Hanuman collections: అన్‌బిలీవబుల్‌.! 300 కోట్ల దిశగా హనుమాన్.. రికార్డ్స్ అన్ని బద్దలే.

Hanuman collections: అన్‌బిలీవబుల్‌.! 300 కోట్ల దిశగా హనుమాన్.. రికార్డ్స్ అన్ని బద్దలే.

Anil kumar poka

|

Updated on: Jan 31, 2024 | 10:54 AM

చిన్న సినిమా అన్నారు. సంక్రాంతి రేసు నుంచి తప్పించాలనుకున్నారు. కానీ తమ కంటెంట్‌ మీద బలంగా నమ్మకం ఉన్న ఈ సినిమా వాళ్లు.. ససేమిరా అన్నారు. థియేటర్లు తగ్గినా పర్లేదన్నారు. మెల్లిగా అయినా.. మా సినిమా హిట్టంతే.. అంటూ చెబుతూ వచ్చారు. కానీ వాళ్లు చెప్పింది తప్పు..! మరి ఏది ఒప్పు అంటే.. హనుమాన్ హిట్టు కాదు.. సూపర్ డూపర్ హిట్టు.. సెన్సేషనల్ హిట్టు! పాన్ ఇండియా స్పాన్‌లో మరో సారి తెలుగు సినిమా నిలబడింది... అని అందరూ చెప్పినట్టు.

చిన్న సినిమా అన్నారు. సంక్రాంతి రేసు నుంచి తప్పించాలనుకున్నారు. కానీ తమ కంటెంట్‌ మీద బలంగా నమ్మకం ఉన్న ఈ సినిమా వాళ్లు.. ససేమిరా అన్నారు. థియేటర్లు తగ్గినా పర్లేదన్నారు. మెల్లిగా అయినా.. మా సినిమా హిట్టంతే.. అంటూ చెబుతూ వచ్చారు. కానీ వాళ్లు చెప్పింది తప్పు.! మరి ఏది ఒప్పు అంటే.. హనుమాన్ హిట్టు కాదు.. సూపర్ డూపర్ హిట్టు.. సెన్సేషనల్ హిట్టు! పాన్ ఇండియా స్పాన్‌లో మరో సారి తెలుగు సినిమా నిలబడింది.. అని అందరూ చెప్పినట్టు. ఎస్ ! ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో.. తేజ సజ్జా చేసిన సూపర్ హీరో కాన్సెప్ట్ సినిమా హనుమాన్. సంక్రాంతి పండగ పూట.. పెద్ద సినిమాల మధ్య రిలీజ్‌ అయిన ఈ చిన్న సినిమా.. సూపర్ డూపర్ హిట్టైపోయింది. ఆల్ ఓవర్ వరల్డ్‌ దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంది. పాన్ ఇండియా లెవల్లో ప్రశాంత్ వర్మను.. అమేజింగ్ డైరెక్టర్‌గా నిలబెట్టేసింది. ఇక రీసెంట్‌గా.. 200 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టి అందర్నీ షాక్ అయ్యేలా చేసిన హనుమాన్.

తాజాగా 265 కోట్ల మార్కును కూడా టచ్ చేసింది. 300 కోట్ల దిశగా.. జెట్‌ స్పీడ్లో పరుగులు పెడుతూ.. ఇండియన్ ఫిల్మ్ ఫెటర్నిటీలో హాట్‌ టాపిక్ అవుతోంది. అటు హనుమాన్ ఓటీటీ స్ట్రీమింగ్ పై ఓ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని త్వరలోనే డిజిటల్ ప్లాట్ ఫాంపైకి తీసుకురావాలనుకుంటున్నారట. థియేటర్లలో హనుమాన్ ఫీవర్ తగ్గకముందే ఈచిత్రాన్ని ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనుకుంటున్నారట. అయితే తాజా సమాచారాం ప్రకారం ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను జీ5 కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది ఫిబ్రవరి రెండో వారంలో స్ట్రీమింగ్ కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ మాత్రం రాలేదు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos