Andhra Pradesh: మదనపల్లిలో నాటు తుపాకీ కాల్పుల కలకలం.. మహిళకు గాయాలు

అన్నమయ్య జిల్లా మదనపల్లి రూరల్ మండలంలో నాటు తుపాకీ కాల్పుల వ్యవహరం కలకలం రేపింది. వేటగాళ్ల కాల్పుల్లో తూటా తగిలి మహిళ కు తీవ్ర గాయాల పాలైంది. అపస్మారక స్థితి పడిపోయిన పాపులమ్మ అనే మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అసలేం జరిగిందంటే.. మదనపల్లి మండలం ఆవులపల్లికి చెందిన పాపులమ్మ గ్రామ సమీపంలోని..

Andhra Pradesh: మదనపల్లిలో నాటు తుపాకీ కాల్పుల కలకలం.. మహిళకు గాయాలు
Gunfire In Madanapally
Follow us
Raju M P R

| Edited By: Srilakshmi C

Updated on: Jan 30, 2024 | 8:50 AM

మదనపల్లి, జనవరి 30: అన్నమయ్య జిల్లా మదనపల్లి రూరల్ మండలంలో నాటు తుపాకీ కాల్పుల వ్యవహరం కలకలం రేపింది. వేటగాళ్ల కాల్పుల్లో తూటా తగిలి మహిళ కు తీవ్ర గాయాల పాలైంది. అపస్మారక స్థితి పడిపోయిన పాపులమ్మ అనే మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. అసలేం జరిగిందంటే.. మదనపల్లి మండలం ఆవులపల్లికి చెందిన పాపులమ్మ గ్రామ సమీపంలోని పొలంలో ఉండగా వేటగాళ్లు అడవి జంతువుల కోసం వేటాడే క్రమంలో తూటాకు గురైంది. ఘటనపై ఆరా తీసిన పోలీసులు అనుమానితులను అదుపులో తీసుకుని దర్యాప్తు చేపట్టారు. వారి వద్ద నుంచి నాటు తుపాకీ నీ స్వాధీనం చేసుకున్నారు.

కాగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని పడమటి ప్రాంతంలో గత కొంత కాలంగా వేటగాళ్లు రెచ్చిపోతున్నారు. తరచూ ఇలాంటి ఘటనలకు కారణం అవుతున్నారు. వేటగాళ్లు నాటు తుపాకులను విచ్చలవిడిగా వినియోగిస్తుండటంపై పోలీసు యంత్రాంగం కూడా దృష్టి సారించింది. ఈ క్రమంలో తాజా ఘటన చోటు చేసుకుంది. వెంటనే అప్రమత్తమైన పోలీస్‌ యంత్రంగం నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
సమంత పై కీర్తిసురేష్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
'ఢిల్లీ సీఎం అతిషిని అరెస్టు చేయవచ్చు.. ': అరవింద్ కేజ్రీవాల్
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఇలాంటి డైట్ తీసుకుంటే లివర్ కడిగినట్లు శుభ్ర పడుతుంది..
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
ఏపీని వీడని వానలు.. వచ్చే 3 రోజులు ఈ ప్రాంతాల్లో వర్షాలే వర్షాలు.
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
సంధ్య థియేటర్‌ ఘటనపై ఫేక్‌ పోస్ట్‌లు పెడితే ఊరుకునేది లేదు..
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
చిన్న పరిశ్రమల్లో ఊపందుకున్న ఉపాధి అవకాశాలు.. ఏడాదిలో కోటి జాబ్స్
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
హైదరాబాద్ కు చెందిన శ్రేయాస్‌కు కుంభ మేళా ప్రకటనల హక్కులు..
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అయ్యో స్వప్నా ఎంత పని చేశావు.. తాతయ్య బిల్ కోసం కావ్య కష్టాలు!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ క్రిస్మస్ వేడుకలు..!
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..
ప్రార్థనలు ఫలించాయి.. శివన్న ఆపరేషన్ సక్సెస్..