Budget 2024 Highlights: వేతన జీవులకు లభించని ఊరట.. నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగంలో కీలక అంశాలు..
FM Nirmala Sitharaman Speech Highlights on Budget 2024 in Telugu: వచ్చే 5 ఏళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం కానుందని.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ 2024 ను ప్రవేశపెట్టారు. ఎన్డీఏ పాలన 10 ఏళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి లభించిందని తెలిపారు. దేశంలో మరిన్ని మెడికల్ కాలేజీల కోసం కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు.
Parliament Budget Session 2024 Highlights: వచ్చే 5 ఏళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం కానుందని.. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరిస్తుందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్ లో మధ్యంతర బడ్జెట్ 2024 ను ప్రవేశపెట్టారు. ఎన్డీఏ పాలన 10 ఏళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మందికి విముక్తి లభించిందని తెలిపారు. దేశంలో మరిన్ని మెడికల్ కాలేజీల కోసం కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజల ఆదాయం 50శాతం మేర పెరిగిందని తెలిపారు. అన్ని వర్గాలకు ఎక్కువ ప్రధాన్యం ఇస్తున్నామని తెలిపారు. వచ్చే 5 ఏళ్లలో 2 కోట్ల ఇళ్లనిర్మాణం లక్ష్యం ముందడుగు వేస్తున్నామన్నారు. ప్రజల సగటు ఆదాయం 50 శాతం పెరిగిందని.. GDP అంటే గవర్నెన్స్, డెవలప్‌మెంట్, పర్‌ఫార్మెన్స్ అంటూ నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
మోడీ ప్రభుత్వానికి ఇది మధ్యంతర బడ్జెట్. ఆ తర్వాత ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యంగా బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కేవలం ప్రజలు పన్ను రాయితీలతో పాటు వివిధ తగ్గింపుల ప్రకటనల కోసం ఎదురుచూస్తూ ఉంటారు. వ్యాపారవేత్తలు తమ వ్యాపారాలకు సబ్సిడీల కోసం ఆత్రుతగా బడ్జెట్‌ను ఫాలో అవుతూ ఉంటారు. ముఖ్యంగా కష్టజీవి దగ్గర నుంచి ఏసీ రూములో కూర్చొని ట్రేడింగ్ చేసే వారి వరకూ ప్రతి ఒక్కరూ బడ్జెట్‌లోని ప్రకటనల కోసం ఆసక్తి చూపుతూ ఉంటారు. ఆర్థిక మంత్రి కూడా గంటల తరబడి బడ్జెట్ ప్రసంగాన్ని పార్లమెంట్‌లో వినిపిస్తూ ఉంటారు. ఈ బడ్జెట్‌లో ఎన్నో వర్గాల వారు ఎదురు చూస్తున్నారు. ఇది మధ్యంతర బడ్జెట్ కావడంతో ఎలాంటి ప్రకటనలు చేస్తారోనని ఆశగా ఎదురు చూస్తున్నారు.
మధ్యంతర బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ
కాసేపట్లో రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఉదయం పదిన్నర గంటలకు పార్లమెంట్ ఆవరణలో కేబినెట్ భేటీ అయి మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్. 6వసారి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు నిర్మలా సీతారామన్. వరుసగా ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేశారు సీతారామన్. బడ్జెట్‌లో అద్భుత ప్రకటనలు ఉండకపోవచ్చంటూ ఇప్పటికే ప్రకటించారు నిర్మలా సీతారామన్. ఈ క్రమంలో మధ్యంతర బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే పీఎం కిసాన్ సాయం పెంచుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు చమురు, వంటగ్యాస్ ధరల తగ్గింపుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
LIVE NEWS & UPDATES
-
వచ్చే వారం నుంచి భారత్ రైస్..
ధరల పెరుగుదలను అరికట్టేందుకు, వచ్చే వారం నుంచి భారత్ రైస్ కింద సబ్సిడీ బియ్యాన్ని రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా కిలో బియ్యాన్ని రూ. 29కి విక్రయించేందుకు అధికారిక నిర్ణయం వచ్చే రెండు రోజుల్లో ప్రకటించనున్నారు.
-
బడ్జెట్‌పై విపక్షాల విమర్శలు
- ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌పై విపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టాయి.
- ఇది బీజేపీకి వీడ్కోలు బడ్జెట్ అంటూ అఖిలేష్ యాదవ్ పేర్కొన్నారు.
