Watch Video: బాబోయ్‌.. మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు..! ఇంటి ముందు పార్క్‌ చేసిన బైక్‌.. క్షణాల్లో కొట్టేసిన కేటుగాళ్లు..

దోపిడీ దొంగలు అవకాశం దొరికిన ఏది వదిలిపెట్టారు. విలువైన వస్తువులు, నగలు, నగదు ఇలా అన్నింటిని లూటీ చేసేస్తుంటారు. అలా నిత్యం కార్లు, బైక్‌లు చోరీకి గురవుతున్న సంఘటనలు సర్వసాధారణం. దీని కోసం దొంగలు రకరకాల ట్రిక్స్‌ను ఉపయోగిస్తారు. అదే విధంగా ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌ను పట్టపగలు ఓ వ్యక్తి దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగ కేవలం 10 సెకన్లలో ఇంటి ముందు పార్క్‌ చేసి ఉంచిన బైక్‌ను పరిగెత్తించాడు.

Watch Video: బాబోయ్‌.. మరీ ఇలా ఉన్నారేంట్రా బాబు..! ఇంటి ముందు పార్క్‌ చేసిన బైక్‌.. క్షణాల్లో కొట్టేసిన కేటుగాళ్లు..
Steals Bike
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 02, 2024 | 2:03 PM

దొంగతనం చట్టరీత్యా నేరం. పట్టుబడితే, కఠినమైన శిక్షను ఎదుర్కోవలసి ఉంటుంది. అయినప్పటికీ, కొంతమంది త్వరగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో నేర మార్గాన్ని ఎంచుకుంటారు. దోపిడీ దొంగలు అవకాశం దొరికిన ఏది వదిలిపెట్టారు. విలువైన వస్తువులు, నగలు, నగదు ఇలా అన్నింటిని లూటీ చేసేస్తుంటారు. అలా నిత్యం కార్లు, బైక్‌లు చోరీకి గురవుతున్న సంఘటనలు సర్వసాధారణం. దీని కోసం దొంగలు రకరకాల ట్రిక్స్‌ను ఉపయోగిస్తారు. అదే విధంగా ఇంటి ముందు పార్క్ చేసిన బైక్‌ను పట్టపగలు ఓ వ్యక్తి దొంగిలించిన ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగ కేవలం 10 సెకన్లలో ఇంటి ముందు పార్క్‌ చేసి ఉంచిన బైక్‌ తో పరారయ్యాడు.. ఈ బైక్ చోరీకి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇలాంటి చోరీ ఘటన మీరు సినిమాలో చూసి ఉంటారు. అయితే ఈ బైక్ దొంగతనం ఘటన పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో జరిగినట్లు సమాచారం. రోడ్డు పక్కన ఓ ఇంటి ముందు పార్క్ చేసిన బైక్ దగ్గర ముగ్గురు యువకులు బైక్‌పై వచ్చి ఆగినట్లు వీడియోలో స్పష్టంగా కనిపించింది. ఆ సమయంలో ఆ బైక్‌పై వచ్చిన ఓ యువకుడు కిందకు దిగి ఓ ఇంటి ముందు ఆగి ఉన్న బైక్‌ను తాళం తీసుకుని స్టార్ట్ చేసి ఎక్కి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న ఇంట్లోని వారు బయటకు వచ్చేసరికి బైక్‌పై వచ్చిన దొంగలు పరారయ్యారు.. ఈ మొత్తం ఘటన సమీపంలోని సీసీటీవీలో రికార్డవ్వగా, దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఈ వీడియో X ఖాతా @Gagan4344 ద్వారా పోస్ట్ చేయబడింది. దీనికి క్యాప్షన్‌గా జాగ్రత్తగా ఉండండి! ఇలా సెకన్లలో దొంగతనం జరుగుతుంది. ఈ సీసీటీవీ ఫుటేజీ ఫిరోజ్‌పూర్‌లోనిది అంటూ క్యాప్షన్‌లో రాశారు. ఇకపోతే, ఈ వీడియోపై వందలాది మంది వినియోగదారులు వ్యాఖ్యానించారు. ఈ తరహా చోరీపై కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..