Fragrant Indoor Plants: మీ ఇంట్లో సువాసన వెదజల్లే మొక్కలు ఇవే!
ఇంట్లో మంచి సువాసన వెదజల్లుతూ ఉంటే.. మనసు, మెదడు మంచి రిలాక్షేషన్ అవుతాయి. ఇందు కోసం చాలా మంది రూమ్ ఫ్రెష్‌నర్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఈ మొక్కలు మీ ఇంట్లో వాటి అవసరం లేదు. ఇంట్లో చాలా మంది మొక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. కానీ కొన్ని మొక్కల వల్ల స్వచ్ఛమైన గాలి మాత్రమే కాదు.. మంచి సువాసనను కూడా అందిస్తాయి. లావెండర్ మొక్కలు.. ఇండోర్ ప్లాంట్‌లలో ఒకటి. లావెండర్ మొక్కల నుంచి మంచి సువాసన అనేది వెదజల్లుతూ..
Updated on: Feb 01, 2024 | 7:11 PM

ఇంట్లో మంచి సువాసన వెదజల్లుతూ ఉంటే.. మనసు, మెదడు మంచి రిలాక్షేషన్ అవుతాయి. ఇందు కోసం చాలా మంది రూమ్ ఫ్రెష్‌నర్స్ ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఈ మొక్కలు మీ ఇంట్లో వాటి అవసరం లేదు. ఇంట్లో చాలా మంది మొక్కల్ని పెంచుకుంటూ ఉంటారు. కానీ కొన్ని మొక్కల వల్ల స్వచ్ఛమైన గాలి మాత్రమే కాదు.. మంచి సువాసనను కూడా అందిస్తాయి.

లావెండర్ మొక్కలు.. ఇండోర్ ప్లాంట్‌లలో ఒకటి. లావెండర్ మొక్కల నుంచి మంచి సువాసన అనేది వెదజల్లుతూ ఉంటుంది. మంచి ప్రశాంతమైన వాసన వల్ల.. ఒత్తిడి, ఆందోళన అనేవి తగ్గుతాయి. మీ మొక్క ఈజీగా బాల్కానీలో పెంచుకోవచ్చు.

మల్లెపూల మొక్క నుంచి కూడా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. మీరు కూడా బాల్కానీలో ఓ కుండీలో మల్లె మొక్కను పెంచుకోవచ్చు. ఇవి మంచి ఉత్తేజకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. అంతే కాకుండా మీ ఇంటి లుక్ కూడా అందంగా మారుతుంది.

పుదీనా చెట్టు నుంచి కూడా మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. పుదీనా మొక్క నుంచి వచ్చే వాసన ఇంద్రియాలను ఉత్తేజ పరుస్తుంది. పుదీనా ఆకులు కూడా ఎంతో ఆరోగ్యకరమైనవి. వీటిని వంటల్లో కూడా ఉపయోగించుకోవచ్చు.

మంచి సువాసన వెదజల్లే వాటిల్లో యూకలిప్టస్ కూడా ఒకటి. ఇది ఇంటికి అద్భుతమైన సువాసన విడుదల చేయడమే కాకుండా.. అందంగా ఉంటుంది. ఈ వాసన పీల్చడం మంచి రిలీఫ్ రావడమే కాకుండా.. శ్వాస కోసం ప్రయోజనాలు కూడా ఉన్నాయి.




