Aadhar card: ఆధార్ నెంబర్ లేకపోయినా, ఈ-ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.. ఎలాగంటే.
ఆధార్ నెంబర్ లేకపోయినా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సాధారణంగా ఈ వెబ్‌సైట్ ద్వారా ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆధార్ నెంబర్ లేదా 28 అంకెల ఎన్‌రోల్‌మెంట్ ఐడీ నెంబర్ కావాల్సి ఉంటుంది. అయితే ఆధార్ నెంబర్, ఎన్‌రోల్ ఐడీ లేక పోయినా...

ప్రస్తుతం దేశంలో ఆధార్ కార్డ్ ఎంతలా అనివార్యంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పిల్లల స్కూల్ అడ్మిషన్ మొదలు, రిటైర్ అయిన తర్వాత పెన్షన్ వరకు అన్ని పనులకు ఆధార్ కార్డ్ ఉండాల్సిందే. ఇంతలా ఆధార్ ప్రతీ ఒక్కరి దైనందిక జీవితంలో ఒక భాగమైపోయింది. అయితే ఒకవేళ పొరపాటున ఆధార్ కార్డ్ పోయినా, ఆధార్ నెంబర్ కనిపించకుండా పోయినా కొత్త ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం ఇబ్బందిగా మారుతుంది. మరి ఇలాంటి సందర్భంలో ఏం చేయాలి.? ఆధార్ నెంబర్ లేకపోయినా ఆధార్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆధార్ నెంబర్ లేకపోయినా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆధార్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సాధారణంగా ఈ వెబ్‌సైట్ ద్వారా ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఆధార్ నెంబర్ లేదా 28 అంకెల ఎన్‌రోల్‌మెంట్ ఐడీ నెంబర్ కావాల్సి ఉంటుంది. అయితే ఆధార్ నెంబర్, ఎన్‌రోల్ ఐడీ లేక పోయినా ఈ ఆధార్‌ను సింపుల్‌గా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే సరే ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు..
ఆధార్ ఐడీని ఎలా పొందాలంటే..
* ఎన్‌రోల్‌మెంట్ ఐడీని పొందడానికి ముందుగా యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* అనంతరం మొబైల్ ఫోన్‌లో గెట్ ఆధార్ ఆప్షన్‌ని ఎంచుకోవాలి.
* తర్వాత ఎన్‌రోల్‌మెంట్ ఐడి రిట్రీవ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
* అన్ని వివరాలను ఎంటర్ చేసి సెండ్ ఓటీపీని ఎంపిక చేయాలి.
* వెంటనే రిజిస్టర్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వెళ్తుతుంది. వెంటనే మీ ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ ఐడీ పొందుతారు.
ఆధార్‌ను ఇలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..
* ఇక ఈ ఆధార్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ముందుగా.. ఆధార్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి.
* ఆ తర్వాత మీరు డౌన్‌లోడ్ ఆధార్ ఎంపికపై క్లిక్ చేయాలి.
* అనంతరం ఆధార్ నంబర్ లేదా ఎన్‌రోల్‌మెంట్ IDని నమోదు చేయాల్సి ఉంటుంది.
* తర్వాత మీ రిజిస్టరడ్ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
* వెంటనే మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వెళ్తుంది. వెంటనే ఇ-ఆధార్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అవసరానికి అనుగుణంగా ప్రిట్ అవుట్ తీసుకుంటే సరిపోతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..