Kumari Aunty Food Point: సీఎం స్పెషల్.. రేవంత్ రెడ్డి కోసం అవన్నీ వండిపెడతా.. : కుమారి ఆంటీ
హైదరాబాద్ లో రోడ్డు పక్కన భోజనం స్టాల్ పెట్టుకొని జీవనం సాగిస్తున్న కుమారి ఆంటీ ఒక్కసారిగా ఫెమస్ అయ్యారు. రుచికరమైన భోజనాలు అందుబాటు రేట్లకు అందించడంతో సోషల్ మీడియాలో ఫుడ్ లవర్స్ ఆమె వీడియోలను వైరల్ చేశారు. రెండు లివర్లు వెయ్యి రూపాయిలు అంటూ ఆమె చెప్పడంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ మీమ్స్ చేశారు. ఆ తర్వాత చాలా మంది బ్లాగర్స్ ఆమె ఫుడ్ స్టాల్ ను సందర్శించి ఆమె ఫుడ్ టెస్ట్ తో పాటు అక్కడ రేట్లను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
కుమారి ఆంటీ.. ఇప్పుడు ఎక్కడ చూసిన ఈ పేరు మారుమ్రోగుతుంది. మొన్నటి వరకు స్ట్రీట్ ఫుడ్ తో కొంతమందికే తెలిసిన ఈమె ఇప్పుడు సెలబ్రెటీ రేంజ్ లోకి మారిపోయింది. ఇదంతా సోషల్ మీడియా మహిమ.. హైదరాబాద్ లో రోడ్డు పక్కన భోజనం స్టాల్ పెట్టుకొని జీవనం సాగిస్తున్న కుమారి ఆంటీ ఒక్కసారిగా ఫెమస్ అయ్యారు. రుచికరమైన భోజనాలు అందుబాటు రేట్లకు అందించడంతో సోషల్ మీడియాలో ఫుడ్ లవర్స్ ఆమె వీడియోలను వైరల్ చేశారు. రెండు లివర్లు వెయ్యి రూపాయిలు అంటూ ఆమె చెప్పడంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ మీమ్స్ చేశారు. ఆ తర్వాత చాలా మంది బ్లాగర్స్ ఆమె ఫుడ్ స్టాల్ ను సందర్శించి ఆమె ఫుడ్ టెస్ట్ తో పాటు అక్కడ రేట్లను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేశారు. మీమ్స్‌లో చూపించినట్టు కుమారి ఆంటీ దగ్గర రేట్లు అంత ఎక్కువ కాదు. చాలా అందుబాటు ధరలోనే ఉన్నాయి. దాంతో ఆమె ఫుడ్ స్టాల్‌కు జనం పోటెత్తారు..
రోజూ వందల సంఖ్యలో జనాలు అక్కడకు రావడంతో పాటు ఫోటోలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని పోలీసులు ఆమె స్ట్రాల్ ను మూయించారు. దాంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అయితే పోలీసులు తనతో దుసురుసుగా ప్రవర్తించారని, తన కొడుకుపై చేయి చేసుకున్నారని తెలిపారు కుమారి ఆంటీ.. తనకున్న జీవనాధారాన్ని దూరం చేసి అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు ఆమె. దాంతో సోషల్ మీడియాతో పాటు మెయిన్ మీడియా ఛానెల్స్ లోనూ ఈవార్త హాట్ టాపిక్ గా మారిపోయింది.
దాంతో ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ విషయం పై స్పందించారు. కుమారి ఆంటీ స్టాల్ ను అక్కడే నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని అలాగే ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా చూడాలని పోలీసులను ఆదేశించారు సీఎం. త్వరలోనే ఆమె ఫుడ్ స్టాల్ ను సందర్శిస్తాను అని కూడా తెలిపారు సీఎం. ఏకంగా సీఎం స్పందించడంతో కుమారి అంటి ఆనందం వ్యక్తం చేశారు. తనలాంటి చిన్న ఫుడ్ స్టాల్ మహిళను ఆదుకోవడానికి సీఎం రావడం చాలా ఆనందంగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి వస్తే.. ఆయనకు ఇష్టమైనవన్నీ వండి పెడతానని కుమారి ఆంటీ చెప్పుకొచ్చింది.