Telangana: భార్యపై అనుమానం.. పురుగుల మందు తాగి సూసైడ్‌ చేసుకున్న భర్త!

భార్యపై అనుమానంతో నిండు జీవితానికి ముగింపు పలికాడో భర్త. తరచూ ఫోన్‌లో మాట్లాడుతున్న భార్యపై అనుమానం పెంచుకున్నాడు. వేరే ఎవరితోనే చనువుగా ఉంటుందని భావించాడు. అదే వారి కాపురంలో చిచ్చురేపింది. దీంతో తరచూ భార్య భర్తల మధ్య గొడవలు రాసాగాయి. మనస్తాపానికి లోనైన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మహబూబ్‌నగర్‌లోని ఊర్కొండ మండలంలోని రాచాలపల్లి గ్రామంలో చోటు..

Telangana: భార్యపై అనుమానం.. పురుగుల మందు తాగి సూసైడ్‌ చేసుకున్న భర్త!
Husband Commited Suicide
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 30, 2024 | 2:04 PM

మహబూబ్ నగర్, జనవరి 30: భార్యపై అనుమానంతో నిండు జీవితానికి ముగింపు పలికాడో భర్త. తరచూ ఫోన్‌లో మాట్లాడుతున్న భార్యపై అనుమానం పెంచుకున్నాడు. వేరే ఎవరితోనే చనువుగా ఉంటుందని భావించాడు. అదే వారి కాపురంలో చిచ్చురేపింది. దీంతో తరచూ భార్య భర్తల మధ్య గొడవలు రాసాగాయి. మనస్తాపానికి లోనైన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ మహబూబ్‌నగర్‌లోని ఊర్కొండ మండలంలోని రాచాలపల్లి గ్రామంలో చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మహబూబ్‌నగర్‌లోని ఊర్కొండ మండలంలోని రాచాలపల్లి గ్రామానికి చెందిన గౌరారం ఆనంద్‌ (34) ఐసీఐసీఐ బ్యాంకులో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్నాడు. సూర్యాపేట జిల్లాకు చెందిన సుస్మితను కొన్నేండ్ల కిందట అతను ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఒక పాప, బాబు సంతానం. భర్త ఇంటి నుంచి వెళ్లిన తర్వాత భార్య సుస్మిత తన వద్ద ఉన్న ఫోన్‌లో తన సొంత గ్రామానికి చెందిన వ్యక్తితో మాట్లాడసాగింది. ఇలా గత కొద్దిరోజులుగా తరుచుగా అదే వ్యక్తితో ఫోన్‌లో మాట్లాడుతుండడంతో.. భార్య సుస్మితపై భర్త ఆనంద్‌కు అనుమానం కలిగింది. ఈ విషయమై ఆనంద్‌ భార్యను నిలదీశాడు. దీంతో సుస్మిత అలిగి పుట్టింటికి వెళ్లింది. అయితే భార్య ఫోన్‌ మాట్లాడిన వ్యక్తి వద్దకే వెళ్లిందని ఆనంద్‌ భావించాడు. దీంతో అతను గత శనివారం రాత్రి గులికల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి దవాఖానకు తరలింయాకె. అక్కడ అతను చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుడి అన్న గోపాల్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఊర్కొండ ఏఎస్సై తెలిపాడు.

పక్క పొలం విద్యుత్‌ కంచె తగిలి యువ రైతు మృతి

కోతుల నుంచి పంటను కాపాడుకునేందుకు ఓ రైతు ఏర్పాటు చేసిన విద్యుత్‌ కంచె పక్క పొలం రైతును బలితీసుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. తిరుమలాయపాలెం మండలంలోని హైదర్‌సాయిపేటకు చెందిన షేక్‌ యాకూబ్‌ పాషా(28) అనే వ్యక్తి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. అతను తండ్రితో కలిసి పొలానికి పోయి వ్యవసాయంలో సాయపడుతుండేవాడు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం మోటారు ఆన్‌ చేసేందుకు పొలానికి వెళ్లాడు. అయితే వారి పొలానికి పక్కనున్న పొలంలో రైతు లూనావత్‌ వెంకన్న కోతుల బెడద తట్టుకోలేక చుట్టూ అమర్చిన తీగకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చాడు. ఈ విషయం తెలియని యాకూబ్‌ పాషా తీగలు తగిలి విద్యుదాఘాతంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లూనావత్‌ వెంకన్న, అతని కుమారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా మృతుడికి భార్య, ఏడాది వయసున్న కొడుకు ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

కలియుగాంతాన్ని సూచించే ఈ ఆలయం.. ఎన్నో రహస్యాలకు నెలవు..
కలియుగాంతాన్ని సూచించే ఈ ఆలయం.. ఎన్నో రహస్యాలకు నెలవు..
నన్ను అరెస్ట్ చేసి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించే ఛాన్స్ ఉంది:
నన్ను అరెస్ట్ చేసి.. థర్డ్ డిగ్రీ ప్రయోగించే ఛాన్స్ ఉంది:
లేటు వయసులో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ నటుడు.. నటి జ్యోతితో కలిసి
లేటు వయసులో పెళ్లికి సిద్ధమైన టాలీవుడ్ నటుడు.. నటి జ్యోతితో కలిసి
పేదింటి పిల్లలకు ఉచితంగా గొప్పచదువులు.. నవోదయకు దరఖాస్తు చేశారా?
పేదింటి పిల్లలకు ఉచితంగా గొప్పచదువులు.. నవోదయకు దరఖాస్తు చేశారా?
ఆ అలవాటు ఉంటే యమ డేంజర్ అంట.. ఇందుకే అంటారు న‌య‌నం ప్ర‌ధానం అని..
ఆ అలవాటు ఉంటే యమ డేంజర్ అంట.. ఇందుకే అంటారు న‌య‌నం ప్ర‌ధానం అని..
పోలింగ్ బూత్‌లో పబ్లిక్ టాయిలెట్‌పై అక్షయ్‌కు వృద్ధుడు ఫిర్యాదు
పోలింగ్ బూత్‌లో పబ్లిక్ టాయిలెట్‌పై అక్షయ్‌కు వృద్ధుడు ఫిర్యాదు
2024లో విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు వీరే
2024లో విడాకులు తీసుకున్న సెలబ్రెటీలు వీరే
యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 నోటిఫికేషన్‌
యూజీసీ- నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ డిసెంబర్‌ 2024 నోటిఫికేషన్‌
ఆ వీడియోలపై జాగ్రత్త తప్పనసరి.. స్పష్టం చేసిన ఆర్‌బీఐ
ఆ వీడియోలపై జాగ్రత్త తప్పనసరి.. స్పష్టం చేసిన ఆర్‌బీఐ
తన KCR సినిమా పోస్టర్స్ తనే గోడ మీద అతికిస్తోన్న రాకింగ్ రాకేష్
తన KCR సినిమా పోస్టర్స్ తనే గోడ మీద అతికిస్తోన్న రాకింగ్ రాకేష్