Sania Mirza: విడాకుల తర్వాత సానియా మీర్జా ఎంత భరణం తీసుకుందో తెలుసా..

షోయబ్ మాలిక్ మళ్లీ పెళ్లి కూడా చేసుకున్నాడు. షోయబ్ పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. షోయబ్ స్వయంగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పోస్ట్ చేసి రెండో పెళ్లి గురించి సమాచారం ఇచ్చాడు. షోయబ్ రెండో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేశారు.

Sania Mirza: విడాకుల తర్వాత సానియా మీర్జా ఎంత భరణం తీసుకుందో తెలుసా..
Sania Mirza
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 31, 2024 | 8:51 AM

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ విడాకుల గురించి గత ఏడాదిన్నరగా వార్తలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ ఇద్దరూ విడిపోయారు. షోయబ్ మాలిక్ మళ్లీ పెళ్లి కూడా చేసుకున్నాడు. షోయబ్ పాకిస్థాన్ నటి సనా జావేద్‌ను వివాహం చేసుకున్నాడు. షోయబ్ స్వయంగా ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలు పోస్ట్ చేసి రెండో పెళ్లి గురించి సమాచారం ఇచ్చాడు. షోయబ్ రెండో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేశారు.

సానియా మీర్జా షోయబ్ మాలిక్‌ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు, ఆమె చాలా విమర్శలను ఎదుర్కొంది. ఇద్దరూ 2010లో పెళ్లి చేసుకున్నారు. ఈ నిర్ణయంపై కొందరు సానియాను ట్రోల్ చేశారు. కానీ అవేమీ లెక్క చేయకుండా షోయబ్‌ను సానియా పెళ్లి చేసుకుంది. పెళ్లయ్యాక మొదట కొన్ని సంవత్సరాలు సంతోషంగానే గడిపారు. ఆతర్వాత వీరి మధ్య దూరం పెరుగుతూ వచ్చింది. పెళ్లయిన 10-12 ఏళ్ల తర్వాత ఇద్దరూ విడిపోయారు.

ఇదిలా ఉంటే సానియా మీర్జా షోయబ్ మాలిక్‌ తో విడాకుల తీసుకున్న తర్వాత భరణంగా ఎంత తీసుకుంది అన్నదని పై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతుంది. భార్యాభర్తలు విడాకులు తీసుకున్న తర్వాత భార్య మాజీ భర్త దగ్గర నుంచి ఎంతోకొంత భరణంగా తీసుకోవడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. అయితే సానియా షోయబ్ దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. షోయబ్ నుంచి ఒక్క రూపాయి కూడా తనకు అక్కర్లేదని తేల్చి చెప్పిందట సానియా. ఒక్క పైసా కూడా ఆశించకుండా విడాకుల పై సైన్ చేసిందట. ఈ వార్త పై నెటిజన్స్ సానియాను మెచ్చుకుంటూ కామెంట్స్ చేస్తున్నారు.

సానియా మీర్జా ఇన్ స్టా

View this post on Instagram

A post shared by Sania Mirza (@mirzasaniar)

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి..