Budget Session 2024: పేదరికం నిర్మూలనే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..
ప్రస్తుత 17వ లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు కానుండగా కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాక తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాదిలోనే లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఈ సమావేశాల్లో కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు..
Parliament Budget Session 2024 Updates: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా కొత్త పార్లమెంటు భవనంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం పదకొండున్నర గంటలకు అఖిలపక్షం మరోసారి సమావేశం కానుంది. ప్రస్తుత 17వ లోక్‌సభకు ఇవే చివరి సమావేశాలు కానుండగా కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాక తొలిసారిగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఏడాదిలోనే లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఈ సమావేశాల్లో కేంద్రం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. రేపు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడతారు..
ఈ బడ్జెట్ సమావేశాల్లో 19 బిల్లులను ప్రవేశపెడుతోంది కేంద్రం.. రాజ్యసభకు చెందిన ప్రివిలేజ్ కమిటీ మంగళవారం 11 మంది సభ్యులపై సస్పెన్షన్‌ను ఎత్తివేసింది. మరోవైపు.. బడ్జెట్ సమావేశాల్లో ప్రతి సమస్యపై చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆయా పార్టీల ఫ్లోర్ లీడర్లకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది..
లోక్‌సభ ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు మోదీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తుండగా, మరోవైపు కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. నిరుద్యోగిత, అధిక ధరలు, ఆర్థిక అసమానతల కారణంగా రైతాంగం, కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలపై మోదీ సర్కార్‌ను విపక్షాలు నిలదీయనున్నాయి.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..