- ప్రభుత్వం ఖర్చుల కోసం అప్పులు చేస్తోందంటూ మనీష్ తివారీ అభిప్రాయప్డారు.
- విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గినా, పెరిగాయని చెప్పారంటూ శశి థరూర్ విమర్శించారు.
- స్వీయ పొగడ్తలకే పరిమితం అయ్యారని.. కార్తి చిదంబరం పేర్కొన్నారు.
-
-
ఉపాధికి ఎన్నో అవకాశాలు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..
వికసిత్ భారత్‌కు ఈ బడ్జెట్ అంకితమంటూ మోదీ పేర్కొన్నారు. ఉపాధికి ఎన్నో అవకాశాలు బడ్జెట్ కల్పిస్తోందని.. దేశ యువత ఆకాంక్షలకు ఈ బడ్జెట్ ప్రతిబింబమంటూ మోదీ పేర్కొన్నారు. 2047 కల్లా భారత్ అభివృద్ధి చెందిన దేశం అవుతుందని.. ఈ గ్యారంటీని బడ్జెట్ ఇచ్చిందన్నారు.
-
రూ.47.66 లక్షల కోట్లు.. బడ్జెట్ స్వరూపం ఇదే..
- 2024-25 బడ్జెట్ అంచనా రూ.47.66 లక్షల కోట్లు
- 2024-25లో రుణాలు మినహా రాబడి రూ.30.80 లక్షల కోట్లు
- 2024-25లో రెవెన్యూ రాబడి 26.02 లక్షల కోట్లు
- 2024-25లో ప్రణాళిక వ్యయం రూ.11.11 లక్షల కోట్లు
- 2024-25లో అప్పులు రూ.11.75 లక్షల కోట్లు
- 2024-25లో మార్కెట్ నుంచి నిధుల సమీకరణ రూ.14.13 లక్షల కోట్లు
- 2023-24కి సవరించిన రెవన్యూ వ్యయం రూ44.90 లక్షల కోట్లు
-
ఆదాయపన్ను వర్గాలకు లభించని ఊరట
నిర్మలమ్మ బడ్జెట్ లో ఆదాయపన్ను వర్గాలకు ఊరట లభించలేదు.. పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులేదని బడ్జెట్ లో ప్రకటించారు. రూ.7లక్షల వరకు వార్షిక ఆదాయంపై ఎలాంటి పన్నులేదని నిర్మలా సీతారామన్ తెలిపారు.
-
-
టూరిస్ట్ హబ్‌గా లక్షద్వీప్
- యువతకు ముద్ర యోజన ద్వారా రూ.25 లక్షల కోట్ల రుణాలిచ్చాం..
- 30 కోట్ల మంది మహిళలకు ముద్ర రుణాలు అందించాం..
- లక్ష కోట్లతో ప్రైవేట్ సెక్టార్‌కి కార్పస్ ఫండ్
- టూరిస్ట్ హబ్‌గా లక్షద్వీప్
- 517 ప్రాంతాలకు కొత్త విమాన సర్వీసులు
- 3 మేజర్ రైల్వే కారిడార్లు నిర్మాణం చేస్తున్నాం..
-
సరికొత్త రోడ్ మ్యాప్‌తో వికసిత్ భారత్..
