Andhra Pradesh: ఆ కరెంట్ అధికారికి షాక్ ఇచ్చిన సామాన్య రైతు.. ఏం చేశాడంటే..?

కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం అదే విధంగా ట్రాన్స్ఫార్మర్ కోసం గుత్తి విద్యుత్ శాఖలో అప్లై చేసుకున్నాడు. ఏడాది కాలంగా రైతు ఆనంద్ చెప్పులు అరిగేలా ఏఈ చంద్రశేఖర్ చుట్టూ తిరిగాడు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా... కొత్త విద్యుత్ కనెక్షన్, ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయడం లేదు. ఎందుకు మంజూరు చేయడం లేదని అడిగిన రైతు ఆనంద్ ను లంచం కావాలని డిమాండ్ చేశాడు ఏఈ చంద్రశేఖర్. ఓ ముప్పై వేలు సర్దితే కొత్త విద్యుత్ కలెక్షన్, ట్రాన్స్ఫార్మర్ తెల్లారే సమయంలో మీ పొలంలో ఉంటాయన్నాడు ఏఈ చంద్రశేఖర్.

Andhra Pradesh: ఆ కరెంట్ అధికారికి షాక్ ఇచ్చిన సామాన్య రైతు.. ఏం చేశాడంటే..?
Anantarapuram Farmer
Follow us
Nalluri Naresh

| Edited By: Surya Kala

Updated on: Feb 02, 2024 | 9:35 AM

ఎక్కడ చూసినా అవినీతి పెరిగిపోతుంది. ఈ అవినీతి భూతం అన్నం పెట్టే అన్నదాతను కూడా పట్టి పీడిస్తోంది. లంచాలకు అలవాటుపడ్డ ఓ విద్యుత్ శాఖ అధికారి ఆట కట్టించాడు ఓ రైతు. అనంతపురం జిల్లా గుత్తిలో విద్యుత్ శాఖ ఏఈగా పనిచేస్తున్న చంద్రశేఖర్ ఏసీబీ వలలో చిక్కుకున్నాడు. రైతు ఆనంద్ పొలానికి కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం అదే విధంగా ట్రాన్స్ఫార్మర్ కోసం గుత్తి విద్యుత్ శాఖలో అప్లై చేసుకున్నాడు. ఏడాది కాలంగా రైతు ఆనంద్ చెప్పులు అరిగేలా ఏఈ చంద్రశేఖర్ చుట్టూ తిరిగాడు. ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా… కొత్త విద్యుత్ కనెక్షన్, ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయడం లేదు. ఎందుకు మంజూరు చేయడం లేదని అడిగిన రైతు ఆనంద్ ను లంచం కావాలని డిమాండ్ చేశాడు ఏఈ చంద్రశేఖర్.

ఓ ముప్పై వేలు సర్దితే కొత్త విద్యుత్ కలెక్షన్, ట్రాన్స్ఫార్మర్ తెల్లారే సమయంలో మీ పొలంలో ఉంటాయన్నాడు ఏఈ చంద్రశేఖర్. అంత ఇచ్చుకోలేనని చెప్పిన రైతు ఆనంద్ చివరకు 20వేలు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే లంచం ఇవ్వడం ఇష్టం లేని ఆ రైతు ఎలాగైనా ఏఈ చంద్రశేఖర్ కు షాక్ ఇవ్వాలనుకున్నాడు.

ఇవి కూడా చదవండి

దీంతో రైతు ఆనంద్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. పక్కా ప్రణాళికతో ఏసీబీ అధికారులు గుత్తి బస్టాండ్ సమీపంలో ఏఈ చంద్రశేఖర్ రైతు ఆనంద్ నుంచి 20 వేల రూపాయల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో అందరికీ కరెంట్ షాక్ ఇచ్చే విద్యుత్ శాఖ అధికారికే ఆ రైతు షాక్ ఇచ్చాడు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే