Gold Smuggling: సినీ ఫక్కీలో గోల్డ్‌ స్మగ్లింగ్‌.. చాకచక్యంగా పట్టుకున్న ఎయిర్‌పోర్ట్‌ అధికారులు!

అక్రమంగా బంగారం తరలిస్తోన్న ఓ ప్రయాణికుడిని ముంబై ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్‌లోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు సోమవారం (జనవరి 29) అరెస్ట్ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA)లో సాధారణ తనిఖీల్లో దాదాపు రూ.50 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణికుడు కువైట్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా 9 బంగారు ముక్కలను..

Gold Smuggling: సినీ ఫక్కీలో గోల్డ్‌ స్మగ్లింగ్‌.. చాకచక్యంగా పట్టుకున్న ఎయిర్‌పోర్ట్‌ అధికారులు!
Gold Smuggling
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 31, 2024 | 9:27 AM

ముంబై, జనవరి 31: అక్రమంగా బంగారం తరలిస్తోన్న ఓ ప్రయాణికుడిని ముంబై ఎయిర్‌పోర్ట్ కస్టమ్స్‌లోని ఎయిర్ ఇంటెలిజెన్స్ యూనిట్ (AIU) అధికారులు సోమవారం (జనవరి 29) అరెస్ట్ చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం (CSMIA)లో సాధారణ తనిఖీల్లో దాదాపు రూ.50 లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సదరు ప్రయాణికుడు కువైట్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. ఎవరికీ అనుమానం రాకుండా 9 బంగారు ముక్కలను మయోనైజ్‌ బాటిళ్లలో దాచాడు. సీజ్‌ చేసిన దాదాపు 898 గ్రాముల బంగారం విలువ రూ.50 లక్షల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేస్తున్నారు.

తొలుత బంగారం ముక్కలను ఎలాంటి అనుమానం రాకుండా ఆరు మయోన్నైస్ బాటిళ్లలో దాచాడు. వాటిని నిందితుడు తన వద్ద ఉన్న పసుపు రంగు సూట్‌కేస్‌లోపల ఉంచాడు. అయితే ఈ సరుకును ఎవరు అందించారు, ముంబయిలో ఎవరికి అందజేయడానికి తీసుకువెళ్తున్నాడనే విషయాలు దర్యాప్తులో తేలుస్తామని అధికారులు తెలిపారు. డబ్బుకు బదులు సిండికేట్‌లను స్మగ్లింగ్ చేయడం ద్వారా పలువురిని క్యారియర్లు, మ్యూల్స్‌గా ఉపయోగించుకోవడం గతంలో కూడా పలు కేసుల్లో వెలుగులోకి వచ్చాయి.

మరో ఘటన.. కోట్ల రూపాయల గోల్డ్ స్మగ్లింగ్

ఈ నెల 20న మరో గోల్డ్ స్మగ్లింగ్ ఘటన చోటు చేసుకుంది. బంగారం అక్రమ రవాణాకు సంబంధించిన నాలుగు వేర్వేరు కేసుల్లో అధికారులు ఏకంగా రూ.1.74 కోట్ల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల్లో, ముగ్గురు ప్రయాణికులు ఒకే విమానంలో ప్రయాణించారు. వీరంతా దుబాయ్ నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ ముగ్గురు ప్రయాణికులు తమ వద్ద ఉన్న ట్రాలీ బ్యాగులు, ధరించిన దుస్తుల్లో బంగారాన్ని దాచి ఉంచారు. జెడ్డా నుంచి ముంబై విమానాశ్రయానికి వచ్చిన మరో ఇద్దరు ప్రయాణికులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ముంబై జోనల్ యూనిట్ అధికారులు జనవరి 16న పట్టుకున్నారు. వారిని తనిఖీ చేయగా ఒక్కొక్కరి నుంచి మైనం రూపంలో దాచిన దాదాపు రూ.2.59 కోట్ల విలువైన 1 కిలో బంగారం బయటపడింది. దీనిని స్వాధీనం చేసుకున్న కస్టమ్‌ అధికారులు నిందితులను కస్టడీకి తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.