Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gold Price Today: ఇప్పట్లో బంగారం కొనలేం.. పైపైకి ఎగబాకుతోన్న పుత్తడి! తులం గోల్డ్‌ ధర ఎంతుందంటే

పుత్తడిని ఇష్టపడని మగువలు ఉండరు. వేడుక ఏదైనా ఒంటి నిండా అందంగా అలంకరించుకుని అద్దంలో తమను తాము చూసుకుని మురిసిపోతుంటారు. ఇక పండగలు, ఫంక్షన్లకు కొత్త కొత్త డిజైన్లు కొనేందుకు అమితాశక్తి కనబరుస్తుంటారు. ధరెంతైనా చెల్లించి నచ్చిన నగలు కొంటుంటారు. అయితే కొందరు మాత్రం స్టాక్‌ మార్కెట్లో చోటు చేసుకునే పరిణామాలు జగ్రత్తగా పరిశీలిస్తూ ధరలు తగ్గినప్పుడు మదుపు చేసిన సొమ్మును వెచ్చింది బంగారం, వెండి ఆభరణాలు కొనేందుకు ఆసక్తి కనబరుస్తారు..

Gold Price Today: ఇప్పట్లో బంగారం కొనలేం.. పైపైకి ఎగబాకుతోన్న పుత్తడి! తులం గోల్డ్‌ ధర ఎంతుందంటే
Gold Price Today
Follow us
Srilakshmi C

|

Updated on: Jan 31, 2024 | 8:19 AM

హైదరాబాద్‌, జనవరి 31: పుత్తడిని ఇష్టపడని మగువలు ఉండరు. వేడుక ఏదైనా ఒంటి నిండా అందంగా అలంకరించుకుని అద్దంలో తమను తాము చూసుకుని మురిసిపోతుంటారు. ఇక పండగలు, ఫంక్షన్లకు కొత్త కొత్త డిజైన్లు కొనేందుకు అమితాశక్తి కనబరుస్తుంటారు. ధరెంతైనా చెల్లించి నచ్చిన నగలు కొంటుంటారు. అయితే కొందరు మాత్రం స్టాక్‌ మార్కెట్లో చోటు చేసుకునే పరిణామాలు జగ్రత్తగా పరిశీలిస్తూ ధరలు తగ్గినప్పుడు మదుపు చేసిన సొమ్మును వెచ్చింది బంగారం, వెండి ఆభరణాలు కొనేందుకు ఆసక్తి కనబరుస్తారు. అందుకు నిత్యం పుత్తడి, వెండి ధరల్లో వచ్చే హెచ్చు తగ్గులపై ఓ కన్నేసి ఉంచుతారు. తాజా ధరలు పరిశీలిస్తే గత వారం రోజులుగా బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్న సంగతి తెలిసిందే. బుధవారం కూడా అదేబాటలో దూసుకుపోతున్నాయి. జనవరి 31 మన దేశంలో బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే.. 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.5,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం రూ.6,327 వద్ద కొనసాగుతోంది. నిన్నటి ధరలతో పోల్చితే ఈ రోజు 22 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.20 పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.22లకు పెరిగింది.

ఆలెక్కన 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.58,000 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.63,270 గా ఉంది. 18 క్యారెట్ల గోల్డ్‌ గ్రాముకు రూ.16 పెరిగి రూ.4,745 వద్ద ధరలు కొనసాగుతున్నాయి. 10 గ్రాములు ధర రూ.47,450గా ఉంది.

నేడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఒకే విధంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా..

  • 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.47,450
  • 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.58,000
  • 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.63,270

విజయవాడలో బంగారం ధరలు ఇలా..

  • 18 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.47,450
  • 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.58,000
  • 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు ధర రూ.63,270

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా..

ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,150 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.63,420 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.58,000, 24 క్యారెట్ల ధర రూ.63,270, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.58,600, 24 క్యారెట్ల ధర రూ.63,930, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.58,000, 24 క్యారెట్ల ధర రూ.63,270 ఉంది. కోల్‌కతా, ముంబై, కేరళ, పూణెలలో కూడా ఇవే ధరలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

ఇక వెండి ధరల విషయాని కొస్తే.. వెండి కిలో నిన్నటి కంటే ఈ రోజు రూ. 300 మేర పెరిగి.. రూ.76,500 లుగా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.78,000, విశాఖపట్నంలో రూ.78,000, చెన్నైలోనూ రూ.78,000 ధరల పలుకుతోంది. బెంగళూరులో రూ.74,000, ముంబైలో76,500లుగా ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ఇదేం చెత్త కామెంట్రీ భయ్యా.. అచ్చ తెలుగులో పంత్‌ను అలా అంటారా?
ఇదేం చెత్త కామెంట్రీ భయ్యా.. అచ్చ తెలుగులో పంత్‌ను అలా అంటారా?
ప్రకృతి విపత్తు వేళ రైతన్నకు సాయంగా నిలబడ్డ పోలీస్ అన్నలు..
ప్రకృతి విపత్తు వేళ రైతన్నకు సాయంగా నిలబడ్డ పోలీస్ అన్నలు..
శభాష్ సృజన.. క్యాన్సర్‌తో పోరాడుతూనే ఇంటర్‌లో సత్తా చాటిన బాలిక
శభాష్ సృజన.. క్యాన్సర్‌తో పోరాడుతూనే ఇంటర్‌లో సత్తా చాటిన బాలిక
రాజ్ తరుణ్ అనుకుంటే కళ్యాణ్ రామ్ వచ్చేశాడు..
రాజ్ తరుణ్ అనుకుంటే కళ్యాణ్ రామ్ వచ్చేశాడు..
తెలంగాణంలో సరస్వతీ పుష్కరాల కోసం ప్రత్యేక యాప్
తెలంగాణంలో సరస్వతీ పుష్కరాల కోసం ప్రత్యేక యాప్
పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తే భవిష్యత్ కు ముప్పే
పిల్లల విషయంలో తల్లిదండ్రులు ఈ తప్పులు చేస్తే భవిష్యత్ కు ముప్పే
గ్రూప్‌-1పై రాజకీయ దుమారం.. ఆరోపణలపై టీజీపీఎస్సీ ఫుల్ క్లారిటీ..
గ్రూప్‌-1పై రాజకీయ దుమారం.. ఆరోపణలపై టీజీపీఎస్సీ ఫుల్ క్లారిటీ..
తల్లి, అక్కా క్రేజీ హీరోయిన్స్.. బ్రేక్ కోసం చూస్తోన్న చెల్లెలు
తల్లి, అక్కా క్రేజీ హీరోయిన్స్.. బ్రేక్ కోసం చూస్తోన్న చెల్లెలు
కొత్తగా మరో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు మంజూరు
కొత్తగా మరో 2,260 స్పెషల్ ఎడ్యుకేషన్‌ టీచర్‌ పోస్టులు మంజూరు
వీడు మగాడ్రా బుజ్జి.. తొలి భారత ప్లేయర్‌గా అరుదైన రికార్డ్
వీడు మగాడ్రా బుజ్జి.. తొలి భారత ప్లేయర్‌గా అరుదైన రికార్డ్