సచిన్ డీప్‌ఫేక్ వీడియో మూలాలు ఫిలిప్పీన్స్‌లో
ఇటీవల వైరల్ అయిన భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ డీప్‌ఫేక్ వీడియోను అప్‌లోడ్ చేసిన ఐపీ అడ్రస్ ఫిలిప్పీన్స్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఓ గేమింగ్ యాప్‌ను సచిన్ ప్రమోట్ చేస్తున్నట్టుగా ఉన్న ఆ వీడియోలో డబ్బును ఈజీగా ఎలా సంపాదించవచ్చో సచిన్ వివరించాడు. అంతేకాదు, ఆ గేమ్ ఆడుతూ తన కుమార్తె డబ్బులు ఎలా సంపాదిస్తున్నదీ అందులో పేర్కొన్నాడు. ఇదికాస్తా వైరల్ అయి విమర్శలు రావడంతో సచిన్ వెంటనే స్పందించాడు.
ఇటీవల వైరల్ అయిన భారత క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ డీప్‌ఫేక్ వీడియోను అప్‌లోడ్ చేసిన ఐపీ అడ్రస్ ఫిలిప్పీన్స్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఓ గేమింగ్ యాప్‌ను సచిన్ ప్రమోట్ చేస్తున్నట్టుగా ఉన్న ఆ వీడియోలో డబ్బును ఈజీగా ఎలా సంపాదించవచ్చో సచిన్ వివరించాడు. అంతేకాదు, ఆ గేమ్ ఆడుతూ తన కుమార్తె డబ్బులు ఎలా సంపాదిస్తున్నదీ అందులో పేర్కొన్నాడు. ఇదికాస్తా వైరల్ అయి విమర్శలు రావడంతో సచిన్ వెంటనే స్పందించాడు. ఆ వీడియో తనది కాదని, డీప్‌ఫేక్ వీడియో అని స్పష్టం చేశాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు వీడియోను ఫిలిప్పీన్స్ నుంచి అప్‌లోడ్ చేసినట్టు గుర్తించారు. వైరల్ అయిన తన డీప్‌ఫేక్ వీడియోను సచిన్ ఎక్స్‌లో షేర్ చేస్తూ అది డీప్‌ఫేక్ వీడియో అని, టెక్నాలజీని ఇలా దుర్వినియోగం చేయడం చూసి బాధేస్తోందని సచిన్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి వాటిపై ఫిర్యాదు చేయాలని అభిమానులను కోరుతూ కేంద్ర ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్‌ను ట్యాగ్ చేశాడు. స్పందించిన మంత్రి డీప్‌ఫేక్ వీడియోలకు అడ్డుకట్ట వేసేందుకు కఠిన నిబంధనలు రూపొందిస్తామని హామీ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
103 ఏళ్ల వృద్ధుడికి… 49 ఏళ్ల మహిళతో మూడో పెళ్లి
మనిషి మెదడులో చిప్ అమర్చాం.. ఎక్స్ వేదికగా ఎలాన్ మస్క్ ప్రకటన
వీడు సామాన్యుడు కాదు.. 12 రోజులు సెల్ టవర్ పైనే
రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయాడు.. ప్లాట్ ఫామ్‌కు, ట్రైన్ కు మధ్యలో ఇరుక్కున్నాడు