Telangana: ఏడాది చిన్నారి ప్రాణాలు తీసిన వీధి కుక్కలు.. అధికారుల నిర్లక్షమే అంటూ ఆరోపణలు

గురువారం అర్ధరాత్రి సూర్య కుమార్ నిద్రిస్తున్న సమయంలో సంవత్సరం వయస్సు ఉన్న కుమారుడు నాగరాజుపై  20 కుక్కలు ఒకేసారి పాసివికంగా దాడి చేశాయి. పదునైన పళ్లతో బాలుడి పట్టుకుని రోడ్డుమీదుకు ఈడ్చుకెళ్లాయి. ఇదంతా తల్లిదండ్రులు గమనించలేదు.  కాసేపటికి పక్కన చిన్నారి కనిపించక పోవడంతో గాభరాపడ్డారు‌. కొడుకు నాగరాజు కోసం చుట్టుపక్కన వెదికినా ఎక్కడా కనిపించలేదు. చివరకు రోడ్డుపై కుక్కలు దాడిచేయడం గుర్తించారు

Telangana: ఏడాది చిన్నారి ప్రాణాలు తీసిన వీధి కుక్కలు.. అధికారుల నిర్లక్షమే అంటూ ఆరోపణలు
Dog Attack
Follow us

| Edited By: Surya Kala

Updated on: Feb 02, 2024 | 8:11 AM

కుక్క కాట్లకు ఒ చిన్నారి బలైంది. ఇంటి వద్ద నిద్రపోతున్న చిన్నారిని దూరానికి లాక్కుని వెళ్లి చంపేశాయి. నిండు నూరేళ్లు జీవితం ఏడాదికే ముగిసిపోయిందని చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నాగారం గ్రామానికి చెందిన సూర్యకుమార్ తన భార్య ఇద్దరు పిల్లలతో కలిసి సమా ఎన్ క్లేవ్ కాలనీలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్నాడు. అయితే గురువారం అర్ధరాత్రి సూర్య కుమార్ నిద్రిస్తున్న సమయంలో సంవత్సరం వయస్సు ఉన్న కుమారుడు నాగరాజుపై  20 కుక్కలు ఒకేసారి పాసివికంగా దాడి చేశాయి.

పదునైన పళ్లతో బాలుడి పట్టుకుని రోడ్డుమీదుకు ఈడ్చుకెళ్లాయి. ఇదంతా తల్లిదండ్రులు గమనించలేదు.  కాసేపటికి పక్కన చిన్నారి కనిపించక పోవడంతో గాభరాపడ్డారు‌. కొడుకు నాగరాజు కోసం చుట్టుపక్కన వెదికినా ఎక్కడా కనిపించలేదు. చివరకు రోడ్డుపై కుక్కలు దాడిచేయడం గుర్తించారు. పరుగెత్తుకుంటూ వెళ్లి కుక్కలను తరిమి.. బాబుని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే ఉలుకు, పలుకు లేదు. బాబు శరీరం అంతా కుక్క కాట్లే కనిపించాయి. కన్న కొడుకు పరిస్థితి చూసి కుటుంబ సభ్యులు గుండెలు బాదుకున్నారు‌. అప్పటికే బాబు మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. కుక్కల దాడిలో మృతిచెందిన చిన్నారి నాగరాజు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకి తరలించారు. చిన్నారి నాగరాజు మృతికి కారణం ముమ్మాటికి మున్సిపల్ ఆధికారుల నిర్లక్ష్యం అంటూ స్థానిక కౌన్సిలర్ కొండ ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. వీధిలో పెరుగుతున్న కుక్కల గురించి ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని.. తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఈ దుర్గటన జరిగిందన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