- FDI పెట్టుబడులు పెరిగాయి, విదేశీ పెట్టుబడులకు ఇది స్వర్ణయుగం
- FDI కొత్త నిర్వచనం చెప్పిన నిర్మలా సీతారామన్
- FDI అంటే ఫస్ట్ డెవలప్ ఇండియా
- పర్యాటక ప్రాంతాల అభివృద్ధిలో రాష్ట్రాలకు తోడ్పాడు అందిస్తాం
-
7 లక్షల వరకు ఎలాంటి పన్నులేదు
- కొత్త ట్యాక్స్ విధానం కింద ఏడాదికి రూ. 7 లక్షల ఆదాయం వరకు ఎలాంటి పన్నులేదు
- సంస్కరణలు అమలు చేయడానికి రాష్ట్రాలకు 50 ఏళ్లపాటు రూ.75 వేల కోట్ల వడ్డీలేని రుణాలు
-
ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడురెట్లు పెరిగాయి
- ప్రత్యక్ష, పరోక్ష పన్నులు, దిగుమతి సుంకాల్లో ఎలాంటి మార్పులేదు
- ఆదాయపు పన్ను రిటర్న్‌లు సమర్పించిన వారికి రీ ఫండ్స్‌ను వేగవంతం చేస్తున్నాం
- GST విధానం ప్రయోజనకరంగా ఉందని 94 శాతం పారిశ్రామిక ప్రముఖులు చెప్పారు
- ప్రత్యక్ష పన్నుల వసూళ్లు మూడురెట్లు పెరిగాయి
- ట్యాక్స్ పేయర్ల సొమ్ము దేశాభివృద్ధికి వినియోగిస్తున్నాం
-
మూడు రైల్వే కారిడార్లను అభివృద్ధి చేస్తాం
- ఉడాన్ పథకంలో 517 రూట్లలో కోటి కొత్త ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నాం
- మూడు రైల్వే కారిడార్లను అభివృద్ధి చేస్తాం
- 40వేల నార్మల్ బోగీలను వందేభారత్ ప్రమాణాలకు పెంచుతాం
- ఇంధనం, సిమెంట్, ఖనిజాల కారిడార్‌ను, పోర్టు కనెక్టివిటీ కారిడార్‌ను అభివృద్ధి చేస్తాం
- మౌలిక వసతుల రంగం 11.1 శాతం వృద్ధితో రూ.11 లక్షల 11వేల 111 కోట్ల కేటాయింపు
-
రూ. లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేస్తాం
- పరిశోధన, సృజనాత్మకకు రూ. లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేస్తాం
- మధ్యతరగతి ప్రజల ఇంటి నిర్మాణాలకు, కొనుగోలు మద్దతు ఇస్తాం
- స్వయం సహాయక బృందాల కోటి మంది మహిళలు లక్షాధికారులు అయ్యారు
- లక్ పతీ దీదీ టార్గెట్‌ను రెండు కోట్ల నుంచి మూడు కోట్లకు పెంచుతున్నాం
- ఐదు సమీకృత ఆక్వా పార్కులను ఏర్పాటు చేస్తాం
-
రాష్ట్రాలతో కలసి పనిచేస్తున్నాం
- జిల్లాలు, బ్లాక్‌ల అభివృద్ధి కోసం రాష్ట్రాలతో కలసి పనిచేస్తున్నాం
- MSME రంగం సకాలంలో ఆర్థిక వనరులు కల్పిస్తున్నాం
- సమ్మిళిత, సుస్థిరాభివృద్ధి కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాం
- మనం ప్రారంభించిన యూరప్ కారిడార్ ప్రపంచ వాణిజ్యానికి కీలకం కాబోతున్నాయి
-
వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద రెండు కోట్ల ఇళ్లనిర్మాణం
- అంగన్‌వాడీ కార్మికులు, హెల్పర్లకు ఆయుష్మాన్ భారత్ కవరేజ్
- 9-18 ఏళ్ల బాలికలు సర్వైకల్ కేన్సర్ పడకుండా చర్యలు
- మరిన్ని మెడికల్ కాలేజీల కోసం కమిటీ ఏర్పాటు
- రూఫ్ టాప్ సోలార్ పాలసీ విధానం కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్
- మధ్యతరగతి కోసం ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తాం
- వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద రెండు కోట్ల ఇళ్లనిర్మాణం
-
రైతుల సమగ్రాభివృద్ధి కోసం చర్యలు
- డెయిరీ రైతుల సమగ్రాభివృద్ధి కోసం చర్యలు చేపడుతున్నాం
- ఆయిల్ సీడ్స్ రంగంలో ఆత్మనిర్భరత సాధిస్తాం
- నానో యూరియా తర్వాత పంటలకు నానో DAP కింద ఎరువులు అందిస్తాం
-
వచ్చే ఐదేళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం కాబోతున్నాయి
- సమ్మిళిత, సుస్థిరాభివృద్ధి కోసం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాం
- మనం ప్రారంభించిన యూరప్ కారిడార్ ప్రపంచ వాణిజ్యానికి కీలకం కాబోతున్నాయి
- వచ్చే ఐదేళ్లు అభివృద్ధికి స్వర్ణయుగం కాబోతున్నాయి
-
ప్రపంచదేశాలు ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా..
