TS 10th Exams 2024: పదో తరగతి ఇంటర్నల్‌ మార్కుల తనిఖీలకు ప్రత్యేక బృందాలు.. పబ్లిక్‌ పరీక్షలు 80 మార్కులకే

తెలంగాణ రాష్ట్ర పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్‌ మార్కుల తనిఖీకి విద్యాశాఖ అధికారులు షెడ్యూల్‌ ఖరారు చేశారు. ఒక హెచ్‌ఎం, ముగ్గురు సబ్జెక్టు నిపుణులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు తనిఖీలు చేయనున్నారు. సబ్జెక్టు మార్కులు 100 ఉంటాయి. వీటిల్లో ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌ విధానంలో 20 మార్కులకు పరీక్షలు నిర్వహించి వాటి ఆధారంగా విద్యార్థికి మార్కులు కేటాయిస్తారు. దీంతో వార్షిక పరీక్షల్లో 80 మార్కులకు..

TS 10th Exams 2024: పదో తరగతి ఇంటర్నల్‌ మార్కుల తనిఖీలకు ప్రత్యేక బృందాలు.. పబ్లిక్‌ పరీక్షలు 80 మార్కులకే
TS 10th Exams
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 30, 2024 | 7:08 AM

తెలంగాణ రాష్ట్ర పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్‌ మార్కుల తనిఖీకి విద్యాశాఖ అధికారులు షెడ్యూల్‌ ఖరారు చేశారు. ఒక హెచ్‌ఎం, ముగ్గురు సబ్జెక్టు నిపుణులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు తనిఖీలు చేయనున్నారు. సబ్జెక్టు మార్కులు 100 ఉంటాయి. వీటిల్లో ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌ విధానంలో 20 మార్కులకు పరీక్షలు నిర్వహించి వాటి ఆధారంగా విద్యార్థికి మార్కులు కేటాయిస్తారు. దీంతో వార్షిక పరీక్షల్లో 80 మార్కులకు పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. అంటే 20 మార్కులను పాఠశాల స్థాయిలో ఉపాధ్యాయులే మూల్యాంకనం చేసి కేటాయిస్తారన్నమాట. ఈ మార్కులు, సమాధాన పత్రాలను పరిశీలించి పాఠశాలలు సక్రమంగా మార్కులు నమోదు చేశాయా.. లేదా.. అనే విషయాన్ని ప్రత్యేక బృందాలు తనిఖీల్లో తేల్చనున్నారు. ఈ తనిఖీలు ఫిబ్రవరి 1 నుంచి 3 వరకు అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో జరుగనున్నాయి.

సబ్జెక్టు నిపుణులు ఏయే అంశాలు పరిశీలిస్తారంటే..

తనిఖీలకు వెళ్లిన అధికారుల్లో ముగ్గురు సబ్జెక్టు నిపుణులు ఉంటారు. వీరు ఆయా సబ్జెక్టుల ఆధారంగా ప్రతి పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన ఇంటర్నల్‌ మార్కులను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అందుకు సమాధానపత్రాల్లో మార్కులను నిశితంగా పరిశీలిస్తారు. విద్యార్థి సమాధానాలు సరిగ్గా రాయకపోయినా అత్యధిక మార్కులు కేటాయిస్తే అటువంటి వారిపై చర్యలుంటాయి. సంబంధిత మార్కుల ప్రొఫార్మాను పోల్చుతూ విద్యార్థి రాసిన సమాధానపత్రాలు పరిశీలిస్తారు. అలాగే విద్యార్థి రాసిన సమాధానాలకు ఉపాధ్యాయులు సరిగ్గా మార్కులు వేశారా? లేదా అనే అంశాన్ని పరిశీలిస్తారు. విద్యార్థి హాజరు పట్టికలు, ప్రాజెక్ట్‌ రిపోర్టులను పరిశీలిస్తారు. సబ్జెక్టు నిపుణులు పరిశీలించిన వాటిలో ఏవైనా పొరబాట్లు ఉంటే బృంద నాయకుడికి వివరిస్తారు. ఈ మేరకు వారు ఓ నివేదికను తయారు చేసి సంబంధిత తనిఖీ కన్వీనర్‌ డీసీఈబీ సెక్రటరీ ద్వారా డీఈవోకి అందజేస్తారు. ఇలా అన్ని యాజమాన్యాల పరిధిలోని పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థుల ఇంటర్నల్‌ మార్కులను తనిఖీ చేయనున్నారు. అంటే ఎయిడెడ్‌, బీసీ వెల్ఫేర్‌, ప్రభుత్వ, ఐటీడీఏ, కేజీబీవీలు, టీఎస్‌ఎంఎస్‌, ప్రైవేట్‌, టీఎస్‌ఆర్‌ఎస్‌, టీఎస్‌డబ్ల్యూఈఎస్‌, జిల్లా పరిషత్‌ పాఠశాలల్లో తనిఖీలు నిర్వహిస్తారు.

ఇంటర్నల్‌ మార్కుల తనిఖీలకు నిపుణులైన ఉపాధ్యాయులను ఎంపిక చేశారు. ప్రతి బృందానికి ఒక సీనియర్‌ ప్రధానోపాధ్యాయుడు (హెచ్‌ఎం) నాయకత్వం వహిస్తారు. అతడి ఆధ్వర్యంలో ప్రతి బృందానికీ ముగ్గురు సబ్జెక్టు నిపుణులు ఉంటారు. తెలుగు, హిందీ సబ్జెక్టులకు కలిపి ఒకరు, ఇంగ్లిష్‌, గణితం సబ్జెక్టులకు ఒకరు, సోషల్‌, సైన్స్‌ సబ్జెక్టులకు ఒకరు.. ఇలా ముగ్గురు ఉంటారు. వీరికి కేటాయించిన సబ్జెక్టుల ఆధారంగా ఆయా పాఠశాలల్లో తనిఖీలు చేపడుతారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ సంబంధిత వార్తాకథనాల కోసం క్లిక్‌ చేయండి.