గట్టిగ ఊదితే చాలు.. మీ ఫోన్ లాక్ తీసేయొచ్చు

గట్టిగ ఊదితే చాలు.. మీ ఫోన్ లాక్ తీసేయొచ్చు

Phani CH

|

Updated on: Feb 02, 2024 | 1:02 PM

ఇప్పటి వరకూ మనం సెల్‌ ఫోన్‌ అన్‌ లాక్‌ చేయడానికి ఏదైనా నెంబరు కానీ, ప్యాటరన్ కానీ ఉపయోగస్తున్నాం. ఇటీవల ఫింగర్‌ ప్రింట్‌తో కూడా మొబైల్‌ అన్‌లాక్‌ చేసేలా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇక ఇప్పుడు ఫింగర్‌ ప్రింట్‌తో కూడా పనిలేదు.. మీ శ్వాసతోనే ఫోన్‌ అన్‌లాక్‌ చేయొచ్చు. సాధారణంగా వేలిముద్రలు, కంటి పాప ప్రతి మనిషికి వేర్వేరుగా ఉంటాయి. దాని ఆధారంగా ఇప్పటికే అనేక పరిజ్ఞానాలు అందుబాటులోకి వచ్చాయి.

ఇప్పటి వరకూ మనం సెల్‌ ఫోన్‌ అన్‌ లాక్‌ చేయడానికి ఏదైనా నెంబరు కానీ, ప్యాటరన్ కానీ ఉపయోగస్తున్నాం. ఇటీవల ఫింగర్‌ ప్రింట్‌తో కూడా మొబైల్‌ అన్‌లాక్‌ చేసేలా టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇక ఇప్పుడు ఫింగర్‌ ప్రింట్‌తో కూడా పనిలేదు.. మీ శ్వాసతోనే ఫోన్‌ అన్‌లాక్‌ చేయొచ్చు. సాధారణంగా వేలిముద్రలు, కంటి పాప ప్రతి మనిషికి వేర్వేరుగా ఉంటాయి. దాని ఆధారంగా ఇప్పటికే అనేక పరిజ్ఞానాలు అందుబాటులోకి వచ్చాయి. మద్రాస్‌ ఐఐటీలో పరిశోధక విద్యార్థి ముకేశ్‌ ఈ టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నారు. ఈ శ్వాస పరిజ్ఞానాన్ని ఆచరణాత్మక అప్లికేషన్‌లుగా అభివృద్ధి చేశాక, సెల్‌ఫోన్‌ అన్‌లాక్‌తోపాటు భద్రతాపరమైన కార్యకలాపాల కోసం ఉపయోగించవచ్చని ఆయన చెప్పారు. ఈ సాంకేతికత.. వైద్యరంగంలోనూ ఉపయోగపడుతందన్నారు. ఒక వ్యక్తి ఊపిరి వదిలేటప్పుడు శ్వాసకోశ ద్వారా ఊపిరితిత్తుల నుంచి గాలి బయటకు వస్తుంది. ప్రతి మనిషికి ఆ శ్వాసకోశలో తేడా ఉంటుంది. దీంతో గాలి వేగంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. దీని ఆధారంగా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తిని వేరు చేయడం సాధ్యమవుతుందని ఈ అధ్యయనం ద్వారా తాముచూపించామని పేర్కొన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యూత్‌కు తెగ నచ్చేస్తున్న I Hate you ట్రైలర్

Rakul Preet Singh: మోది కారణంగా… రకుల్ పెళ్లికి బ్రేక్

సలార్ Vs యానిమల్ రంజుగా సాగుతున్న OTT పోరు

Ram Charan: పోటెత్తిన చెర్రీ ఫ్యాన్స్‌… దారుణం పరిస్థితిలో శంకర్

Prabhas: ప్రభాస్‌కు మరో సర్జరీ..? సినిమాలకు బ్రేక్