- Telugu News Photo Gallery Cricket photos From Kuldeep Yadav to Saurabh Kumar These 3 Players Who Should Replace Ravindra Jadeja In Playing 11 in ind vs eng 2nd test
IND vs ENG: జడేజా ప్లేస్ కోసం ముగ్గురి మధ్య పోటీ.. ఆ యువ సెన్సెషన్‌కు అరంగేట్రం ఛాన్స్ దక్కేనా?
India vs England: విశాఖ వేదికగా ఫిబ్రవరి 2నుంచి భారత్ ఇంగ్లాడ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియా భారీ షాక్ తగిలింది. జట్టు నుంచి జడేజా, కేఎల్ రాహుల్ దూరమయ్యారు. అయితే, ఇక్కడ రవీంద్ర జడేజా స్థానంలో ముగ్గురు ఆటగాళ్ల మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. ఈ ముగ్గురు కూడా స్పిన్నర్లే కావడం విశేషం. దీంతో ఆ అవకాశం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరు?
Updated on: Jan 31, 2024 | 8:46 AM

India vs England: ఇంగ్లండ్‌తో రెండో టెస్టు మ్యాచ్‌కు టీమిండియా సిద్ధమైంది. విశాఖపట్నం వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా దూరమయ్యాడు. అతను మొదటి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా స్నాయువు గాయంతో బాధపడ్డాడు. ఇప్పుడు తదుపరి చికిత్స కోసం NCAకి వెళ్లాడు. అందుకే జడేజా స్థానంలో రెండో టెస్టు మ్యాచ్‌లో ఎవరు ఆడతారనే విషయంపై ఆసక్తి నెలకొంది.

అయితే, ఇక్కడ రవీంద్ర జడేజా స్థానంలో ముగ్గురు ఆటగాళ్ల మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొంది. ఈ ముగ్గురు కూడా స్పిన్నర్లే కావడం విశేషం. దీంతో ఆ అవకాశం ఎవరికి దక్కుతుందనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఆ ముగ్గురు ఆటగాళ్లు ఎవరు?

1- కుల్దీప్ యాదవ్: టీమిండియా తరపున 8 టెస్టు మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ యాదవ్ మొత్తం 34 వికెట్లు పడగొట్టాడు. కాగా, అతను 9 ఇన్నింగ్స్‌లు ఆడి 94 పరుగులు మాత్రమే చేశాడు. ఇక్కడ పర్ఫెక్ట్ స్పిన్నర్‌ను రంగంలోకి దించాలనుకుంటే, కుల్దీప్ యాదవ్ మొదటి ఎంపికగా మారనున్నాడు.

2- వాషింగ్టన్ సుందర్: రవీంద్ర జడేజా స్థానంలో ఆల్ రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ ఎంపికయ్యాడు. సుందర్ ఇప్పటివరకు టీమిండియా తరఫున 4 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. అతను 6 వికెట్లు, 96 పరుగులు చేశాడు. అంటే జడ్డూ స్థానంలో మరో ఆల్ రౌండర్ ను రంగంలోకి దింపితే సుందర్ కు అవకాశం దక్కుతుంది.ng 2nd Test 3

3- సౌరభ్ కుమార్: ఉత్తరప్రదేశ్‌కు చెందిన సౌరభ్ కుమార్ ఒకసారి టీమ్ ఇండియాలో కనిపించాడు. కానీ, అతనికి అరంగేట్రం చేసే అవకాశం రాలేదు. ఇప్పుడు మళ్లీ లెఫ్టార్మ్ స్పిన్-ఆల్ రౌండర్‌కు భారత జట్టులో అవకాశం లభించింది. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సౌరభ్ 68 మ్యాచ్‌ల్లో 2061 పరుగులు చేశాడు. 290 వికెట్లు కూడా తీశాడు. అందుకే ఇంగ్లండ్‌తో జరిగే రెండో టెస్టులో సౌరభ్ కుమార్‌కు అవకాశం వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు.

భారత టెస్టు జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, జస్ప్రీత్ బుమ్రా , సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, సౌరభ్ కుమార్, అవేష్ ఖాన్.




