AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పల్లీ రైతుల విలవిల.. ధరలు లేక అయోమయంలో అన్నదాతలు.. గిట్టుబాటు లేక..

మార్కెట్లో వస్తున్న ధరలతో పంట పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేదని వాపోయారు. మార్కెట్ యార్డుల్లో వేరుశనగ కొనుగోలు చేసే వ్యాపారులు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. మరికొంత మంది రైతులు మాత్రం మంచి రేటు వస్తుందేమోనని రోజుల తరబడి మార్కెట్ యార్డుల్లోనే ఎదురుచూస్తున్నారు. ఇక బయటి మార్కెట్ లో వేరుశనగకు డిమాండ్ తగ్గడంతోనే ధరలు పడిపోయాయని అధికారులు చెబుతున్నారు.

Telangana: పల్లీ రైతుల విలవిల.. ధరలు లేక అయోమయంలో అన్నదాతలు.. గిట్టుబాటు లేక..
Farmers Are Facing Problems
Boorugu Shiva Kumar
| Edited By: Jyothi Gadda|

Updated on: Feb 01, 2024 | 6:08 PM

Share

మహబూబ్​నగర్, ఫిబ్రవరి 01; అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పల్లీ పంటకు చివరకు అన్యాయమే జరుగుతోంది. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై నిండా ముంచుతున్నారని ఆవేదన చెందుతున్నారు. తక్కువ ధర చెల్లిస్తూ… కమీషన్ పేరిట కోతలు విధిస్తున్నారని రైతన్నలు ఆందోళనలో ఉన్నారు. కోటి ఆశలతో పంట అమ్మకానికి తెస్తే కనీసం పెట్టుబడి కూడా రావడం లేదని విచారంలో మునిగిపోయారు. గిట్టుబాటు ధర కోసం ఆందోళన చేసినా… మార్కెట్ లోనే కుప్పల వద్ద పడిగాపులు పడినా పాలమూరు జిల్లాలో పల్లీ రైతులకు నిరాశే మిగిలింది. విధిలేక తెచ్చిన పంటను వెనక్కి తీసుకెళ్లడమో… లేదా వచ్చినకాడికి అమ్మకమో చేయాల్సిన పరిస్థితి అన్నదాతలదీ. మార్కెట్ యార్డుల్లో ఎక్కడ చూసిన ఏ రైతును కదిలించిన కన్నీళ్ల గాధలే కనిపిస్తున్నాయి.

బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ కు ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు వికారాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని రైతులు వేరుశనగ పంటన అమ్ముకునేందుకు తీసుకొచ్చారు. పంట దిగుబడులు భారీగా రావడంతో యార్డు ఆవరణ కిక్కిరిసిపోయింది. అయితే గడిచిన కొద్ది రోజులుగా వేరుశనగకు ధర ఆశించినంత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందున్నారు. దీంతో విక్రయాలు నెమ్మదించాయి. టెండర్లు పూర్తయిన తర్వాత ప్రకటించిన ధరలు రైతులను నివ్వెరపోయేలా చేస్తున్నాయి. క్వింటాకు గరిష్టంగా రూ.7,500, కనిష్ఠంగా 4,000 ధరలు రావడంతో రైతుల తీవ్ర నిరాశలో మునిగిపోతున్నారు. ప్రభుత్వ మద్ధతు ధర రూ.6,377 ఉండగా అంతకమించి ధరలు లభించాల్సి ఉందని చెబుతున్నారు. కొన్ని కుప్పలకు మాత్రమే ఎక్కువ ధరలు వేసి, మిగతా కుప్పలకు మద్ధతు ధర కంటే తక్కువగా ధరలు ఖరారు చేస్తున్నారని రైతులు వాపోతున్నారు.

పెట్టుబడి సైతం రావడం లేదంటున్న రైతులు:

ఇవి కూడా చదవండి

వేరుశనగ విత్తనాలకే వేలకు వేలు వెచ్చించి కొనుగోలు చేసినట్లు అన్నదాతలు చెబుతున్నారు. కూలీలు, ఎరువులు తదితర ఖర్చులు తడిసి మోపెడయ్యాయని నిరాశలో ఉన్నారు. మార్కెట్లో వస్తున్న ధరలతో పంట పెట్టుబడి సైతం వచ్చే పరిస్థితి లేదని వాపోయారు. మార్కెట్ యార్డుల్లో వేరుశనగ కొనుగోలు చేసే వ్యాపారులు కుమ్మక్కయ్యారని ఆరోపిస్తున్నారు. మరికొంత మంది రైతులు మాత్రం మంచి రేటు వస్తుందేమోనని రోజుల తరబడి మార్కెట్ యార్డుల్లోనే ఎదురుచూస్తున్నారు. ఇక బయటి మార్కెట్ లో వేరుశనగకు డిమాండ్ తగ్గడంతోనే ధరలు పడిపోయాయని అధికారులు చెబుతున్నారు. పంట దిగుబడి పెరగడంతో వేరుశనగ రైతులు కోటీ ఆశలతో మార్కెట్ యార్డులకు తీసుకువస్తే ధరలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. పెట్టిన పెట్టుబడులు సైతం రావడం లేదని అన్నదాతలు ఆందోళనలో ఉన్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..