అయ్యో.. గూగుల్ మ్యాప్ ఎంత పని చేసింది

అయ్యో.. గూగుల్ మ్యాప్ ఎంత పని చేసింది

Phani CH

|

Updated on: Feb 01, 2024 | 8:43 PM

గూగుల్‌ మ్యాప్‌.. ప్రస్తుతకాలంలో ఇది అందరికీ దిక్సూచిలా మారింది. ఎవరు ఎక్కడికి వెళ్లాలన్నా ఈ గూగుల్‌ మ్యాప్‌ పైనే ఆధారపడుతున్నారు. కారులో కూర్చోవాలి.. గూగుల్‌ మ్యాప్‌ ఆన్‌ చేయాలి.. రయ్‌..య్‌..మంటూ దూసుకెళ్లిపోవాలి.. ఇదే ఇప్పడు అందరి కాన్సెప్ట్‌. కానీ గూగుల్‌ మ్యాప్‌ అన్నివేళలా సరైనమార్గాన్నే సూచిస్తుందా అంటే చెప్పలేం. ఒక్కోసారి గూగుల్‌ మ్యాప్‌ అంచనాలు కూడా తప్పే అవకాశాలున్నాయి. తాజాగా గూగుల్‌ మ్యాప్‌ పెట్టుకొని విహారయాత్రకు వెళ్తున్న టూరిస్టులకు వింత అనుభవం ఎదురైంది.

గూగుల్‌ మ్యాప్‌.. ప్రస్తుతకాలంలో ఇది అందరికీ దిక్సూచిలా మారింది. ఎవరు ఎక్కడికి వెళ్లాలన్నా ఈ గూగుల్‌ మ్యాప్‌ పైనే ఆధారపడుతున్నారు. కారులో కూర్చోవాలి.. గూగుల్‌ మ్యాప్‌ ఆన్‌ చేయాలి.. రయ్‌..య్‌..మంటూ దూసుకెళ్లిపోవాలి.. ఇదే ఇప్పడు అందరి కాన్సెప్ట్‌. కానీ గూగుల్‌ మ్యాప్‌ అన్నివేళలా సరైనమార్గాన్నే సూచిస్తుందా అంటే చెప్పలేం. ఒక్కోసారి గూగుల్‌ మ్యాప్‌ అంచనాలు కూడా తప్పే అవకాశాలున్నాయి. తాజాగా గూగుల్‌ మ్యాప్‌ పెట్టుకొని విహారయాత్రకు వెళ్తున్న టూరిస్టులకు వింత అనుభవం ఎదురైంది. నీలగిరిజిల్లాలోని ఊటీ అందాలు చూడడానికి కర్నాటక వచ్చిన ఓ కుటుంబం తమిళనాడు విహారయాత్రకు వెళ్లింది. ఈ క్రమంలో కొండ ప్రాంతమైన గూడలూరుకు కారులో వెళ్లారు. గూగుల్ మ్యాప్ చూపించిన దారిలోనే వెళ్లిన ఆ కారు.. నీలగిరి ప్రాంతంలోని ఇళ్ల మధ్యకు వెళ్లింది. అలా వెళ్లగా వెళ్లగా రోడ్డు పోయి మెట్ల మార్గం వచ్చింది. జనం నడుచుకుంటూ వెళ్లే మెట్ల మార్గంలోకి వెళ్లి ఆగిపోయింది. దాంతో అది ముందుకు వెళ్లలేక, వెనక్కి రాలేని పరిస్థితి ఏర్పడింది. ఆ కారు డ్రైవర్ ఏం చేయలేక పోలీసులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన పోలీసులు, స్థానికులు.. ఎట్టకేలకు ఆ కారును సురక్షితంగా మెట్లమార్గంనుంచి కిందకి దించారు. ఆ తర్వాత ఆ డ్రైవర్‌కు సరైన రూట్‌ను చూపించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

సచిన్ డీప్‌ఫేక్ వీడియో మూలాలు ఫిలిప్పీన్స్‌లో

103 ఏళ్ల వృద్ధుడికి… 49 ఏళ్ల మహిళతో మూడో పెళ్లి

మనిషి మెదడులో చిప్‌ అమర్చాం.. ఎక్స్‌ వేదికగా ఎలాన్‌ మస్క్‌ ప్రకటన

వీడు సామాన్యుడు కాదు.. 12 రోజులు సెల్ టవర్ పైనే

రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయాడు.. ప్లాట్ ఫామ్‌కు, ట్రైన్ కు మధ్యలో ఇరుక్కున్నాడు