Heart Health: గుండెను ఆరు కాలాల పాటు ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు.. వీటిని తప్పక తినాలి

ఆరోగ్యంగా ఉండాలంటే ముందుగా చేయాల్సిన పని గుండెను జాగ్రత్తగా కాపాడుకోవడం. కానీ నేటి కాలంలో చాలా మంది చిన్న వయసులోనే గుండె సమస్యల బారీన పడుతున్నారు. రోజులు గడిచే కొద్దీ గుండెపోటు ముప్పు కూడా పెరుగుతోంది. దీనికి ఒక కారణం అనియంత్రిత జీవనశైలి. అందువల్లనే అధికమంది గుండెపోటుకు గురవుతున్నారు. కాబట్టి జీవనశైలిని నియంత్రించుకుంటే అన్ని సమస్యలు తీరిపోయినట్లే. గుండెపోటు ప్రమాదాన్ని పెంచే కొన్ని ఆహారాలు ఉన్నాయి. అలాగే గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే ఆహారాలు కూడా ఉన్నాయి..

Srilakshmi C

|

Updated on: Jan 31, 2024 | 12:19 PM

Heart

Heart

1 / 5
గుండెపోటు ప్రమాదాన్ని పెంచే కొన్ని ఆహారాలు ఉన్నాయి. అలాగే గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించే ఆహారాలు కూడా ఉన్నాయి. గుండెను రక్షించడంలో బెర్రీలు ఎంతో సహాయపడుతాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచే యాంటీ ఆక్సిడెంట్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి.

2 / 5
మంచి గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి డ్రై ఫ్రూట్స్ సహాయపడతాయి. డ్రై ఫ్రూట్స్ రెగ్యులర్ గా తినేవారిలో గుండె ఆరోగ్యం మెరుగవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇందులో మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించి, గుండెను సురక్షితంగా ఉంచుతుంది.

3 / 5
సోయాబీన్స్ కూడా గుండు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సోయాబీన్ శరీరానికి శక్తినివ్వడానికి, గుండెను రక్షించడానికి సహాయపడుతుంది. ప్రతిరోజూ సోయాబీన్ పాలు తాగిన మంచి ఫలితాలను పొందవచ్చు.

4 / 5
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ తాజా కూరగాయలు తప్పనిసరిగా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. కూరగాయలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. పాలకూర, బ్రోకలీ వంటి కూరగాయలను ఎక్కువగా తినాలి. అలాగే తృణధాన్యాలు కూడా ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, గుండెను రక్షిస్తుంది.

5 / 5
Follow us