AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

LPG Cylinder Price: బడ్జెట్‌కు ముందు పెరిగిన గ్యాస్ ధరలు.. తాజా రేట్ల వివరాలివే..

LPG Cylinder Prices: మధ్యంతర బడ్జెట్ రాకముందే చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశంలోని నాలుగు మహానగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలను మార్చాయి. ఒకవైపు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర స్వల్పంగా పెరిగింది. మరోవైపు దేశీయ గ్యాస్ సిలిండర్ ధరలో వరుసగా 6వ సారి ఎలాంటి మార్పు చేయలేదు. దేశీయ గ్యాస్ సిలిండర్ ధరలో చివరి మార్పు 2023 ఆగస్టు 30న కనిపించింది.

LPG Cylinder Price: బడ్జెట్‌కు ముందు పెరిగిన గ్యాస్ ధరలు.. తాజా రేట్ల వివరాలివే..
Lpg Cylinder Price
Shaik Madar Saheb
|

Updated on: Feb 01, 2024 | 10:32 AM

Share

LPG Cylinder Prices: మధ్యంతర బడ్జెట్ రాకముందే చమురు మార్కెటింగ్ కంపెనీలు దేశంలోని నాలుగు మహానగరాల్లో గ్యాస్ సిలిండర్ ధరలను మార్చాయి. ఒకవైపు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర స్వల్పంగా పెరిగింది. మరోవైపు దేశీయ గ్యాస్ సిలిండర్ ధరలో వరుసగా 6వ సారి ఎలాంటి మార్పు చేయలేదు. దేశీయ గ్యాస్ సిలిండర్ ధరలో చివరి మార్పు 2023 ఆగస్టు 30న కనిపించింది. అప్పటి నుండి, చమురు మార్కెటింగ్ కంపెనీలు నిరంతరం ధరలను స్థిరంగా కొనసాగిస్తున్నాయి. పెరిగిన ధరల ప్రకారం.. దేశంలోని నాలుగు మహానగరాల్లో గ్యాస్ సిలిండర్ ధర ఎంత చెల్లించాల్సి ఉంటుందో తెలుసుకోండి..

వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధర స్వల్పంగా పెరిగింది..

19కేజీల వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలో స్వల్ప పెరుగుదల కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీలో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర రూ.14 పెరగ్గా, కోల్‌కతాలో రూ.18 పెరిగింది. ముంబైలో గరిష్టంగా రూ.15 పెరిగింది. చెన్నై గురించి మాట్లాడుకుంటే ఇక్కడ అత్యల్పంగా రూ.12.50 పెరిగింది. నాలుగు మహానగరాల్లో వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర వరుసగా రూ.1769.50, రూ.1887, రూ.1723.50, రూ.1937గా ఉంది. ఇక హైదరాబాద్ లో కూడా కమర్శియల్ గ్యాస్ సిలిండర్ ధర 17రూపాయలు పెరిగింది. ప్రస్తుతం ధర రూ.2002 లుగా ఉంది.

స్థిరంగానే.. దేశీయ గ్యాస్ సిలిండర్ ధరలు

మరోవైపు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. దేశీయ సిలిండర్ల ధరల్లో వరుసగా ఆరోసారి ఎలాంటి మార్పు చేయలేదు. డేటా ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.903. కోల్‌కతాలో ధర రూ.929గా, హైదరాబాద్ లో 955గా ఉంది. ముంబై ప్రజలు గృహ గ్యాస్ సిలిండర్ ధర రూ.902.50 చెల్లించాలి. చెన్నైలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధర రూ.918.50. ఆగస్టు 30, 2023 తర్వాత డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదు. ఆగస్టు 29న ప్రభుత్వం గృహోపకరణాల గ్యాస్ సిలిండర్ ధరను రూ.200 తగ్గించింది.

బడ్జెట్ అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..