- Telugu News Photo Gallery Cinema photos Natural Star Nani New Movie With One More New Director in 2024 Telugu Heroes Photos
Natural Star Nani: నానికి అంత ధైర్యమేంటి.. అతనొక్కడికే ఎలా సాధ్యం.? ట్రేండింగ్ లో నాని.
మిగిలిన హీరోలకు సాధ్యం కాని ఆ రికార్డును మళ్లీ మళ్లీ నాని మాత్రమే ఎలా అందుకుంటున్నారు..? ఏడాదిలో ఒక్కసారి అలా చేయడానికే హీరోలు భయపడుతుంటే.. నాని ఒక్కడే వరసగా ఎందుకలా చేస్తున్నారు.? ఆయనకు అంత ధైర్యం ఎక్కడ్నుంచి వచ్చింది..? అప్‌కమింగ్ డైరెక్టర్స్, కొత్త దర్శకులను మాత్రమే నాని పిక్ చేసుకోవడంలో ఉన్న ఆంతర్యమేంటి.? నాని అని కొడితే డిక్షనరీలో పర్ఫెక్ట్ ప్లానింగ్ అని చూపిస్తుందేమో..? అంతగా తన కెరీర్ ప్లాన్ చేసుకుంటుంటారు న్యాచురల్ స్టార్.
Updated on: Jan 31, 2024 | 12:47 PM

మిగిలిన హీరోలకు సాధ్యం కాని ఆ రికార్డును మళ్లీ మళ్లీ నాని మాత్రమే ఎలా అందుకుంటున్నారు..? ఏడాదిలో ఒక్కసారి అలా చేయడానికే హీరోలు భయపడుతుంటే.. నాని ఒక్కడే వరసగా ఎందుకలా చేస్తున్నారు.?

ఆయనకు అంత ధైర్యం ఎక్కడ్నుంచి వచ్చింది..? అప్‌కమింగ్ డైరెక్టర్స్, కొత్త దర్శకులను మాత్రమే నాని పిక్ చేసుకోవడంలో ఉన్న ఆంతర్యమేంటి.? నాని అని కొడితే డిక్షనరీలో పర్ఫెక్ట్ ప్లానింగ్ అని చూపిస్తుందేమో..? అంతగా తన కెరీర్ ప్లాన్ చేసుకుంటుంటారు న్యాచురల్ స్టార్.

మరీ ముఖ్యంగా దర్శకుల ఎంపికలో నానిది డిఫెరెంట్ స్టైల్. రెండేళ్లుగా అప్‌కమింగ్ లేదంటే కొత్త దర్శకులకే ఛాన్సిస్తున్నారు నాని. దాని ఫలితమే శ్యామ్ సింగరాయ్, దసరా, హాయ్ నాన్న లాంటి సినిమాలు.

గతేడాది శ్రీకాంత్ ఓదెల, శౌర్యు లాంటి దర్శకులను ఇండస్ట్రీకి పరిచయం చేసారు నాని. ప్రస్తుతం నానితో సరిపోదా శనివారం తెరకెక్కిస్తున్న వివేక్ ఆత్రేయ అనుభవం కూడా 3 సినిమాలే.

అంటే సుందరానికి తర్వాత ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇది. దీని తర్వాత బలగం వేణు, ఛత్రపతి విలన్ సుప్రీత్ రెడ్డి దర్శకత్వంలో ఒకరితో నాని సినిమా చేయబోతున్నారని తెలుస్తుంది.

వేణు చెప్పిన కథ నానికి నచ్చింది. దీనికి ఎల్లమ్మ అనే టైటిల్ కూడా పరిశీలిస్తున్నారు. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించే అవకాశాలున్నాయి.

అలాగే ఛత్రపతిలో కాట్రాజ్‌గా నటించిన సుప్రీత్ రెడ్డి దర్శకుడిగా మారుతున్నారు. ఈ మధ్యే నానికి ఓ యాక్షన్ కథ చెప్పి ఒప్పించినట్లు తెలుస్తుంది.

వేణు, సుప్రీత్‌లలో ఎవరితో ప్రాజెక్ట్ వర్కవుట్ అయినా.. నాని మళ్లీ కొత్త వాళ్లకు ఛాన్స్ ఇచ్చినట్లే.




