- Telugu News Photo Gallery Cinema photos Rowdy Hero Vijay Deverakonda and Gowtam Naidu Tinnanuri Movie VD12 Shooting Update and Details Telugu Heroes Photos
Vijay Deverakonda: VD12 సినిమాపై క్లారిటీ ఇచ్చిన నాగవంశీ.! షూటింగ్ అప్డేట్..
అవునూ.. లైగర్ తర్వాత.. ఫ్యామిలీ స్టార్ కంటే ముందు విజయ్ దేవరకొండ ఓ సినిమా మొదలుపెట్టారు కదా.? గౌతమ్ తిన్ననూరితో మొదలైన ఆ సినిమా కొంత షూటింగ్ కూడా అయ్యింది కదా.. మరి ఆ సినిమా సంగతేంటి..? ఉందా ఆగిపోయిందా.? ఉంటే ఏమైంది.? ఇలాంటి అనుమానాలు చాలానే వస్తున్నాయి ఫ్యాన్స్‌కు. తాజాగా దీనికి సమాధానం ఇచ్చేసారు నిర్మాత నాగవంశీ. మరి ఆయనేం చెప్పారు.? విజయ్ దేవరకొండకు లైగర్ తర్వాత అనుకోకుండా బ్రేక్ వచ్చింది.
Updated on: Jan 31, 2024 | 12:16 PM

అవునూ.. లైగర్ తర్వాత.. ఫ్యామిలీ స్టార్ కంటే ముందు విజయ్ దేవరకొండ ఓ సినిమా మొదలుపెట్టారు కదా..? గౌతమ్ తిన్ననూరితో మొదలైన ఆ సినిమా కొంత షూటింగ్ కూడా అయ్యింది కదా.. మరి ఆ సినిమా సంగతేంటి..? ఉందా ఆగిపోయిందా..? ఉంటే ఏమైంది..?

ఇలాంటి అనుమానాలు చాలానే వస్తున్నాయి ఫ్యాన్స్‌కు. తాజాగా దీనికి సమాధానం ఇచ్చేసారు నిర్మాత నాగవంశీ. మరి ఆయనేం చెప్పారు.? విజయ్ దేవరకొండకు లైగర్ తర్వాత అనుకోకుండా బ్రేక్ వచ్చింది.

ఇకపై అది రాకుండా చూసుకుంటా.. ఏడాదికి రెండు సినిమాలు చేస్తానంటున్నారు రౌడీ బాయ్. అన్నట్లుగానే ఖుషి వచ్చిన 8 నెలల్లోనే ఫ్యామిలీ స్టార్‌ను సిద్ధం చేస్తున్నారీయన.

ఈ చిత్ర షూటింగ్ చివరిదశకు వచ్చేసింది. ఒకవేళ దేవర వాయిదా పడితే.. ఎప్రిల్ 5న విడుదల కానుంది ఫ్యామిలీ స్టార్. పరశురామ్ కంటే ముందే గౌతమ్ తిన్ననూరి సినిమా మొదలు పెట్టిన విజయ్ దేవరకొండ.

VD12 కంటే ముందు VD13 పూర్తి చేస్తున్నారు. గౌతమ్‌ది పాన్ ఇండియన్ సినిమా కావడం.. స్పాన్ ఎక్కువ కావడంతో అది హోల్డ్‌లో పెట్టారు. దాంతో మ్యాజిక్ అనే మరో చిన్న సినిమా చేసారు గౌతమ్.

ఈ చిత్ర ఫస్ట్ లుక్ లాంఛ్‌లోనే విజయ్ సినిమాపై క్లారిటీ ఇచ్చారు నిర్మాత నాగవంశీ. ఫ్యామిలీ స్టార్ కోసమే గౌతమ్ తిన్ననూరి సినిమాకు బ్రేక్ ఇచ్చామని.. అది అవ్వగానే ఇది సెట్స్‌పైకి వస్తుందని తెలిపారు నాగవంశీ.

ఈ లెక్కన మార్చ్ నుంచి గౌతమ్ సినిమాతో బిజీ కానున్నారు రౌడీ హీరో. ఇది 2 భాగాలుగా రానుందని తెలుస్తుంది.

ఇందులో పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నారు విజయ్. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్నారు. మొత్తానికి VD12 ఆగిపోలేదు.. ఆన్ ది వే అంటూ ఆన్సర్ ఇచ్చారు నాగవంశీ.





























