సర్కారు సొమ్ముకోసం ఉత్తుత్తి పెళ్లిళ్లు.. నకిలీ వధూవరులతో సామూహిక వివాహాలు.. కట్‌ చేస్తే..

ఈ పథకం ద్వారా పేదింటి యువతీ యువకులకు వివాహాలు జరిపించి.. ఆర్థికసాయం కింద 51,000 రూపాయలు అందజేస్తోంది. ఈ సొమ్మును కాజేసేందుకు దళారులతో కొంతమంది అధికారులు చేతులు కలిపారు. ఆ మేరకు జనవరి 25న నిర్వహించిన ప్రభుత్వ సామూహిక పెళ్లిళ్ల కార్యక్రమానికి నకిలీ వధూవరులను తీసుకువచ్చారు. అవివాహితులు, పెళ్లయిన యువతీ యువకులకు డబ్బు ఆశగా చూపించడంతో ఒప్పందం ప్రకారం వీరంతా ఉత్తుత్తి పెళ్లిళ్లు చేసుకున్నారని తెలిసింది.

సర్కారు సొమ్ముకోసం ఉత్తుత్తి పెళ్లిళ్లు.. నకిలీ వధూవరులతో సామూహిక వివాహాలు.. కట్‌ చేస్తే..
Fake Marriages
Follow us
Jyothi Gadda

|

Updated on: Feb 01, 2024 | 6:57 PM

నిరుపేద కుటుంబాల్లోని పిల్లల వివాహాలకు ఆర్ధిక సాయం అందించేందుకు గానూ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం కొందరు కేటుగాళ్లకు వరంగా మారింది. సామూహిక వివాహాల పేరుతో కొందరు అధికారులు చేతివాటాన్ని ప్రదర్శించారు. ప్రభుత్వ పథకాన్ని పక్కదోవ పట్టించేందుకు దళారులతో కుమ్మక్కయ్యారు. ఇందుకోసం డబ్బులను ఎరగా వేసి నకిలీ వధూవరులను తయారు చేసి ఉత్తుత్తి పెళ్లిళ్లు జరిపించారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్‌గా మారడంతో ఈ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. వరుడు లేకుండానే వందలాది యువతులు తమ మెడల్లో తామే వరమాలలు వేసుకుని పెళ్లి చేసుకోవడం వీడియోల్లో కనిపించడంతో పోలీసులు అవాక్కయ్యారు. విస్తుగొలిపే ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో చోటుచేసుకుంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని లక్నోలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. పేదల పెళ్లిళ్ల కోసం యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం సామూహిక వివాహ వేడుక పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా పేదింటి యువతీ యువకులకు వివాహాలు జరిపించి.. ఆర్థికసాయం కింద 51,000 రూపాయలు అందజేస్తోంది. ఈ సొమ్మును కాజేసేందుకు దళారులతో కొంతమంది అధికారులు చేతులు కలిపారు. ఆ మేరకు జనవరి 25న బలియా జిల్లా మనియర్‌ పట్టణ కళాశాలలో నిర్వహించిన ప్రభుత్వ సామూహిక పెళ్లిళ్ల కార్యక్రమానికి నకిలీ వధూవరులను తీసుకువచ్చారు. అవివాహితులు, పెళ్లయిన యువతీ యువకులకు డబ్బు ఆశగా చూపించడంతో ఒప్పందం ప్రకారం వీరంతా ఉత్తుత్తి పెళ్లిళ్లు చేసుకున్నారని తెలిసింది.

వైరల్‌ అవుతున్న వీడియోల్లో ఎదురుగా వరుడు లేకుండా అమ్మాయిలు మెడలో కళ్యాణమాలను వేసుకుంటున్న దృశ్యాలు అందరినీ షాక్‌ అయ్యేలా చేశాయి.. దీంతో యూపీ సంక్షేమ శాఖ మంత్రి అసీమ్ అరుణ్ విచారణకు ఆదేశించారు. ఎనిమిది మంది అధికారులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ నకిలీ పెళ్లిళ్లు చేసుకున్న వారికి ఇంకా నిధులు విడుదల చేయలేదని జిల్లా పాలనాధికారి రవీంద్ర కుమార్‌ తెలిపారు. సామూహిక వివాహ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో ఎనిమిదిమంది అనర్హులైన మహిళలు ఉన్నారని, వీరికి ఇది వరకే పెళ్లైందని ప్రాథమిక దర్యాప్తులో తెలింది. ఘటనకు సంబంధించి అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ సునీల్ కుమార్ యాదవ్‌ను సస్పెండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

అయితే, సామూహిక వివాహాల పథకం కింద పెళ్లి చేసుకునేందుకు అర్హులైన వారికి ముందుగా 51 వేలు చెల్లిస్తారు. ఇందులో అమ్మాయిలకు రూ.35 వేలు, పెళ్లి సామాగ్రి కొనుగోలుకు రూ.10 వేలు, కార్యక్రమానికి రూ.6 వేలు అందజేస్తారు. అయితే, ఈ నకిలీ పెళ్లిళ్లు చేసుకున్న వారికి ఇంకా నిధులు విడుదల చేయలేదని జిల్లా పాలనాధికారి రవీంద్ర కుమార్‌ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
ఆ మూడు జట్లకు బాక్సింగ్ డే టెస్టు కీలకం..
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
శీతాకాలంలో తాటి బెల్లం తింటే ఇన్ని లాభాలా.. డోంట్ మిస్!
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
భూమ్మీద నూకలు మిగిలున్నాయ్ అంటే ఇదేనేమో.. ఇక్కడ జరిగింది చూస్తే..
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
తుఫాన్ ఇన్నింగ్స్‌తో దుమ్ము దులుపుతున్న లేడి కోహ్లీ
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
గుడ్‌న్యూస్‌..త్వరలో వాయిస్‌, SMSలతో కూడిన రీఛార్జ్‌ వోచర్లు-TRAI
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..
ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో..