Watch: రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి.. నరకయాతన.. వామ్మో వీడియో చూస్తే వణికిపోవాల్సిందే..
యువర్ అటెన్షన్ ప్లీజ్.. ట్రైన్ ఎక్కేటప్పుడు జాగ్రత్త.. రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించినా.. దిగేందుకు ప్రయత్నించిన ప్రమాదమే.. అంటూ తరచూ రైల్వే స్టేషన్లలో అనౌన్స్‌మెంట్ చేస్తుంటారు.. అంతేకాకుండా.. అవగాహనా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. అయినా కానీ.. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదంలో చిక్కుకుంటున్నారు..
యువర్ అటెన్షన్ ప్లీజ్.. ట్రైన్ ఎక్కేటప్పుడు జాగ్రత్త.. రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించినా.. దిగేందుకు ప్రయత్నించిన ప్రమాదమే.. అంటూ తరచూ రైల్వే స్టేషన్లలో అనౌన్స్‌మెంట్ చేస్తుంటారు.. అంతేకాకుండా.. అవగాహనా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటారు. అయినా కానీ.. కొందరు నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదంలో చిక్కుకుంటారు.. ఒక్కోసారి ప్రాణాలకు కూడా పోతాయి. తాజాగా.. అలాంటి ప్రమాదం ఒకటి అందరినీ ఆందోళనకు గురిచేసింది.
వికారాబాద్ రైల్వేస్టేషన్‌లో రెండు గంటల పాటు నరకయాతన పడ్డాడో వ్యక్తి. సతీష్ అనే ప్రయాణికుడు కదులుతున్న ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించాడు. అదుపుతప్పి ట్రైన్‌కు, ప్లాట్‌ఫాంకు మధ్యలో పడిపోయాడు. అంతే రెండు గంటల పాటు నరకయాతన అనుభవించాడు. అతను పడుతున్న ఇబ్బంది చూసి అక్కడున్న వారంతా ఏం చేయాలో అర్ధం కాక చలించిపోయారు. పాపం ట్రైన్ మిస్ అవుతుందన్న హడావుడిలో ఎక్కేందుకు యత్నించి ఇలా ప్రమాదం బారిన పడ్డాడు సతీష్.
సతీష్.. ట్రైన్‌కు, ప్లాట్‌ఫాంకు మధ్యలో పడిపోవడాన్ని గమనించిన సిబ్బంది వెంటనే ట్రైన్ ను నిలిపివేశారు. రైలు నిలిపివేసిన తర్వాత బయటకు తీసేందుకు ప్రయత్నించినా రాకపోవడంతో.. ప్లాట్‌ఫాం పగలగొట్టి బయటకు తీశారు. ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వ్యక్తి రాయచూర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు రైల్వే పోలీసులు.
వీడియో చూడండి..
రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించి పట్టుజారితే ఎంత ప్రమాదమో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. ఈ ఘటనతో ట్రైన్ రెండు గంటల పాటు నిలిచిపోయింది. ప్లాట్‌ఫాం మధ్యలో ఇరుక్కుపోయిన సతీష్ రెండు గంటలు నరకయాతన అనుభవించాడు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..