- ప్రపంచదేశాలు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా, భారత్ మాత్రం వీటికి అతీతంగా అభివృద్ధి సాధిస్తోంది
- కరోనా తర్వాత యుద్ధాలు, సంక్షోభాలతో సప్లయ్-చైన్ మేనేజ్‌మెంట్ దెబ్బతిన్నది
- మౌలిక వసతులను రికార్డుస్థాయిలో చేపడుతున్నాం
- దేశంలోని అన్నిప్రాంతాల్లో ఆర్థికవృద్ధిలో కనిపిస్తోంది
- GST వంటి ట్యాక్స్ సంస్కరణలు ట్యాక్స్ పరిధిని పెంచాయి
-
ప్రజల ఆదాయం 50 శాతం పెరిగింది
- ప్రజల ఆదాయం 50 శాతం పెరిగింది
- అన్నిరంగాల్లో ఆర్థికవృద్ధిని సాధిస్తున్నాం
- GDP అంటే గవర్నెన్స్, డెవలప్‌మెంట్, పర్‌ఫార్మెన్స్
- ట్రిపుల్ తలాక్ చట్టవిరుద్ధంగా ప్రకటించాం..
- మహిళలకు మూడింట ఒకవంతు రిజర్వేషన్లు కల్పించాం
-
మహిళలకు 30 కోట్ల ముద్రా రుణాలను ఇచ్చాం
- మహిళలకు 30 కోట్ల ముద్రా రుణాలను ఇచ్చాం
- దేశంలో ఇప్పుడు 80 మంది చెస్ గ్రాండ్ మాస్టర్లు ఉన్నారు
- క్రీడల్లో సాధించిన పతకాలు యువత ఆత్మస్థైర్యాన్ని చాటుతున్నాయి
- స్టార్టప్ ఇండియా, స్టార్టప్ క్రెడిట్ గ్యారంటీ వల్ల యువత ఉద్యోగాలు కల్పిస్తోంది
- మూడువేల ITIలను, 390 వర్సిటీలను ఏర్పాటు చేశాం
- జాతీయ విద్యావిధానం ద్వారా యువతకు సాధికారత కల్పిస్తున్నాం
- అన్నదాతల సంక్షేమం కోసం 11.8 కోట్లమందికి ఆర్థిక సాయం అందిస్తున్నాం
- 4 కోట్ల మంది రైతులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నాం
-
80 కోట్ల మందికి ఫ్రీ రేషన్‌తో ఆహార సమస్య తీరింది
- గరీబ్, మహిళ, యువ, అన్నదాతల ఆశలు, ఆకాంక్షలు, సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చాం
- 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్‌తో ఆహార సమస్య తీరింది
- గ్రామీణ ప్రజల ఆర్థిక వికాసం సాధ్యం అవుతోంది.
-
మంత్రి నిర్మలమ్మ ప్రసంగంలో కీలక అంశాలు
– గ్రామీణ ప్రజల ఆర్థిక వికాసం సాధ్యం అవుతోంది
– గతంలో సామాజిక న్యాయం అనేది రాజకీయ నినాదంగా ఉండేది
– మా ప్రభుత్వంలో సామాజిక న్యాయం అనేది మా పనితీరుగా మారింది
– ఇది కార్యాచారణలో లౌకిక వాదంగా
– వనరులను సమర్థంగా పంచి బంధుప్రీతిని, అవినీతిని రూపుమాపాం
-
కరోనా సంక్షోభం నుంచి ఈ దేశం అధిగమించింది
పార్లమెంట్ సమావేశాల్లో మంత్రి నిర్మలమ్మ ప్రసంగిస్తున్నారు.
– 2014లో దేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్న పరిస్థితుల నుంచి ఎంతో మార్పు వచ్చింది
– సంస్కరణపథంలో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతోంది
– అందుకే భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించారు
– సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్ అనే నినాదంతో పనిచేస్తున్నాం
– కరోనా సంక్షోభం నుంచి ఈ దేశం అధిగమించింది
– మా సమ్మిళిత వృద్ధి ఆలోచనావిధానం గ్రామస్థాయికి చేరి సక్సెస్ అయింది
– 80 కోట్ల మందికి ఫ్రీ రేషన్‌తో ఆహార సమస్య తీరింది
– గ్రామీణ ప్రజల ఆర్థిక వికాసం సాధ్యం అవుతోంది
-
ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న నిర్మలమ్మ
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆరోసారి బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు. మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెడుతూ ప్రసంగిస్తున్నారు.
-
లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలమ్మ
- సార్వత్రిక ఎన్నికలకు ముందు మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ప్రవేశపెట్టారు.
- గురువారం ఉదయం 11 గంటలకు లోక్‌సభలో కేంద్ర పద్దును ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు.
- అంతకుముందు బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది.
-
బడ్జెట్ ప్రవేశపెడుతున్న మంత్రి నిర్మలాసీతారామన్
మధ్యంతర బడ్జెట్‌ను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నారు.
