AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Barrelakka : “నన్ను ట్రోల్ చేసి నా జీవితాన్ని నాశనం చేసింది వీడే”.. కన్నీరు మున్నీరైన బర్రెలక్క

బర్రెలక్క కూడా సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ఇబ్బందిపడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రెలక్క పేరు మరు మ్రోగింది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసింది బర్రెలక్క. అంతకు ముందు ఆమె డిగ్రీ చేసి జాబ్ దొరక్క బర్రెలు కాసుకుంటున్నా అంటూ చేసిన వీడియో బాగా వైరల్ అయ్యింది. దాంతో ఆమెకు బర్రెలక్క అనే పేరు వచ్చింది. ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది.

Barrelakka : నన్ను ట్రోల్ చేసి నా జీవితాన్ని నాశనం చేసింది వీడే.. కన్నీరు మున్నీరైన బర్రెలక్క
Barrelakka
Rajeev Rayala
|

Updated on: Feb 02, 2024 | 10:40 AM

Share

సోషల్ మీడియా వల్ల ఎంత లాభం ఉందో అంతకు మించిన నష్టం కూడా ఉంది. చాలా మంది సోషల్ మీడియా ద్వారా ఫెమస్ అయ్యారు. సినిమాల్లో ఛాన్స్ లు అందుకున్నారు. భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను కూడా సొంతం చేసుకున్నారు. అయితే మరికొంతమంది మాత్రం పరువు పోగొట్టుకున్నారు. చాలా మంది ట్రోల్స్ కు గురయ్యారు. అయితే ఇప్పుడు బర్రెలక్క కూడా సోషల్ మీడియా ట్రోల్స్ వల్ల ఇబ్బందిపడింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో బర్రెలక్క పేరు మరు మ్రోగింది. తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసింది బర్రెలక్క. అంతకు ముందు ఆమె డిగ్రీ చేసి జాబ్ దొరక్క బర్రెలు కాసుకుంటున్నా అంటూ చేసిన వీడియో బాగా వైరల్ అయ్యింది. దాంతో ఆమెకు బర్రెలక్క అనే పేరు వచ్చింది. ఫాలోయింగ్ కూడా విపరీతంగా పెరిగిపోయింది.

దాంతో  రాజకీయాల వైపు అడుగులేసింది.. బర్రెలక్కాకు కేవలం 5000 ఓట్లు మాత్రమే పడ్డాయి. చాలా మంది ఎన్నికల సమయంలో బర్రెలక్కాకు మద్దతు ఇచ్చారు. అయితే ఆమెపై ఎంత సింపతీ వచ్చిందో ట్రోల్స్ కూడా అంతే వచ్చాయి. చాలా మంది సోషల్ మీడియాలో బర్రెలక్కను రకరకాలుగా ట్రోల్స్ చేశారు. అసభ్యకరమైన థంబ్నెయిల్ పెట్టి సోషల్ మీడియాలో వ్యూస్ కోసం దిగజారిపోయారు.

అలా తనపై ట్రోలింగ్ వీడియో చేస్తున్న ఓ వ్యక్తిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది బర్రెలక్క. తనపై అసభ్యకర వీడియోలు చేస్తూ.. పిచ్చి పిచ్చి థంబ్నెయిల్ పెడుతున్న వ్యక్తిని పట్టుకొని నిలదీసింది బర్రెలక్క.. తన పెళ్లయ్యిందంటూ.. భర్తను వదిలేసిందంటూ పిచ్చి పిచ్చి వీడియోలు పుట్టించారు. ఆ వ్యక్తి పట్టుకొని నిలదీసింది బర్రెలక్క. నేను ఎన్నికల్లో ఓడిపోవడానికి కారణం వీడే. మా నాన్నతో వీడియో చేయించి వీడియోలో షేర్ చేశాడు. దాంతో చాలా మంది పిచ్చి పిచ్చి థంబ్ సెల్స్ పెట్టి నా గురించి వీడియోలు చేశారు. నా పరువు పోవడానికి వీడే కారణం అంటూ కన్నీళ్లు పెట్టుకుంది బర్రెలక్క. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బర్రెలక్క ఎమోషనల్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
జైపూర్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జైత్రయాత్ర.. రాజస్థాన్‌పై ఘనవిజయం
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
సొంత తెలివి సున్నా.. బిల్డప్ లో మాత్రం పీహెచ్‌డీ
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
శరీరం ఇచ్చే ఈ చిన్న సంకేతాలను లైట్ తీసుకోవద్దు..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
5364 మీటర్ల ఎత్తులో తెలుగు తేజాలు.. ఎవరెస్ట్ బేస్ క్యాంప్‌ను..
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
క్యారెట్-వెల్లుల్లి సాంబార్.. అన్నంలోకి అదిరిపోయే రుచి, ఆరోగ్యం
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఏపీలో భద్రాచలం.. ఆందోళనలో ప్రజలు.. జన గణన సైట్‌లో బిగ్ ట్విస్ట్..
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఫోన్ సైలెంట్‏లో పెట్టి ఎక్కడో పోగొట్టుకున్నారా.. ?
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఈపీఎఫ్‌వో ఖాతాదారులకు త్వరలో శుభవార్త..!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
ఇంట్లో స్నేక్ ప్లాంట్ ఉంచుతున్నారా? ఈ వాస్తు నియమాలు తప్పనిసరి!
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం
జైపూర్‌లో రాయల్స్ రుద్రరూపం..ఢిల్లీ ముందు 226 పరుగుల భారీ లక్ష్యం