Sangareddy: ట్రాఫిక్ పోలీసుల ఓవర్ యాక్షన్.. ప్రయాణికుడి ఫోన్ లాక్కుని బెదిరింపులు! నడిరోడ్డుపైనే నిప్పంటించుకున్న వ్యక్తి
సంగారెడ్డిలో ఆటో కోసం వేచిచూస్తున్న సంతోష్ అనే వ్యక్తి ఫోన్‌ను పోలీసులు లాక్కున్నారు. తన ఫోన్ తిరిగివ్వాలని సంతోష్ కోరాడు. కానీ పోలీసులు అతడు అడిగినకొద్దీ అధికంగా బెదిరించసాగారు. దీంతో మనస్తాపం చెంది సంతోష్ దగ్గర్లోని పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తెచ్చుకుని, ఒంటిపై పోసుకుని నడి రోడ్డుపై నిప్పంటించుకున్నాడు. అగ్నికీలల్లో కాలిపోతున్న వ్యక్తిని గమనించిన స్థానికులు మంటలార్పి, ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన సంగారెడ్డి చౌరస్తాలో గురువారం సాయంత్రం..
సంగారెడ్డి, ఫిబ్రవరి 2: సంగారెడ్డిలో ఆటో కోసం వేచిచూస్తున్న సంతోష్ అనే వ్యక్తి ఫోన్‌ను పోలీసులు లాక్కున్నారు. తన ఫోన్ తిరిగివ్వాలని సంతోష్ కోరాడు. కానీ పోలీసులు అతడు అడిగినకొద్దీ అధికంగా బెదిరించసాగారు. దీంతో మనస్తాపం చెంది సంతోష్ దగ్గర్లోని పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తెచ్చుకుని, ఒంటిపై పోసుకుని నడి రోడ్డుపై నిప్పంటించుకున్నాడు. అగ్నికీలల్లో కాలిపోతున్న వ్యక్తిని గమనించిన స్థానికులు మంటలార్పి, ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన సంగారెడ్డి చౌరస్తాలో గురువారం సాయంత్రం జరిగింది. సిద్దిపేటలో విధులు ముగించుకొని బస్సులో వచ్చిన సంతోష్ (45) బస్టాండ్ వద్ద దిగి, ఆటో కోసం చూస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న పోలీసులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని ఫొటోలు తీస్తున్నారు. దీన్ని గమనించిన సంతోష్ తన వద్ద ఉన్న ఫోన్‌తో ట్రాఫిక్ పోలీసుల చర్యలను చిత్రీకరించాడు. వెంటనే పోలీసులు అతడి ఫోన్ లాక్కొని బెదిరింపులకు దిగారు.
తన ఫోన్ తిరిగి ఇవ్వాలని సంతోష్ కోరినా పోలీసులు తిరిగివ్వలేదు. పైగా బెదిరింపులకు దిగారు. దీంతో మనస్తాపం చెందిన సంతోష్ పోలీసుల ఎదుటే పెట్రోల్ బంక్ నుంచి పెట్రోల్ తెచ్చి ఒంటిపై పోసుకొని, నిప్పంటించుకున్నాడు. తమ కళ్ల ఎదుట ఇంత జరుగుతున్న పోలీసులు కనీసం అతన్ని ఆపే ప్రయత్నం చూడా చేయలేదు. చుట్టు పక్కల వారు గమనించి మంటలు ఆర్పి, అతన్ని దవాఖానకు తరలించారు. 50 శాతం కాలిన గాయాలయ్యాయి. దీంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా దవాఖానకు తరలింపు తరలించారు. పోలీసులు తన ఫోన్ లాక్కొని ఇబ్బంది పెట్టారని, అందుకే ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డానని బాధితుడు సంతోష్ తెలిపాడు. బాధితుడు సిద్దిపేటలో కాంట్రాక్టు ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
అచితూ ఈ ఘటనలో పోలీసుల తప్పేమీ లేదని సంగారెడ్డి డీఎస్పీ రమేశ్‌కుమార్ మీడియాకు తెలిపారు. అతడే పోలీసుల విధులకు ఆటంకం కలిగించాడని, నిబంధనలకు విరుద్ధంగా వీడియోలు తీశాడని డీఎస్పీ వెల్లడించారు. పోలీసులు అతడి నుంచి ఫోన్ తీసుకొని వీడియోలు పరిశీలిస్తుండగా.. మద్యం మత్తులో ఉన్న అతడు పోలీసులపై తిరగబడే ప్రయత్నం చేశాడని వివరించారు. ఆ తర్వాత పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడని తెలిపారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్టు ఆయన మీడియకు తెలిపారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.