Ayodhya Ram temple: రామ భక్తులకు శుభవార్త.. అయోధ్యకు విమాన సేవలు.. 8 నగరాల ప్రజలకు సౌకర్యం
ఇక రామ మందిర నిర్మాణం పూర్తైన తర్వాత, భారతదేశంతో పాటుగా విదేశాల నుండి కూడా కోట్లాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అయోధ్య కనెక్టివిటీని పెంచుతున్నారు. కొత్త విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత, దేశంలోని అనేక పెద్ద నగరాలను అయోధ్యతో నేరుగా విమాన సేవల ద్వారా అనుసంధానించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎనిమిది నగరాల నుండి అయోధ్య ధామ్‌కు కొత్త విమాన సర్వీసును ప్రారంభించారు.
రామ భక్తులకు ఇదో పెద్ద శుభవార్త.. ఎందుకంటే అయోధ్యను దర్శించాలనుకునే భక్తులకు విమాన సర్వీసులు కూడా అందుబాటులోకి వచ్చాయి. దేశంలోని 8 నగరాల నుంచి అయోధ్యకు విమాన సర్వీసు ప్రారంభమయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామాలయాన్ని ప్రారంభించినప్పటి నుంచి రాంలాలాను చూసేందుకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ఇక రామ మందిర నిర్మాణం పూర్తైన తర్వాత, భారతదేశంతో పాటుగా విదేశాల నుండి కూడా కోట్లాది మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారని భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అయోధ్య కనెక్టివిటీని పెంచుతున్నారు. కొత్త విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత, దేశంలోని అనేక పెద్ద నగరాలను అయోధ్యతో నేరుగా విమాన సేవల ద్వారా అనుసంధానించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఎనిమిది నగరాల నుండి అయోధ్య ధామ్‌కు కొత్త విమాన సర్వీసును ప్రారంభించారు.
ఇప్పుడు రాంలాలాను చూడాలనుకునే వారికి అయోధ్య చేరుకోవడం సులభం అవుతుంది. ఈరోజు అంటే ఫిబ్రవరి 1న 8 నగరాల నుంచి విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, జైపూర్, పాట్నా, దర్భంగా, ముంబై, బెంగళూరు నుంచి ప్రజలు నేరుగా అయోధ్యకు రావచ్చని సమాచారం. అయోధ్యలో మెరుగైన విమాన కనెక్టివిటీ అనేది గతంలో ఒక కల.. కానీ, నేడు అది నిజమైంది. ఈ విమానాలన్నీ స్పైస్ జెట్ ద్వారా నడపబడతాయని సమాచారం.
लखनऊ में श्री अयोध्या धाम से विभिन्न शहरों के लिए SpiceJet की विमान सेवाओं के शुभारंभ अवसर पर…@flyspicejet https://t.co/ahu6uQcRc7
— Yogi Adityanath (@myogiadityanath) February 1, 2024
ఏయే నగరాల నుంచి విమానయాన సంస్థ ప్రారంభమైంది?
CM కార్యాలయం, GoUP స్పైస్‌జెట్ శ్రీ అయోధ్య జీ, బెంగళూరు-శ్రీ అయోధ్య జీ మధ్య విమాన సర్వీసును ప్రారంభించబోతోంది. అంతకుముందు, ఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై, కోల్‌కతా, బెంగళూరులకు శ్రీ అయోధ్య జీ నుండి విమాన సర్వీసు ప్రారంభించబడింది. ఇది విజయవంతంగా పనిచేస్తోంది.
वास्तव में श्री अयोध्या धाम इसका हकदार था… pic.twitter.com/x7D1fiAD2x
— Yogi Adityanath (@myogiadityanath) February 1, 2024
సీఎం యోగి ఆదిత్యనాథ్ ఏం చెప్పారు?
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు కానీ, ఈరోజు ఈ కల నెరవేరింది. అయోధ్య దేశ విశ్వాసానికి ప్రతీక అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అయోధ్య, శ్రీరాముడితో ముడిపడి ఉన్న ప్రజల మనోభావాలు ఉన్నాయి. కొన్ని కారణాల వల్ల అయోధ్య నిర్లక్ష్యానికి గురైందని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..