Low Seat Height Scooters: ఈ స్కూటర్ల సీటు ఎత్తు చాలా తక్కువ.. అందరికీ అనువైనవి..

మన దేశంలో స్కూటర్లకు మంచి డిమాండ్ ఉంది. కేవలం మహిళలలే కాకుండా పురుషులు సైతం వీటిని అధికంగా వినియోగిస్తున్నారు. ఈక్రమంలో సాధారణ బైక్ ల కంటే అధికంగా స్కూటర్లే విక్రయాలు జరుపుతున్నాయి. సాధారణంగా ఒక వినియోగదారుడు ఒక స్కూటర్ కొనుగోలు చేస్తున్నాడంటే అనేక అంశాలు ప్రాతిపదికగా తీసుకుంటారు. దాని డిజైన్, లుక్, కంఫర్ట్, బూట్ స్పేస్, ఫీచర్లు, మైలేజీ వంటి ఎక్కువగా చూస్తారు. అదే సమయంలో మరొక కీలకమైన అంశం కూడా ఎక్కువ మంది చూసుకుంటూ ఉంటారు. అదే సీటు ఎత్తు. చాలా మంది వినియోగదారులు తక్కువ సీటు ఎత్తు ఉన్న ద్విచక్ర వాహనాన్ని ఎంచుకుంటున్నారు. ఇందుకు ప్రధాన కారణంగా ఈ స్కూటర్లు అన్ని రకాల రైడర్లు వినియోగిస్తుండటమే. ఈ స్కూటర్లు పురుషులతో పాటు, మహిళలకు సైతం సౌకర్యవంతమైన రైడింగ్ పొజిషన్ ను అందిస్తాయి. అయితే ఏ స్కూటర్ అతి తక్కువ ఎత్తు గల సీటింగ్ కలిగి ఉంది? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే. ప్రస్తుతం భారతీయ మార్కెట్‌లో విక్రయిస్తున్న అతి తక్కువ ఎత్తు సీటు కలిగిన టాప్ 5 స్కూటర్‌లను మీకు అందిస్తున్నాం.

Madhu

|

Updated on: Jan 31, 2024 | 7:21 AM

టీవీఎస్ జెస్ట్ 110.. మన దేశంలో అత్యంత సరసమైన ధరకు లభించే గేర్‌లెస్ స్కూటర్‌లలో ఇది ఒకటి. ఈ బండి సీట్ ఎత్తు కేవలం 760ఎంఎం మాత్రమే. స్కూటీ జెస్ట్‌లో 109.7సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఎఫ్ఐ ఇంజిన్ 7.7 బీహెచ్పీ, 8.8 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర రూ. 73,036 ఎక్స్-షోరూమ్ గా ఉంది.

1 / 5
హీరో ప్లెజర్ ప్లస్.. ఈ స్కూటర్ సీట్ ఎత్తు 765ఎంఎం. దీని ధర రూ. 68,368 ఎక్స్-షోరూమ్ గా ఉంది. ఈ ప్లెజర్ ప్లస్ స్కూటర్లో 110.9సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్‌ ఉంటుంది. దీనిలోని మోటార్ 7.9 బీహెచ్‌పీ, 8.7 ఎన్ఎం గరిష్ట టార్క్‌ని విడుదల చేస్తుంది. ఇది సీవీటీతో జత చేసి ఉంటుంది.

2 / 5
హోండా యాక్టివా 125.. భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్. ఈ స్కూటర్ల సీట్ ఎత్తు 765 ఎంఎంగా ఉంది. స్టాండర్డ్ యాక్టివా ధర రూ. 75,347 కాగా, యాక్టివా 125 ఎక్స్-షోరూమ్ ధర రూ. 78,920 నుంచి ప్రారంభమవుతోంది. యాక్టివా 6జీ 109.51సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను 7.73 బీహెచ్పీ అభివృద్ధి చేస్తుంది. అయితే యాక్టివా 125 123.97సీసీ యూనిట్‌తో 8.19 బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది.

3 / 5
టీవీఎస్ జూపిటర్ 125.. ఈ స్కూటర్ సీటు ఎత్తు 765ఎంఎం ఉంటుంది. జూపిటర్ ధర రూ. 71,390కాగా.. జూపిటర్ 125 రూ. 82,825 ఎక్స్-షోరూమ్ ఉంటుంది. జూపిటర్లో 109.7సీసీ ఇంజిన్ ఉంటుంది. ఇది 7.7 బీహెచ్పీ శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అయితే జూపిటర్ 125లో 124.8సీసీ, సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ ఉంటుంది. ఇది 8 బీహెచ్పీ, సీవీటోతో జత చేసి ఉంటుంది.

4 / 5
హోండా గ్రాజియా 125.. ఈ స్కూటర్ ధర రూ. 82,520 ఎక్స్ షోరూం ఉంటుంది. దీని సీట్ ఎత్తు 765ఎంఎం ఉంటుంది. హోండా గ్రాజియాలో 123.97సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంటుంది. 8.19 బీహెచ్పీ, 10.4ఎన్ఎం టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది.

5 / 5
Follow us