Hyderabad: ప్రజా భవన్ ముందు ఆటో దగ్ధం.. మంటల్లో దూకేందుకు యత్నించిన ఆటో డ్రైవర్‌!

హైదరాబాద్‌లోని ప్రజాభవన్ ముందు ఆటో దగ్ధం అయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆటోలో నుంచి డ్రైవర్ బయటికి దూకడంతో ప్రమాదం తప్పింది. కాంగ్రెస్‌ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ జీవనోపాథి దెబ్బతిందంటూ సదరు ఆటోవాలా ఆటోకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశాడు. తాము అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన పేరుతో ప్రజలవాణిని వింటామని చెప్పిన సాక్షాత్తు ప్రజా భవన్‌ ఎదుటే గురువారం..

Hyderabad: ప్రజా భవన్ ముందు ఆటో దగ్ధం.. మంటల్లో దూకేందుకు యత్నించిన ఆటో డ్రైవర్‌!
Auto Driver Sets Fire To Auto Rickshaw
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 02, 2024 | 7:56 AM

హైద‌రాబాద్, ఫిబ్రవరి 2: హైదరాబాద్‌లోని ప్రజాభవన్ ముందు ఆటో దగ్ధం అయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఆటోలో నుంచి డ్రైవర్ బయటికి దూకడంతో ప్రమాదం తప్పింది. కాంగ్రెస్‌ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ జీవనోపాథి దెబ్బతిందంటూ సదరు ఆటోవాలా ఆటోకు నిప్పంటించి నిరసన వ్యక్తం చేశాడు. తాము అధికారంలోకి వచ్చాక ప్రజాపాలన పేరుతో ప్రజలవాణిని వింటామని చెప్పిన సాక్షాత్తు ప్రజా భవన్‌ ఎదుటే గురువారం ఆటో డ్రైవర్‌ తన ఆటోను దగ్ధం చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అసలేం జరిగిందంటే..

గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో ప్రజా భవన్‌ ఎదుట ఓ ఆటో వచ్చి ఆగింది. అందులోనుంచి దిగిన డ్రైవర్‌ ఆటోపై పెట్రోల్‌పోశాడు. అనంతరం జేబులోనుంచి అగ్గిపెట్టె తీసి నిప్పంటించాడు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆటో నుంచి మంటలు చెలరేగడంతో పూర్తిగా కాలి పోయింది. అనంతరం ఆటోడ్రైవర్‌ కూడా మంటలవైపు వెళ్తుండగా వెంటనే పోలీసులు అతడిని పక్కకు లాగేశారు. రోడ్డుపై వెళ్తున్న ఇతర ప్రయాణికులు ఆ దృశ్యాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. ప్రజాభవన్‌ ఎదుట ఆటోకు నిప్పంటించిన వ్యక్తిని మియాపూర్‌కు చెందిన దేవ్లానాయక్‌ (45) అనే ఆటో డ్రైవర్‌ పోలీసులు గుర్తించారు. తన ఆటోకు తానే నిప్పంటించుకొన్న సంఘటన సంచలనంగా మారింది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో గిరాకీ లేక కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని, అందుకే తన ఆటోకు నిప్పంటించినట్లు దేవ్లానాయక్‌ తెలిపాడు. తన కండ్ల ఎదుట తగలబడుతున్న ఆటోను చూస్తూ కన్నీంటిపర్యంతయ్యాడు. తనకు ఇద్దరు ఆడపిల్లలు, ఒక్క కొడుకు, భార్య ఉన్నారని, పదేండ్ల నుంచి ఆటోనే ఆధారంగా బతుకుతున్నానన్నాడు. ఆటో నడుపుకుంటూ రోజుకు రూ.2 వేలు సంపాదించే తాను ఇప్పుడు రోజుకు రూ.500 కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. 50 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా స్పందించిన తమకు న్యాయం చేయాలని వేడుకున్నాడు.

కాగా కాంగ్రెస్‌ సర్కారు అధికారంలోకి వచ్చాక మహాలక్ష్మి పథకాన్ని అమలుచేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తోంది. దీంతో ఆటోలకు గిరాకీ తగ్గడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆటోడ్రైవర్లు ఆందోళన బాటపట్టారు. జీవనోపాధి దెబ్బతినడంతో ఇప్పటివరకూ 14 మంది ఆటో డ్రైవర్లు ప్రాణాలు కోల్పోయారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.