Budget 2024: కొత్త బడ్జెట్‌ కోటి ఆశలు.. కీలకంగా మారనున్న అంశాలివే..

ఫిబ్రవరి 1వ తేదీన మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఎన్నికల ముందు వస్తున్న బడ్జెట్ కావడంతో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌లో కీలకంగా మారనున్న అంశాలేంటో ఇప్పుడు చూద్దాం..

|

Updated on: Jan 30, 2024 | 7:52 PM

ఈసారి బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం సాంకేతిక రంగానికి పెద్ద పీట వేస్తున్నట్లు సమాచారం. డిజిటల్‌ ఇండియా, గ్రీన్‌ హైడ్రోజన్‌, ఎలక్ట్రిక్ వెహికిల్స్‌ ప్రోత్సహించడంపై దృష్టిసారించనున్నట్లు తెలుస్తోంది. మరి ప్రభుత్వం ఈ దిశగా ఏమేరకు అడుగులు వేస్తుందో చూడాలి.

1 / 5
ఈ మధ్యంతర బడ్జెట్‌లో ఆహారం, ఎరువుల సబ్సిడీలకు పెద్దపీట వేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను కేంద్రం ఈసారి 4 ట్రిలియన్లు కేటాయించాలని భావిస్తోందని సమాచారం. ఈ అంచాలు గత ఆర్థిక సంవత్సరంతో పోల్చితే 10 శాతం ఎక్కువ. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని నిజంగానే ఇంప్లిమెంట్‌ చేస్తే రైతులకు ఎంతో మేలు జరగనుంది.

2 / 5
ఈ ఏడాది బడ్జెట్‌లో సొంతింటి కల నిజం చేసే దిశగా అడుగులు వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వ నిధులు 15 శాతం కంటే ఎక్కువ పెంచే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పెరుగుదల 12 బిలియన్‌ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

3 / 5
ఈసారి ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో గ్రామీణ వ్యవసాయానికి మరింత ఊతమిచ్చేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాపెక్స్‌పై దృష్టి సారిస్తూనే ప్రభుత్వం పన్నులను తగ్గించే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. దీంతో వ్యవసాయం, గ్రామీణ ప్రాంతాలకు మద్ధతునిచ్చే ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉంది.

4 / 5
ఎన్నికల తరుణంలో వస్తున్న బడ్జెట్‌ కావడంతో సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే సంక్షేమానికి వ్యాయాన్ని పెంచడానికి కేంద్రం పెద్దపీట వేసే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 2025-26 నాటికి ఆర్థిక లోటును జీడీపీలో 4.5  శాతానికి తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం.

5 / 5
Follow us