రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయాడు.. ప్లాట్ ఫామ్‌కు, ట్రైన్ కు మధ్యలో ఇరుక్కున్నాడు

యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ ఎక్కేటప్పుడు జాగ్రత్త. రన్నింగ్ ట్రైన్‌ ఎక్కేందుకు ప్రయత్నించారో ప్రమాదమే. ఎంత చెప్పిన జనం మారరు కదా.. అలాంటి ప్రమాదమే మరొకటి వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ రైల్వేస్టేషన్‌లో రెండు గంటల పాటు నరకయాతన పడ్డాడో వ్యక్తి. సతీష్ అనే ప్రయాణికుడు కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. అదుపుతప్పి ట్రైన్‌కు, ప్లాట్‌ఫాంకు మధ్యలో పడిపోయాడు. అంతే రెండు గంటల పాటు నరకయాతన అనుభవించాడు.

రన్నింగ్ ట్రైన్ ఎక్కబోయాడు.. ప్లాట్ ఫామ్‌కు, ట్రైన్ కు మధ్యలో ఇరుక్కున్నాడు

|

Updated on: Feb 01, 2024 | 8:38 PM

యువర్ అటెన్షన్ ప్లీజ్. ట్రైన్ ఎక్కేటప్పుడు జాగ్రత్త. రన్నింగ్ ట్రైన్‌ ఎక్కేందుకు ప్రయత్నించారో ప్రమాదమే. ఎంత చెప్పిన జనం మారరు కదా.. అలాంటి ప్రమాదమే మరొకటి వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ రైల్వేస్టేషన్‌లో రెండు గంటల పాటు నరకయాతన పడ్డాడో వ్యక్తి. సతీష్ అనే ప్రయాణికుడు కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. అదుపుతప్పి ట్రైన్‌కు, ప్లాట్‌ఫాంకు మధ్యలో పడిపోయాడు. అంతే రెండు గంటల పాటు నరకయాతన అనుభవించాడు. పాపం ట్రైన్ మిస్ అవుతుందన్న హడావుడిలో ఎక్కేందుకు యత్నించి ఇలా ప్రమాదం బారిన పడ్డాడు సతీష్. రైలు నిలిపివేసిన సిబ్బంది ప్లాట్‌ఫాం పగలగొట్టి బయటకు తీశారు. ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తి రాయచూర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు రైల్వే పోలీసులు. రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి పట్టుజారితే ఎంత ప్రమాదమో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఈ ఘటనతో ట్రైన్‌ రెండు గంటల పాటు నిలిచిపోయింది. ప్లాట్‌ఫాం మధ్యలో ఇరుక్కుపోయిన సతీష్ రెండు గంటలు నరకయాతన అనుభవించాడు. చివరకు అతన్ని అతి కష్టం మీద బయటకు తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

తాళ పత్రాలపై రామాయణం !! రిటైర్మెంట్‌ తర్వాత రచన ప్రారంభం

ల్యాబ్‌లో చేప మాంసం ఉత్పత్తి.. దేశంలోనే తొలిసారి

ఇవి పుచ్చకాయలా ?? మత్తు కాయలా ?? నెట్టింట వైరల్‌ అవుతున్న వీడియో

రన్‌వేపై ల్యాండవుతూ కారుపై కుప్పకూలిన విమానం

హాస్టల్‌లోనే బార్‌ ఓపెన్‌ చేసేసాడు.. అంతటితో ఆగక ??

Follow us