103 ఏళ్ల వృద్ధుడికి… 49 ఏళ్ల మహిళతో మూడో పెళ్లి

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ స్వాతంత్ర్య సమరయోధుడు 103 ఏళ్ల వయసులో 49 సంవత్సరాల మహిళను వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. భోపాల్‌కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు హబీబ్ నాజర్‌కు ఇది మూడవ వివాహమని, రెండవ భార్య చనిపోయిన తర్వాత ఆయన మూడవ పెళ్లి చేసుకున్నారని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి.

103 ఏళ్ల వృద్ధుడికి... 49 ఏళ్ల మహిళతో మూడో పెళ్లి

|

Updated on: Feb 01, 2024 | 8:41 PM

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఓ స్వాతంత్ర్య సమరయోధుడు 103 ఏళ్ల వయసులో 49 సంవత్సరాల మహిళను వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. భోపాల్‌కు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు హబీబ్ నాజర్‌కు ఇది మూడవ వివాహమని, రెండవ భార్య చనిపోయిన తర్వాత ఆయన మూడవ పెళ్లి చేసుకున్నారని మీడియా రిపోర్టులు పేర్కొంటున్నాయి. రెండవ భార్య మరణం తర్వాత ఆయనను పట్టించుకునేవారు లేకుండా పోయారు. దాంతో ఒంటరితనంతో బాధపడుతున్న ఆయన మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఈ క్రమంలో భర్తను కోల్పోయి ఒంటిరిగా ఉన్న ఫిరోజ్‌ జహాన్‌ అనే 49 ఏళ్ల మహిళను మూడో వివాహం చేసుకున్నారు. అయితే వీరిద్దరి వివాహం గతేడాదే జరిగినప్పటికీ వీరి పెళ్లి ఫోటోలు తాజాగా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మనిషి మెదడులో చిప్‌ అమర్చాం.. ఎక్స్‌ వేదికగా ఎలాన్‌ మస్క్‌ ప్రకటన

వీడు సామాన్యుడు కాదు.. 12 రోజులు సెల్ టవర్ పైనే

రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయాడు.. ప్లాట్ ఫామ్‌కు, ట్రైన్ కు మధ్యలో ఇరుక్కున్నాడు

తాళ పత్రాలపై రామాయణం !! రిటైర్మెంట్‌ తర్వాత రచన ప్రారంభం

ల్యాబ్‌లో చేప మాంసం ఉత్పత్తి.. దేశంలోనే తొలిసారి

Follow us