఊపటం అలవాటు కాదు.. అదోక అనారోగ్య సమస్య అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. వాళ్లు అనేక పరిస్థితుల కారణంగా కాళ్లను స్థిరంగా ఉంచలేకపోతున్నారని వైద్యులు చెబుతున్నారు. వీటిలో ఒకటి 'రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్'గా చెబుతున్నారు. కొందరు వారి సంతృప్తి కోసమే కాళ్లు కదుపుతూ ఉంటారు. కానీ దాని వెనుక
చాలా మంది కూర్చీలో కూర్చోగానే కాళ్లును అదేపనిగా ఊపుతూ ఉంటారు.. అయితే, ఇలా ఎందుకు చేస్తారో ఎప్పుడైనా ఆలోచించరా..? ఎందుకంటే.. ఇలా కాళ్లను అదేపనిగా ఊపటం అలవాటు కాదు.. అదోక అనారోగ్య సమస్య అంటున్నారు వైద్య ఆరోగ్య నిపుణులు. వాళ్లు అనేక పరిస్థితుల కారణంగా కాళ్లను స్థిరంగా ఉంచలేకపోతున్నారని వైద్యులు చెబుతున్నారు. వీటిలో ఒకటి ‘రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్’గా చెబుతున్నారు. కొందరు వారి సంతృప్తి కోసమే కాళ్లు కదుపుతూ ఉంటారు. కానీ దాని వెనుక మధుమేహం, గర్భం, పోషకాహార లోపం వంటి కొన్ని కారణాలు ఉండవచ్చునని సూచిస్తున్నారు. అలాగే, కొందరు వ్యక్తులు కొన్ని మందులు తీసుకోవడంలో భాగంగా నిరంతర కాలు వణుకుడును అనుభవిస్తారని చెబుతున్నారు.
అలాగే, ఆందోళన ఎక్కువగా ఉన్నవారిలో కూడా కాళ్లు వణికే సమస్య ఉంటుందని చెప్పారు. ఆందోళన సమయంలో శరీరానికి అవసరం లేకపోయినా ‘అడ్రినలిన్’ అనే హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. కాళ్లు ఎప్పుడూ ఊపుతూ ఉండడానికి ఇదీ ఒక కారణం.
ఆల్కహాల్ సేవించడం, అలాగే కొన్ని మత్తు పదార్థాల వినియోగం, కొన్నిరకాల డ్రింక్స్ తీసుకోవడం వల్ల కూడా కాళ్లు కదుపుతూ కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని జబ్బులతో బాధపడేవారు అందులో భాగంగా ఎప్పుడూ కాలు ఊపుతూ ఉంటారని సూచిస్తున్నారు. కాలు కదలడం సాధారణంగా విసుగు లేదా ఆందోళన వల్ల వస్తుంది. ఇతర కారణాలు ఉన్నాయో లేదో మనం గుర్తించలేకపోతే, మనం కొన్ని ఇతర లక్షణాలను గమనించాలి.
నడవడం లేదా నిలబడడంలో ఇబ్బంది, మూత్రం కంట్రోల్ చేసుకోవడంలో ఇబ్బంది, అసంకల్పిత మూత్రవిసర్జన, ప్రేగు కదలిక కోసం వేచి ఉండలేకపోవడం, మెదడు పనితీరులో మార్పులు, అస్పష్టమైన దృష్టి అనిపించినట్టయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలని సలహా ఇస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..