Mass Marriage Fraud: కాసులకు కక్కుర్తిపడి ఉత్తుత్తి పెళ్లిళ్లు.. తమ మెడలో తామే తాళి కట్టుకున్న యువతులు!
ప్రభుత్వం ఇచ్చే పథకం కోసం ఉత్తరప్రదేశ్ యువతులు ఉత్తుత్తి పెళ్లిళ్లు చేసుకున్నారు. పెళ్లికొడుకు లేకుండానే వందలాది యువతులు తమను తామే వరమాలలు వేసుకుని వివాహం చేసుకున్నారు. ఈ విచిత్ర ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో చోటు చేసుకునంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'సీఎం సామూహిక వివాహ వేడుక'లో ఈ దృశ్యం కనిపించింది. వీరంతా తమను తామే ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలిస్తే అవాక్కవుతారు..
బలియా, ఫిబ్రవరి 1: ప్రభుత్వం ఇచ్చే పథకం కోసం ఉత్తరప్రదేశ్ యువతులు ఉత్తుత్తి పెళ్లిళ్లు చేసుకున్నారు. పెళ్లికొడుకు లేకుండానే వందలాది యువతులు తమను తామే వరమాలలు వేసుకుని వివాహం చేసుకున్నారు. ఈ విచిత్ర ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బలియా జిల్లాలో చోటు చేసుకునంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సీఎం సామూహిక వివాహ వేడుక’లో ఈ దృశ్యం కనిపించింది. వీరంతా తమను తామే ఎందుకు పెళ్లి చేసుకున్నారో తెలిస్తే అవాక్కవుతారు. అసలు విషయమేమంటే..
ఆ డబ్బు కోసమే నకిలీ పెళ్లి డ్రామా..
ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేదింటి యువతుల పెళ్లి కోసం ‘సీఎం సామూహిక వివాహ వేడుక’ పథకాన్ని ప్రారంభించింది. వివాహం చేసుకున్న నిరుపేద కుటుంబానికి చెందిన యువతీయువకులకు ఈ పథకం కింద రూ.51,000 ఆర్థిక సాయం అందజేస్తుంది. అయితే ఆ పధకం ద్వారా లబ్ధి పొందాలనే అత్యాశతో కొందరు అవినీతికి పాల్పడ్డారు. అధికారులు, దళారులతో చేతులు కలిసి వందలాదిమంది యువతులకు ఉత్తుత్తి పెళ్లిళ్లు జరిపారు. ఈనెల 25న మణియార్ఇంటర్కాలేజీలో నిర్వహించిన ప్రభుత్వ సామూహిక పెళ్లిళ్ల కార్యక్రమానికి నకిలీ వధూవరులను భారీ ఎత్తున్న తీసుకువచ్చారు. కొందరు పెళ్లికాని యువతులను, మరికొందరు అప్పటికే కొత్తగా పెళ్లైన యువతీయువకులకు డబ్బు ఎర వేసి తీసుకువచ్చారు. దీంతో వీరంతా నకిలీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యారు. తంతులో భాగంగా తమతమ మెడల్లో తామే పూలదండలు వేసుకొని పెళ్లి చేసుకున్నారు. ఈ విషయమై ఓ యువకుడిని ప్రశ్నించగా.. డబ్బు ఆశ చూపి నకిలీ పెళ్లికొడుకుగా ఉండాలని కొందరు దళారులు తనను కోరారని, దీంతో ఈ వివాహ వేడుకలో కొందరు వధువులు తమ మెడలో తామే వరమాలలు వేసుకున్నారు. అయితే జంటగా కూర్చున్న యువతీయువకులు కూడా ఇలాగే చేశారు. వరుడు వధువుకు సింధూరం కూడా పెట్టలేదు. ఇందుకు సంబంధించిన వీడియో వెలుగులోకి రావడంతో నకిళీ పెళ్లిళ్ల వ్యవహారం బయటపడింది.
దీనిపై స్పందించిన జిల్లా యంత్రాంగం చర్యలకు పూనుకుంది. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి దీపక్ శ్రీవాస్తవ ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి సామూహిక వివాహ వేడుక పథకంలో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై అధికారి సునీల్కుమార్యాదవ్తో పాటు 8 మంది నకిలీ లబ్ధిదారులపై కేసు నమోదు చేశారు. అయితే సునీల్‌కుమార్ అనే అధికారి దరఖాస్తులను పరిశీలించడంలో నిర్లక్ష్యం వహించారనే కారణంతో ఆయనపైనా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. మనియార్ డెవలప్‌మెంట్ బ్లాక్‌లో జరిగిన సామూహిక వివాహాల వేడుకలో పాల్గొన్న లబ్ధిదారులెవ్వరికీ ప్రభుత్వం ఇంకా నగదు విడుదల చేయలేదని జిల్లా పాలనాధికారి రవీంద్ర కుమార్తెలిపారు. ప్రాథమిక దర్యాప్తులో కేసు నమోదైన 8 మంది లబ్ధిదారులకు ఇదివరకే విడివిడిగా వివాహాలు జరిగినట్లు తేలింది. వీరంతా తమకు పెళ్లి జరిగిన విషయాలను దాచిపెట్టి పథకానికి దరఖాస్తు చేసుకున్నారని పోలీసులు చెబుతున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.