-
ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు
ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కేబినెట్ బడ్జెట్ కు ఆమోద తెలుపగా, మంత్రి నిర్మలాసీతారామన్ బడ్జెట్ ను సమర్పిస్తున్నారు.
-
ఓటాక్ అకౌంట్ బడ్జెట్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం
కాసేపట్లో కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు కేంద్రం ఆమోదం తెలుపగా, 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్‌ను మంత్రి ప్రవేశపెట్టనున్నారు. మంత్రి నిర్మలకు ఇది ఆరోసారి బడ్జెట్.
-
చిన్న బడ్జెట్‌పై భారీ అంచనాలు
— పార్లమెంట్‌లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్
— ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలా సీతారామన్
— మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేస్తున్న నిర్మల
— సార్వత్రి ఎన్నికల ముందు మోదీ సర్కారు చివరి బడ్జెట్
— చిన్న బడ్జెట్‌పై భారీ అంచనాలు
-
మధ్యంతర బడ్జెట్ ద్వారా ఈ 10 ఆశలు నెరవేరుతాయా?
- ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి: కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఇచ్చే మొత్తాన్ని ప్రభుత్వం పెంచుతుందని రైతులు ప్రభుత్వం నుండి ఆశించారు.
- ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన: ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు ప్రభుత్వం షరతులను సడలించవచ్చు.
- ఆయుష్మాన్ భారత్ యోజన: ప్రధాన మంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన పరిధి పెరగవచ్చు, ఎక్కువ మందిని చేర్చుకోవచ్చు
- పన్ను మినహాయింపు: కొత్త పన్ను విధానంలో, పన్ను మినహాయింపు పెరగవచ్చు లేదా గరిష్ట పన్ను స్లాబ్‌ను తగ్గించవచ్చు.
- ఆరోగ్య బీమా: ఆరోగ్య బీమాలో పారదర్శకత కోసం కొత్త రెగ్యులేటర్‌ను ప్రకటించవచ్చు, దీనితో పాటు ప్రతి బీమా కంపెనీ అన్ని రకాల బీమాలను విక్రయించే స్వేచ్ఛను పొందవచ్చు.
- గిగ్ వర్కర్స్: గిగ్ వర్కర్ల సామాజిక భద్రత కోసం ప్రభుత్వం ఒక పథకాన్ని తీసుకురావచ్చు. వారిని ESIC పరిధిలో చేర్చవచ్చు
- ప్రధానమంత్రి ఆవాస్ యోజన: ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు కట్టుకోవడానికి ఇచ్చే మొత్తంలో పెరుగుదల ఉండవచ్చు.
- కొత్త పెన్షన్ స్కీమ్: కొత్త పెన్షన్ స్కీమ్ కింద గ్యారెంటీ పెన్షన్ సదుపాయాన్ని ప్రకటించవచ్చు.
- సౌర వ్యవస్థ: సౌర శక్తిని ప్రోత్సహించడానికి, 1 కోటి ఇళ్లలో సౌర వ్యవస్థను ఏర్పాటు చేయడానికి బడ్జెట్‌ను ప్రకటించవచ్చు.
- వందే భారత్ రైలు: కొత్త వందే భారత్ రైళ్లను ప్రకటించవచ్చు, రైల్వే బడ్జెట్ పెరగవచ్చు
-
బడ్జెట్ సమర్పణకు రాష్ట్రపతి అనుమతి
బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు పార్లమెంట్‌లో బడ్జెట్ సమర్పణకు రాష్ట్రపతి అనుమతి తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ముందుగా ఆర్థికశాఖకు చేరుకున్న మంత్రి నిర్మలమ్మ.. బడ్జెట్ కాపీని తీసుకుని రాష్ట్రపతి భవన్‌కు చేరుకోనున్నారు. అక్కడ బడ్జెట్ సమర్పణకు సంబంధించి రాష్ట్రపతి అనుమతి తర్వాత పార్లమెంట్‌కు చేరుకుంటారు ఆర్థిక శాఖ మంత్రి. అలాగే ఉదయం 10.30 గంటలకు పార్లమెంట్ ఆవరణలో కేబినెట్ భేటీ అవుతుంది. అక్కడ మధ్యంతర బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అనంరతం 11 గంటలకు పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
-
డిజిటల్ రూంపలో ఓన్ ఆన్ అకౌంట్ బడ్జెట్
ఉదయం 11 గంటలకు కేంద్ర మంత్రి నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అయితే డిజిటల్ రూపంలోనే ఓన్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ఉండనుంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత వరకు కార్యాచరణ ప్రణాళికగా మధ్యంతర బడ్జెట్ ఉండనుంది. ఇక మంత్రి నిర్మలమ్మ బడ్జెట్‌కాపీని తీసుకుని రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరారు.
