AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రజల అవసరాల కోసం చెరువును సృష్టించిన అధికారులు.. వ్యయం ఎంతో తెలుసా..!

ఎన్జీటీ సూచనలను సమర్థించి వెంటనే పనులు చేపట్టాలని, లింగంకుంట విస్తీర్ణం 3.5 ఎకరాలకు బదులు రెండింతలు అంటే దాదాపు 7 ఎకరాల్లో కొత్త చెరువును నిర్మించాలని 2022 ఆగస్టు 26న సుప్రీం ఆదేశించింది. దీనితో జలమండలి అధికారులు సంగారెడ్డి మండలం కల్బగూర్లో 7 ఎకరాల్లో రూ.9.8 కోట్లు వెచ్చించి కొత్త తటాకాన్ని తవ్వించి నీటితో నింపింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేయడంతో ఇటీవల పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Hyderabad: ప్రజల అవసరాల కోసం చెరువును సృష్టించిన అధికారులు.. వ్యయం ఎంతో తెలుసా..!
artificial pond in Kalabgoor
P Shivteja
| Edited By: Surya Kala|

Updated on: Feb 02, 2024 | 10:20 AM

Share

హైదరాబాద్ జల మండలి అధికారులు ఏకంగా ఓ చెరువునే సృష్టించారు.ఈ చెరువును చేపల పెంపకానికి, పొలాల సాగుకు ఈ నీటిని వాడుకునేలా చెరువును ఏర్పాటు చేశారు..ఈ నూతన చెరువు నిర్మాణానికి 9.8 కోట్ల రూపాయల వ్యయమైంది. అయితే ఈ చెరువు నిర్మాణం వెనుక ఆసక్తికర సంఘటన ఉంది. ఇంతకీ ఏంటా సంఘటన ఏంటో చూద్దాం..సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు లింగంకుంట బఫర్ జోన్ పరిధి కింద గతంలో మురుగు నీటిశుద్ధి కేంద్రం (ఎస్టీపీ) నిర్మించింది జలమండలి. ఈ నిర్మాణంను ఎన్జీటీ తప్పు పట్టింది.   మంచినీటి చెరువు వద్ద ఎస్టీపీ నిర్మించడమంటే చెరువు ఉనికి ప్రమాదంలో పడుతుందనే భావనకు వచ్చింది. ఆ ఎస్టీపీతో చెరువుకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలని ఆదేశాలిచ్చింది. అంతేకాక ఆ చెరువు విస్తీర్ణానికి రెండింతల భూమిలో హైదరాబాద్ చుట్టుపక్కల కొత్తగా ఒక తటాకాన్ని తవ్వించాలని ఉత్తర్వులు ఇచ్చింది. దీనిపై జలమండలి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అక్కడా చుక్కెదురైంది.

ఎన్జీటీ సూచనలను సమర్థించి వెంటనే పనులు చేపట్టాలని, లింగంకుంట విస్తీర్ణం 3.5 ఎకరాలకు బదులు రెండింతలు అంటే దాదాపు 7 ఎకరాల్లో కొత్త చెరువును నిర్మించాలని 2022 ఆగస్టు 26న సుప్రీం ఆదేశించింది. దీనితో జలమండలి అధికారులు సంగారెడ్డి మండలం కల్బగూర్లో 7 ఎకరాల్లో రూ.9.8 కోట్లు వెచ్చించి కొత్త తటాకాన్ని తవ్వించి నీటితో నింపింది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేయడంతో ఇటీవల పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

అయితే జల మండలి అధికారులు నూతన చెరువు ఏర్పాటు చేయడంలో వ్యవహరించిన తీరు వివాదాస్పదమైంది. వీరి పని తీరు స్వాగతించేలా ఉన్నప్పటికీ ఈ నూతన చెరువు ఏర్పాటు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేది అని అంటున్నారు స్థానికులు. ఎందుకంటే ఇప్పుడు జలమండలి అధికారులు ఏర్పాటు చేసిన చెరువు మంజీర డ్యామ్ కి అతి చేరువలో ఉంది. ఈ చెరువు ఏర్పాటు కోసం మంజీర డ్యామ్ పరిసరాల్లో ఉన్న అడవిని తొలగించారు..పోయిన రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె పకృతి వనం, వైకుంఠ ధామంను తొలగించారు.

ఇవి కూడా చదవండి

దీంతో ప్రజా ధనం వృథా అయ్యిందని స్థానికులు అంటున్నారు. అయితే కొన్ని శాఖలో మధ్య సమన్వయలోపంతో ప్రజాధనం వృథా అయిన పరిస్థితి నెలకొంది. మంజీర డ్యాం వద్ద పల్లె పకృతి వనంతో పాటు ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మారుస్తుండగా..ఈ నూతన చెరువు తవ్వకంతో పరిస్థితి మొత్తం మారిపోయింది అక్కడ.

మంజీర డ్యాం వద్ద గతంలో కొంత అడవి ఉండేది.. పెద్ద పెద్ద చెట్లు ఉండేవి..వీటి వల్ల ఆ ప్రాంతం మొత్తం చాలా ఆహ్లాదకరంగా ఉండేది. దీని వల్ల ఈ మంజీర డ్యామ్ వద్దకు డిసెంబర్ నెల నుండి వివిధ దేశాల నుండి వలస పక్షులు వచ్చేవి. ప్రతి సంవత్సరం వలస పక్షలు ఇక్కడికి వచ్చి ఎంతో సందడి చేసేవి. వీటిని చూడడానికి వివిధ ప్రాంతాల నుండి పక్షి ప్రేమికులు వచ్చే వారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న అటవీ ప్రాంతంలో నే చెరువు నిర్మాణం చేపట్టడంతో ఇక వలస పక్షుల రాక అనుమానమే అని అంటున్నారు స్దానికులు.

జలమండలి అధికారులు ఈ నూతన చెరువును ఇక్కడ కాకుండ వేరే చోట నిర్మాణం చేపడితే బాగుండేంది అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా సుప్రీం కోర్టు, ఎన్‌జిటీ ఇచ్చిన తీర్పు మాత్రం ఎంతోమందికి కనువిప్పు కల్గిస్తుంది. చెరువులు, కుంటలు ధ్వంసం చేస్తే.. శిక్ష తప్పదనే సంకేతం ఇచ్చినట్లు అయ్యింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..