Elon Musk: దిగజారిన ఎలన్‌మస్క్ ర్యాంక్.. ఇకపై అత్యంత సంపన్నుడు కాదంటున్న గణాంకాలు
తాజాగా వచ్చిన ర్యాంకింగ్స్ ప్రపంచంలో అత్యంత సంపన్నుడు అనే ట్యాగ్ లైన్‌ను ఎలన్‌మస్క్ కోల్పోయాడు. మస్క్‌కు ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా స్టాక్ ఇటీవల 13 శాతం క్షీణించింది. దీంతో మస్క్ నికర విలువ నుండి 18 బిలియన్లకు పైగా క్షీణించింది. అయితే ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత సంపన్నుడు ఎవరో? ఓసారి తెలుసుకుందాం.

ఎలన్‌మస్క్ అంటే సక్సెస్‌కు బ్రాండ్ అంబాసిడర్. బోలెడన్ని కంపెనీలు వేల మంది ఉద్యోగులతో ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచాడు. అయితే ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత ఎలన్‌మస్క్‌కు కష్టాలు మొదలయ్యాయి. తాజాగా వచ్చిన ర్యాంకింగ్స్ ప్రపంచంలో అత్యంత సంపన్నుడు అనే ట్యాగ్ లైన్‌ను ఎలన్‌మస్క్ కోల్పోయాడు. మస్క్‌కు ఎలక్ట్రిక్ కార్ కంపెనీ టెస్లా స్టాక్ ఇటీవల 13 శాతం క్షీణించింది. దీంతో మస్క్ నికర విలువ నుండి 18 బిలియన్లకు పైగా క్షీణించింది. అయితే ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత సంపన్నుడు ఎవరో? ఓసారి తెలుసుకుందాం.
లగ్జరీ దిగ్గజం ఎల్‌వీఎంహెచ్ సంస్థ 73 ఏళ్ల ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ చెందింది. ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం ఆర్నాల్ట్‌తో పాటు కుటుంబ ఆస్తి విలువ ఇటీవల 207.8 బిలియన్లకు పెరిగింది. ఇది 23.6 బిలియన్ డాలర్ల పెరుగుదలతో మస్క్‌కు సంబంధించిన 204.5 బిలియన్ల డాలర్లను అధిగమించింది. అలాగే బలమైన అమ్మకాల తర్వాత ఎల్‌వీఎంహెచ్ షేర్లు 13 శాతానికి పైగా పెరిగాయి. టెస్లాకు సంబంధించిన 586.14 బిలియన్ల మార్కెట్ క్యాప్‌తో పోలిస్తే ఎల్‌విఎంహెచ్ మార్కెట్ క్యాప్ 388.8 బిలియన్ల డాలర్లకు చేరుకుందని ఫోర్బ్స్ నివేదిక తెలిపింది. ఆర్నాల్ట్ నాలుగు దశాబ్దాల క్రితం ఎల్‌ఎంవీహెచ్‌ను నిర్మించారు, లూయిస్ విట్టన్, టీఏజీ హ్యూయర్, డోమ్ పెరిగ్నాన్ వంటి దిగ్గజ బ్రాండ్‌లను నిశితంగా కొనుగోలు చేసి సామ్రాజ్యాన్ని విస్తరించారు. హెచ్‌బీఓకు సంబంధించిన హిట్ షో “సక్సెషన్”ని గుర్తుకు తెచ్చేలా కుటుంబ నిర్వహణ వ్యాపారాన్ని సృష్టించాడు. గత ఏప్రిల్‌లో ఎల్‌వీఎంహెచ్ మార్కెట్ వాల్యుయేషన్‌లో 500 బిలియన్ల డాలర్లను దాటిన మొదటి యూరోపియన్ కంపెనీగా అవతరించింది .
డిసెంబరు 2022లో ఆర్నాల్ట్ మొదటి స్థానంలో నిలిచాడు. 2021లో దాదాపు 16 బిలియన్ల డాలర్లకు టిఫ్ఫాని అండ్ కోను ఎల్‌వీఎంహెచ్ కొనుగోలు చేయడం అతిపెద్ద లగ్జరీ బ్రాండ్ కొనుగోలు మార్కెట్ నిపుణులు పేర్కొంటారు. అలాగే ఆర్నాల్ట్‌కు సంబంధించిన హోల్డింగ్ కంపెనీ అగాకే మద్దతుతో అగాకే వెంచర్స్ అనే వెంచర్ క్యాపిటల్ సంస్థ, నెట్‌ఫ్లిక్స్, టిక్‌టాక్ మాతృసంస్థ అయిన బైట్‌డ్యాన్స్ వంటి కంపెనీల్లో పెట్టుబడి పెడుతుంది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