-
బడ్జెట్ చిన్నది.. ఆశలు పెద్దవి
బడ్జెట్ చిన్నదే.. కానీ ఆశలు మాత్రం పెద్దవి.. నిర్మలా సీతారామన్ ఆరో బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. ఎన్నికల ముందు వస్తున్న బడ్జెట్‌పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ బడ్జెట్‌లో ప్రకటనలు పెద్దగా ఉండవని మంత్రి నిర్మలాసీతారామన్ తెలిపినా.. సామాన్యుల నుంచి వ్యాపార వేత్తల వరకు ఎన్నో ఆశలు రేకెత్తుతున్నాయి. మరి ఈ బడ్జెట్‌లో ఎలాంటి ప్రకటనలు ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.
-
రాష్ట్రపతి భవనానికి బయలుదేరిని నిర్మలమ్మ
ఉదయం 11 గంటలకు నిర్మలా సీతారామన్ ఓటాన్ అకౌంట్‌బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితమే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ బడ్జెట్ కాపీ తీసుకుని రాష్ట్రపతి భవన్‌కు బయలుదేరారు. బడ్జెట్‌కి రాష్ట్రపతి అనుమతి ఇచ్చిన తర్వాత పార్లమెంటుకు కేంద్రమంత్రి వెళతారు. మరో గంటలో అంటే 10.30కి కేంద్ర కేబినెట్ భేటీ అవుతుంది.
-
ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్న మంత్రి నిర్మలా
11 గంటలకు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆర్థిక శాఖ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం రాష్ట్రపతి భవనంకు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అవుతారు. అక్కడ ఆర్థిక బడ్జెట్ ఆమోదం తర్వాత 11 గంటలకు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు.
VIDEO | Union Finance minister @nsitharaman arrives at the finance ministry. She will announce the Union Budget 2024 later today.#Budget2024WithPTI pic.twitter.com/D5LoffuSKO
— Press Trust of India (@PTI_News) February 1, 2024
-
బడ్జెట్ ప్రకటనలపై ఆశలు
ఈ మధ్యంతర బడ్జెట్‌లో సామాన్యులతో పాటు పన్ను చెల్లింపుదారులు, వ్యాపారులు ఇలా అన్ని వర్గాల వారు ఎదురు చూస్తున్నారు. ఈ బడ్జెట్ మంత్రి నిర్మలాసీతారామన్ ఎవరికి ఎలాంటి ఉపశమనం కలిగించే ప్రకటనలు చేస్తారోనని ఎదురు చూస్తున్నారు. ఇది మధ్యంతర బడ్జెట్ కావడంతో అద్భుతమైన ప్రకటనలు పెద్దగా ఉండవని ఇప్పటికే మంత్రి నిర్మలా తెలిపారు.
-
అద్భుతమైన ప్రకటనలు ఉంటాయా?
బడ్జెట్‌లో అద్భుత ప్రకటనలు ఉండకపోవచ్చంటూ ఇప్పటికే ప్రకటించారు నిర్మలా సీతారామన్. ఈ క్రమంలో మధ్యంతర బడ్జెట్‌పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే పీఎం కిసాన్ సాయం పెంచుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు చమురు, వంటగ్యాస్ ధరల తగ్గింపుపై ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
-
11 గంటలకు బడ్జెట్
ఉదయం 11 గంటలకు నిర్మలాసీతారామన్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. నిర్మలమ్మ బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది 6వసారి. వరుసగా ఆరు సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మొరార్జీ దేశాయ్ రికార్డును సమం చేశారు సీతారామన్.
-
కాసేపట్లో రాష్ట్రపతి భవన్‌కు నిర్మలమ్మ
కాసేపట్లో రాష్ట్రపతి భవన్‌కు చేరుకుంటారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఉదయం పదిన్నర గంటలకు పార్లమెంట్ ఆవరణలో కేబినెట్ భేటీ అయి మధ్యంతర బడ్జెట్‌కు ఆమోదం తెలుపుతుంది. ఉదయం 11 గంటలకు లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్.
Published On - Feb 01,2024 8:27 AM