మనిషి మెదడులో చిప్ అమర్చాం.. ఎక్స్ వేదికగా ఎలాన్ మస్క్ ప్రకటన
ఆధునిక యుగంలో టెక్నాలజీ అత్యంత వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలో నేరుగా మనిషి మెదడు, కంప్యూటర్‌ల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరచడమే లక్ష్యంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. టెస్లా దిగ్గజం ఎలాన్ మస్క్ సహ వ్యవస్థాపకుడిగా 2016లో స్థాపించిన న్యూరోటెక్నాలజీ కంపెనీ న్యూరాలింక్ చేపట్టిన కీలకమైన ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశంగా మారింది. మొట్టమొదటిసారిగా ఒక పేషెంట్ మెదడులో న్యూరాలింక్ చిప్‌ను అమర్చినట్లు ఎలాన్ మస్క్ తెలిపారు.
ఆధునిక యుగంలో టెక్నాలజీ అత్యంత వేగంగా పెరుగుతోంది. ఈ క్రమంలో నేరుగా మనిషి మెదడు, కంప్యూటర్‌ల మధ్య కమ్యూనికేషన్ వ్యవస్థను ఏర్పరచడమే లక్ష్యంగా అడుగులు ముందుకు పడుతున్నాయి. టెస్లా దిగ్గజం ఎలాన్ మస్క్ సహ వ్యవస్థాపకుడిగా 2016లో స్థాపించిన న్యూరోటెక్నాలజీ కంపెనీ న్యూరాలింక్ చేపట్టిన కీలకమైన ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా ముఖ్యాంశంగా మారింది. మొట్టమొదటిసారిగా ఒక పేషెంట్ మెదడులో న్యూరాలింక్ చిప్‌ను అమర్చినట్లు ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ ప్రయోగం ఆశాజనక ఫలితాలను కూడా అందిస్తోంటూ.. ఎలాన్ మస్క్ ఎక్స్ వేదికగా వెల్లడించారు. సోమవారం మొదటిసారి మనిషి మెదడులో న్యూరాలింక్‌ను అమర్చారు. పేషెంట్ కోలుకుంటున్నాడు. ఆరంభ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. నాడీ కణాలను గుర్తించడం ఖచ్చితంగా కనిపిస్తోంది అని న్యూరాలింక్ సీఈఓ ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. కంప్యూటర్‌తో మానవ మెదడు నేరుగా సమన్వయం చేసుకొనే ‘బ్రెయిన్ -కంప్యూటర్ ఇంటర్‌ఫేస్’ ప్రయోగాలకు అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ గతేడాది మేలో ఆమోదం తెలిపింది. న్యూరాలింక్ చిప్‌ను ఇప్పటికే పందులు, కోతుల్లో విజయవంతంగా పరీక్షించారు. ఈ సాధనం అత్యంత సురక్షితమైనదని, విశ్వసనీయమైందని న్యూరాలింక్ సంస్థ నిపుణులు చెప్పారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
వీడు సామాన్యుడు కాదు.. 12 రోజులు సెల్ టవర్ పైనే
రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయాడు.. ప్లాట్ ఫామ్‌కు, ట్రైన్ కు మధ్యలో ఇరుక్కున్నాడు
తాళ పత్రాలపై రామాయణం !! రిటైర్మెంట్ తర్వాత రచన ప్రారంభం
ల్యాబ్‌లో చేప మాంసం ఉత్పత్తి.. దేశంలోనే తొలిసారి
ఇవి పుచ్చకాయలా ?? మత్తు కాయలా ?? నెట్టింట వైరల్ అవుతున్న వీడియో